MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • CSK vs PBKS: ధోనీ శిష్యుడి దెబ్బకు పంజాబ్ బౌలర్లు విలవిల.. ఆయుష్ మాత్రే ఛీట్ చేశాడా?

CSK vs PBKS: ధోనీ శిష్యుడి దెబ్బకు పంజాబ్ బౌలర్లు విలవిల.. ఆయుష్ మాత్రే ఛీట్ చేశాడా?

Ayush Mhatre : ఐపీఎల్ 2026లో సీఎస్కే vs పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో బ్యాట్ కొలత విషయంలో అంపైర్ పొరపాటు వల్ల గందరగోళం నెలకొంది. అనంతరం యంగ్ బ్యాటర్ ఆయుష్ మాత్రే 73 పరుగులతో విరుచుకుపడ్డాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 03 2026, 09:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చెపాక్ లో హైడ్రామా: అయుష్ మాత్ర బ్యాట్ టెస్ట్‌లో ఫెయిల్
Image Credit : Getty

చెపాక్ లో హైడ్రామా: అయుష్ మాత్ర బ్యాట్ టెస్ట్‌లో ఫెయిల్

చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరిగిన ఐపీఎల్ 2026 ఏడో మ్యాచ్‌లో ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. నాలుగో ఓవర్ చివరి బంతికి సంజూ శాంసన్ అవుట్ అయిన తర్వాత, 18 ఏళ్ల యువ ఆటగాడు ఆయుష్ మాత్రే క్రీజులోకి వచ్చాడు.

ఐపీఎల్ నిబంధనల ప్రకారం అంపైర్ అభిజిత్ భట్టాచార్య బ్యాట్ మందాన్ని పరీక్షించే గేజ్‌తో తనిఖీ చేశారు. అయితే, ఆయుష్ బ్యాట్ ఆ గేజ్‌లో పట్టకపోవడంతో అది నిబంధనల కంటే ఎక్కువ మందం ఉందని అంపైర్ ప్రకటించారు. దీంతో మాత్రే తన డగౌట్ నుండి మరో బ్యాట్ తెప్పించుకున్నాడు. ఆశ్చర్యకరంగా రెండో బ్యాట్ కూడా పరీక్షలో విఫలమైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అంపైర్ చేసిన ఆ పెద్ద పొరపాటు ఏమిటి?
Image Credit : X/CelebrityGalax

అంపైర్ చేసిన ఆ పెద్ద పొరపాటు ఏమిటి?

మైదానంలో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. అయితే, తన బ్యాట్‌లో ఎటువంటి లోపం లేదని ఆయుష్ మాత్రే అంపైర్‌తో వాదించి, మరొకసారి తనిఖీ చేయమని కోరాడు. ఈ క్రమంలో అంపైర్ అభిజిత్ భట్టాచార్య తాను బ్యాట్ గేజ్‌ను తప్పుగా పట్టుకున్నట్లు గ్రహించారు. తన పొరపాటును సరిదిద్దుకుని మళ్లీ పరీక్షించగా, ఆయుష్ బ్యాట్ నిబంధనలకు లోబడే ఉందని తేలింది. దీంతో అంపైర్ క్షమాపణలు కోరి మాత్రేను బ్యాటింగ్ కొనసాగించడానికి అనుమతించారు. ఈ డ్రామా కారణంగా మ్యాచ్ కొద్దిసేపు నిలిచిపోయింది.

UMPIRE TOOK TIME FOR CHECKING BAT OF AYUSH MHATRE #AyushMhatre #SanjuSamson #PBKS #CSK #PBKSvsCSK #ShreyasIyer pic.twitter.com/EJCgrDIVqD

— Somesh Jangra (@CelebrityGalax) April 3, 2026

35
బౌలర్లపై విరుచుకుపడ్డ 18 ఏళ్ల సంచలనం మాత్రే
Image Credit : Getty

బౌలర్లపై విరుచుకుపడ్డ 18 ఏళ్ల సంచలనం మాత్రే

అయితే, అంపైర్ల గందరగోళం ఆయుష్ మాత్రే ఏకాగ్రతను మాత్రం దెబ్బతీయలేకపోయింది. ప్రారంభంలో మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు డాట్ బాల్స్ ఆడిన మాత్రే.. ఆ తర్వాత జేవియర్ బార్ట్లెట్ ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు బాది ఊపు అందుకున్నాడు. కేవలం 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసిన ఆయుష్, చెపాక్ మైదానంలో సీఎస్కే తరపున అతి చిన్న వయసులో హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది తన ఫామ్‌ను చాటుకున్నాడు.

45
గైక్వాడ్ తో కీలక భాగస్వామ్యం.. మాత్రే రికార్డులు ఇవే..
Image Credit : ANI

గైక్వాడ్ తో కీలక భాగస్వామ్యం.. మాత్రే రికార్డులు ఇవే..

మొత్తంగా 43 బంతులు ఎదుర్కొన్న ఆయుష్ మాత్రే 73 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 5 అద్భుతమైన సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (22 బంతుల్లో 28) తో కలిసి రెండో వికెట్‌కు 96 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. గైక్వాడ్ అవుట్ అయిన కొద్దిసేపటికే విజయ్‌కుమార్ వైశాఖ్ బౌలింగ్‌లో మాత్రే పెవిలియన్ చేరాడు. 18 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు సాధించిన జాబితాలో మాత్రే ఇప్పుడు రెండు, మూడు స్థానాల్లో (94, 73 పరుగులు) నిలిచాడు. మొదటి స్థానంలో వైభవ్ సూర్యవంశీ (101) ఉన్నాడు.

55
CSK vs PBKS : తుది జట్లు ఇవే..
Image Credit : ANI

CSK vs PBKS : తుది జట్లు ఇవే..

ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా, చెన్నై జట్టు మ్యాథ్యూ షార్ట్ స్థానంలో ప్రశాంత్ వీర్‌ను జట్టులోకి తీసుకుంది.

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 : సంజూ శాంసన్ (కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్.

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 : ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (కీపర్), కూపర్ కానోలీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
IPL 2026 : ప్లేఆఫ్స్ చేరే ఆ నాలుగు జట్లు ఇవే.. డిఫెండింగ్ ఛాంపియన్ RCBకి షాక్
Recommended image2
Cameron Green: కేకేఆర్ కొంపముంచిన రనౌట్.. 25 కోట్ల ప్లేయర్‌ను తిట్టిపోసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved