WPL 2025: మహిళా ఐపీఎల్ 2025.. ఏ జట్టు బలమైనది? లైవ్ ఫ్రీగా ఎక్కడ చూడాలి?
WPL 2025: మహిళా ఐపీఎల్ గా గుర్తింపు పొందిన డబ్ల్యూపీఎల్ మూడో ఎడిషన్ శుక్రవారం ఘనంగా ప్రారంభం కానుంది. ఈ మెగా మహిళా క్రికెట్ లీగ్ ను ఎక్కడ ఫ్రీగా చూడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

WPL 2025: ఐపీఎల్ ప్రపంచంలోనే ధనిక క్రీడా టోర్నీలలో ఒకటి. 2025 సీజన్ మార్చిలో జరుగుతుంది. పురుషుల ఐపీఎల్ తరహాలోనే మహిళలకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) పేరుతో మహిళా ఐపీఎల్ నిర్వహిస్తున్నారు. ఈ మెగా లీగ్ శుక్రవారం (ఫిబ్రవరి 14న) నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఉత్తరప్రదేశ్ వారియర్స్, ముంబై ఇండియన్స్ జట్లు పోటీపడుతున్నాయి.
మహిళా ప్రీమియర్ లీగ్ 2025 ఫిబ్రవరి 14న ప్రారంభమవుతుంది. వడోదరలో జరిగే తొలి మ్యాచ్‌లో ప్రస్తుత ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ తలపడతాయి. ఈ ఏడాది మహిళా ఐపీఎల్ వడోదర, బెంగళూరు, లక్నో, ముంబై నగరాల్లో జరుగుతుంది. ఢిల్లీలో మ్యాచ్‌లు నిర్వహించడం లేదు.
మహిళా ఐపీఎల్
మరోసారి ట్రోఫీపై కన్నేసిన ఆర్సీబీ
డబ్ల్యూపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టులో స్మృతి మంధాన, శ్రేయాంక పాటిల్, ఎలిస్ పెర్రీ, రిచా ఘోష్, ఢిల్లీలో మెగ్ లానింగ్, జెమిమా రోడ్రిగ్స్, షిఖా పాండే, గుజరాత్‌లో బెత్ మూనీ, ఆష్లీగ్ గార్డనర్, ప్రకాశిక నాయక్, ఉత్తరప్రదేశ్‌లో షమరి అథపత్, సోఫీ ఎక్లెస్టోన్, స్వేతా సెహ్రావత్, ముంబైలో హర్మన్‌ప్రీత్ కౌర్, జి కమలిని, సైకా ఇషాక్ వంటి స్టార్ ప్లేయర్లు ఉండటంతో మరోసారి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.
స్మృతి మంధాన
డబ్ల్యూపీఎల్ లో గుజరాత్, ఆర్సీబీ జట్లు ఇవే:
గుజరాత్ జెయింట్స్ జట్టు: ఆష్లే గార్డ్నర్ (కెప్టెన్), హర్లీన్ డియోల్, ప్రకాశిక నాయక్, బెత్ మూనీ, కాశ్వీ గౌతమ్, ప్రియా మిశ్రా, భారతి ఫుల్మాలి, లారా వాల్వోర్డ్ట్, సయాలి చట్చార్, డేనియల్ గిబ్సన్, మన్నత్ కశ్యప్, షబ్నం షకిల్, దయాలన్ హేమలత, డి సింఫీల్డ్, మేఘనా సింగ్, మేఘనా సింగ్, తనుజా కన్వర్.
ఆర్సీబీ జట్టు: స్మృతి మంధాన (కెప్టెన్), ఆశా శోభన జాయ్, జోషిత విజయ్, రిచా ఘోష్, డానీ వ్యాట్, కనికా అహుజా, సబినేని మేఘన, ఏక్తా బిష్ట్, కేట్ క్రాస్, శ్రేయంకా పాటిల్, ఎల్లీస్ పెర్రీ, ప్రేమ రావత్, జార్జియా బాహ్మ్, రేణుకా సింగ్, సోఫీ మోలిన్యూక్స్.
జి కమలిని
డబ్ల్యూపీఎల్ లో ఢిల్లీ, యూపీ జట్లు ఇవే:
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: మెగ్ లాన్నింగ్ (కెప్టెన్), ఆలిస్ కాప్సే, సారా ప్రైస్, అన్నాబెల్లె సదర్లాండ్, మిన్ను మణి, షఫాలి వర్మ, అరుంధతి రెడ్డి, ఎన్ సరాని, శిఖా పాండే, జెమిమా రోడ్రిగ్స్, నందిని కశ్యప్, స్నేహ దీప్తి, జెస్ జోనాసెన్, నిక్కీ ప్రసాద్, థానియా భాటియా, మార్చిసనే కాప్, రాధా యాదవ్, టిటాస్ సాధు.
యూపీ వారియర్స్ జట్టు: సమరి అటాఫత్ (కెప్టెన్), అలానా కింగ్, గౌహర్ సుల్తానా, సైమా ఠాకూర్, అలిస్సా హీలీ, గ్రేస్ హారిస్, శ్వేతా సెహ్రావత్, అంజలి సర్వాణి, కిరణ్ నవ్క్రే, సోఫీ ఎక్లెస్టోన్, ఆరుషి గోయల్, క్రాంతి గౌడ్, తహ్లియా మెక్‌గ్రాత్, రాజేశ్వరి గైక్వాడ్, బృందా దినేష్.
డబ్ల్యూపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు:
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అక్షితా మహేశ్వరి, పూజా వస్త్రాకర్, అమన్‌దీప్ కౌర్, హేలీ మాథ్యూస్, సైకా ఇషాక్, అమన్‌జోత్ కౌర్, జిందిమణి కలిత, సజీవన్ సజన, అమేలియా ఖేర్, కీర్తన బాలకృష్ణన్, సంస్కృతి గుప్తా, క్లోయ్ ట్రియోన్, నదిన్ డి క్లెర్క్, షబ్నిమ్ ఇస్మాయిల్, జి కమలినీ, నటాలీ స్కైవర్-బ్రాండ్ట్, యాస్టికా భాటియా.
డబ్ల్యూపీఎల్ ఎక్కడ ఫ్రీగా చూడాలి?
మహిళా ఐపీఎల్ (WPL 2025) మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. స్పోర్ట్స్18 నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. జియో సినిమా యాప్‌లో కూడా చూడవచ్చు.