ఇక వృద్ధిమాన్ సాహా కెరీర్ ముగిసినట్టేనా... కోహ్లీ కాబట్టి కెప్టెన్సీ కోల్పోయాడు...
టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతల నుంచి రవిశాస్త్రి తప్పుకున్నప్పటి నుంచి భారత జట్టులో లుకలుకలు మొదలయ్యాయి. రాహుల్ ద్రావిడ్ భారీ అంచనాలతో హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టినా, జట్టులో విరాట్ కోహ్లీ ప్రభవం తగ్గించడానికే బీసీసీఐ అడుగులు వేస్తున్నట్టు అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు...

టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం, మూడు ఫార్మాట్లలో అతను కెప్టెన్సీ కోల్పోవడానికి కారణమైంది...
కోహ్లీకి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి మధ్య తలెత్తిన విభేదాలే విరాట్ మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ కోల్పోవడానికి కారణమని క్రికెట్ ఫ్యాన్స్‌కి బాగా తెలుసు...
రెండేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోవడం, ఐసీసీ టైటిల్స్ గెలవలేకపోవడంతో విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై పెద్ద దుమారం రేగలేదు...
తాజాగా భారత సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా బీసీసీఐ సెలక్టర్లపై, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌పై, భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు...
37 ఏళ్ల వృద్ధిమాన్ సాహా, వికెట్ కీపింగ్ స్కిల్స్ విషయంలో వరల్డ్ క్లాస్ టాప్ వికెట్ కీపర్. భారత మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి కూడా చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పాడు...
ఎమ్మెస్ ధోనీ, ఆ తర్వాత రిషబ్ పంత్‌ల కారణంగా వృద్ధిమాన్ సాహాకి అనుకున్నన్ని అవకాశాలు రాలేదు. అయినా ఏనాడూ ఇలాంటి ఆరోపణలు చేయలేదు సాహా...
ఇప్పుడు తనను రిటైర్మెంట్ తీసుకోవాల్సిందిగా రాహుల్ ద్రావిడ్ సూచించాడని, ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తానని చెప్పిన గంగూలీ, లంక సిరీస్ నుంచి తప్పించాడని సాహా కామెంట్లు చేయడం చూస్తుంటే భారత క్రికెట్ టీమ్‌లో సంచలన మార్పులు చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్టు అర్థమవుతోంది...
సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో అప్పటి హెడ్ కోచ్ గ్రెగ్ ఛాపెల్, జట్టులో సమూలమైన మార్పులు చేశాడు. గంగూలీని కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా ఫీల్డింగ్‌లో బద్ధకంగా ఉండే ప్లేయర్లను జట్టు నుంచి తప్పించాడు..
ఇప్పుడు రాహుల్ ద్రావిడ్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా టీమ్‌పై తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు టీమ్‌లో జరుగుతున్న మార్పులే అందుకు నిదర్శనం...
విరాట్ కోహ్లీ వరల్డ్ క్లాస్ నెం.1 బ్యాటర్ కాబట్టి బీసీసీఐపై, ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీపై కామెంట్లు చేయడంతో కేవలం కెప్టెన్సీ మాత్రమే కోల్పోయాడు...
ఇప్పుడు టెస్టు టీమ్‌లో సెకండ్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ఉన్న వృద్ధిమాన్ సాహా ఇలాంటి కామెంట్లు చేయడంతో అతని కెరీర్ ముగిసినట్టే అని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు...
శ్రీలంకతో సిరీస్‌కి వృద్ధిమాన్ సాహాని ఎంపిక చేయని సెలక్టర్లు, అతన్ని మళ్లీ జట్టులోకి తీసుకురావడానికి గట్టి కారణాలు కావాలని చెప్పొచ్చని భావిస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...