- Home
- Sports
- Cricket
- యశస్వి జైస్వాల్ సెంచరీని చూడలేకపోయిన తండ్రి... కొడుకు సక్సెస్ కోసం కాలినడకన కాన్వార్ యాత్ర...
యశస్వి జైస్వాల్ సెంచరీని చూడలేకపోయిన తండ్రి... కొడుకు సక్సెస్ కోసం కాలినడకన కాన్వార్ యాత్ర...
అండర్19 వరల్డ్ కప్ 2020 టోర్నీ నుంచి యశస్వి జైస్వాల్ పేరు, క్రికెట్ ప్రపంచంలో వినిపిస్తూనే ఉంది. దేశవాళీ టోర్నీల్లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్, ఐపీఎల్ 2023 సీజన్‌లో మెరుపులు మెరిపించి... వెస్టిండీస్ టూర్‌లో టెస్టు, టీ20 టీముల్లో చోటు దక్కించుకున్నాడు..

Yashasvi Jaiswal
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన యశస్వి జైస్వాల్, బ్యాటింగ్‌కి ఏ మాత్రం అనుకూలించని పిచ్ మీద భారీ సెంచరీ సాధించాడు.. 387 బంతుల్లో 16 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 171 పరుగులు చేసి అవుట్ అయ్యాడు యశస్వి జైస్వాల్..
Yashasvi Jaiswal
మూడు రోజులు సాగిన మొదటి టెస్టులో, మూడు రోజులూ బ్యాటింగ్ చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచిన యశస్వి జైస్వాల్.. ఆరంగ్రేటం టెస్టులో అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారత బ్యాటర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు..
Yashasvi Jaiswal
యశస్వి జైస్వాల్ సెంచరీని ఆయన తండ్రి భూపేంద్ర జైస్వాల్ వీక్షించలేకపోయాడు. తొలి టెస్టులో కొడుకు యశస్వి జైస్వాల్, అంతర్జాతీయ ఆరంగ్రేటం చేయబోతున్నాడన్న విషయం తెలుసుకున్న భూపేంద్ర జైస్వాల్.. అతని సక్సెస్‌ని ఆకాంక్షిస్తూ కాన్వార్ యాత్రకు కాలినడకన బయలుదేరాడు..
ఉత్తరప్రదేశ్ నుంచి జార్ఖండ్‌లోని డియోఘర్‌కి దాదాపు 900 కి.మీ.లు కాలి నడకన నడవాలని నిర్ణయం తీసుకున్నాడు భూపేంద్ర జైస్వాల్. ‘నా కొడుకు సెంచరీ చేయడం ఆనందంగా ఉంది. ఈ సెంచరీ, డబుల్ సెంచరీ కావాలని కోరుకుంటున్నా...’ అంటూ మనసులో మాట బయటపెట్టాడు భూపేంద్ర జైస్వాల్...
యశస్వి జైస్వాల్ తమ్ముడు తేజస్వి జైస్వాల్, తల్లి కంచన్ జైస్వాల్ మాత్రం ముంబైలోని కొత్త ఇంట్లో, మ్యాచ్‌ని వీక్షించారు. ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత ముంబైలో ఓ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు తీసుకున్న యశస్వి జైస్వాల్, టీమిండియాకి సెలక్ట్ అయిన తర్వాత ఫైవ్ బెడ్ రూమ్ ఇంటికి మకాం మార్చారు..