MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • ఓవల్‌లో విజయావకాశాలెవరికి..? ఆధిపత్యం ఎవరిది..? రికీ పాంటింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఓవల్‌లో విజయావకాశాలెవరికి..? ఆధిపత్యం ఎవరిది..? రికీ పాంటింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

WTC Final 2023: వచ్చే నెల 7 నుంచి 11 వరకూ  ఇంగ్లాండ్ లోని ది ఓవల్ వేదికగా   జరుగబోయే  వరల్డ్  టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో భారత్ - ఆస్ట్రేలియాలు తలపడనున్నాయి.

2 Min read
Author : Srinivas M
Published : May 19 2023, 08:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు  జూన్ 7 నుంచి ఇంగ్లాండ్ లోని ‘ది ఓవల్’ వేదికగా జరుగబోయే  ఐసీసీ వరల్డ్  టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో  పాల్గొననున్నాయి. ఈ మేరకు రెండు దిగ్గజ జట్లు ఇప్పటికే ఈ మెగా ట్రోఫీని దక్కించుకునేందుకు  ప్రణాళికలు రచిస్తున్నాయి.   భారత్ కు ఇది వరుసగా రెండో ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ కాగా ఆసీస్ కు మాత్రం ఇదే మొదటిది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Image credit: PTI

Image credit: PTI

ఈ నేపథ్యంలో ఓవల్ లో  విజయావకాశాలు ఎక్కువ ఎవరికి ఉన్నాయి..?  ఇక్కడ ఆధిపత్యం ఎవరు చెలాయించే అవకాశం ఉంది..? ఈ మ్యాచ్ లో కీలక ఆటగాళ్లు ఎవరు..? వంటి  విషయాలపై ఆస్ట్రేలియా మాజీ సారథి, ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్  కు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న  రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

37
Image credit: ICC/Facebook

Image credit: ICC/Facebook

ఢిల్లీలో స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాంటింగ్ మాట్లాడుతూ.. ‘ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరుగబోయే  డబ్ల్యూటీసీ ఫైనల్  చాలా ఎగ్జయిటింగ్ కాంటెస్ట్. ఇదేమీ  రెండు జట్ల మధ్య   రెగ్యులర్ గా జరిగే  టెస్టు మ్యాచ్ కాదు.  గడిచిన రెండేండ్లుగా  అత్యుత్తమ ప్రదర్శనలు చేసిన రెండు జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి.  అంతేగాక ఈ రెండు జట్లూ  ప్రపంచంలోనే బెస్ట్ టీమ్స్ గా ఉన్నాయి.  

47
Image credit: PTI

Image credit: PTI

ఇండియా - ఆస్ట్రేలియా తటస్థ వేదికపై ఆడుతుండటం నన్ను మరింత ఎగ్జయిటింగ్ కు గురిచేస్తున్నది.  ఈ సందర్భంగా నాకు ఓవల్ లో నేను ఆడిన రోజులు గుర్తుకొస్తున్నాయి. నా అభిప్రాయం ప్రకారం ఇక్కడి పరిస్థితులు కాస్త ఆస్ట్రేలియాకే అనుకూలంగా ఉంటాయి.    ఆసీస్ లో కూడా దాదాపు ఇలాంటి వాతావరణమే ఉంటుంది.   

57

ఒకవేళ ఈ ఫైనల్ భారత్ లో జరిగుంటే నేను కచ్చితంగా ఆస్ట్రేలియాకు కష్టమే అని చెప్పేవాడిని.  అదే విధంగా ఆస్ట్రేలియాలో  జరిగుంటే భారత్ కూ కష్టమయ్యేది. ఇది తటస్థ వేదిక అయినా  ఆసీస్ కే  కాస్త ఎడ్జ్ ఉంటుంది..’అని చెప్పాడు. 

67

ఈ మ్యాచ్ లో  స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, విరాట్ కోహ్లీల ఆట చూడాలని వాళ్లే హాట్ ఫేవరేట్స్ అని చాలా మంది  అభిప్రాయపడుతున్నారు. కానీ  పాంటింగ్ మాత్రం  ఈ టెస్టులో  తాను ఉస్మాన్ ఖవాజా ఆట చూడాలని  కోరుకుంటున్నట్టు చెప్పాడు.  అతడు మంచి ఫామ్ లో ఉన్నాడని,  అదే ఫామ్ ను కొనసాగిస్తే భారత్ కు కష్టాలు తప్పవని అన్నాడు. 

77

ఇక  డబ్ల్యూటీసీ ఫైనల్ లో టాస్ అంత కీలకమేమీ కాదని తానైతే దానిని నమ్మనని చెప్పాడు.  న్యూజిలాండ్, సౌతాఫ్రికా వంటి చోట టాస్ కీలకమే గానీ  ఇలాంటి (ఓవల్) పిచ్ పై  టాస్ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అన్నాడు. టాస్ గెలిచినంత మాత్రానా మ్యాచ్ గెలిచినట్టు కాదని  పాంటింగ్ తెలిపాడు. 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved