- Home
- Sports
- Cricket
- యువీ, ఇషాంత్, నా గురించి అబద్ధాలు చెబుతున్నారు! నేను ఎప్పుడూ అలాగే ఉంటా... టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే
యువీ, ఇషాంత్, నా గురించి అబద్ధాలు చెబుతున్నారు! నేను ఎప్పుడూ అలాగే ఉంటా... టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే
ఎన్నో అంచనాలతో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నాడు అనిల్ కుంబ్లే. అయితే అప్పటి భారత సారథి విరాట్ కోహ్లీతో అభిప్రాయ బేధాలు రావడంతో అర్దాంతరంగా టీమిండియా హెడ్ కోచ్ పొజిషన్ నుంచి తప్పుకున్నాడు అనిల్ కుంబ్లే...

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీని టీమిండియా కెప్టెన్ పొజిషన్ నుంచి తప్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయడానికి ప్రధాన కారణం కూడా అనిల్ కుంబ్లే ఎపిసోడే... కుంబ్లేతో సంధి చేసుకోవాల్సిందిగా సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ చెప్పినా పట్టించుకోలేదు విరాట్ కోహ్లీ..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్‌లో టీమిండియా చిత్తుగా ఓడిపోవడానికి కూడా అనిల్ కుంబ్లే మీద కోపమే కారణమని చాలా మంది అభిప్రాయం. ఆ ట్రోఫీ గెలిస్తే అనిల్ కుంబ్లే హెడ్ కోచ్‌గా కొనసాగుతాడేమోననే భయంతోనే కోహ్లీసేన కావాలని ఓడిపోయిందని అంటారు..
విరాట్ కోహ్లీ, టీమిండియా ప్లేయర్లు.. అనిల్ కుంబ్లేని చూసి అంతలా భయపడిపోవడానికి లేదా అతను వద్దని గట్టిగా ఫిక్స్ అవ్వడానికి ప్రధాన కారణం అతని హెడ్ మాస్టర్ బిహేవియరే. క్రమశిక్షణ విషయంలో పక్కగా ఉండే అనిల్ కుంబ్లే, ప్లేయర్లతో చాలా సీరియస్‌గా ఉంటాడు..
ప్రస్తుతం ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టెస్టు సిరీస్‌కి కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న అనిల్ కుంబ్లే గురించి ఇదే రకమైన వ్యాఖ్యలు చేశాడు టీమిండియా సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మ...
‘అనిల్ భాయ్‌ని చూస్తుంటే నాకు భయమేస్తుంది. ఆయన డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్నా, కామెంటరీ బాక్సులో ఉన్నా చాలా సీరియస్‌గా ఉంటారు... ’ అంటూ కామెంట్ చేశాడు ఇషాంత్ శర్మ. దీనికి అనిల్ కుంబ్లే కౌంటర్ ఇచ్చాడు..
‘ఇషాంత్ శర్మ, యువరాజ్ సింగ్ ఇద్దరూ నా గురించి లేనిపోని పుకార్లు పుట్టిస్తున్నారు. నేను అంత స్ట్రిక్‌గా ఉండను. నేను ఈ మధ్యనే యువరాజ్, సచిన్ టెండూల్కర్‌లను కలిశాను. యువీ కూడా ఇదే చెప్పాను.. నేను చాలా సరదగా ఉంటాను..
Image credit: Getty
అయితే ఫీల్డ్‌లో ప్లేయర్ల నుంచి బెస్ట్ పర్ఫామెన్స్ రాబట్టాలంటే మాత్రం కఠినంగా ఉండాలి. సీరియస్‌గానే చెప్పాలి. అందుకే ఆన్ ఫీల్డ్‌లో అలా ఉండను..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ స్పిన్నర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే..