WPL 2025 : మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నీ షెడ్యూల్ వచ్చేసింది !
WPL 2025 Schedule: ఫిబ్రవరి 14 నుంచి WPL 2025 టోర్నీ ప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి మ్యాచ్‌లో గుజరాత్‌తో తలపడనుంది. పూర్తి షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఐపీఎల్ టోర్నీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈలోగా అభిమానులకు శుభవార్త అందింది. ఇప్పుడు WPL షెడ్యూల్ విడుదలైంది. చాలా రౌండ్ల చర్చల తర్వాత భరత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) షెడ్యూల్‌ను విడుదల చేసింది. తొలి మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గుజరాత్‌తో తలపడనుంది.
డబ్ల్యూపీఎల్ 2025 సీజన్ ఫిబ్రవరి 14 నుంచి మార్చి 15 వరకు నాలుగు వేదికల్లో జరుగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గురువారం ప్రకటించింది. మహిళల కోసం ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన ఫ్రాంచైజీ ఆధారిత టీ20 క్రికెట్ టోర్నమెంట్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మూడో ఎడిషన్ ఇది.
వడోదరలో కొత్తగా నిర్మించిన బీసీఏ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ జట్లు తొలి మ్యాచ్ లో తలపడనున్నాయి. తర్వాతి ఎనిమిది మ్యాచ్ ల కోసం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియానికి వెళ్లనుంది.
2025 మహిళా ప్రీమియర్ లీగ్ టోర్నీ ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కానుంది. ప్రత్యేకత ఏమిటంటే ఈసారి బెంగళూరు మహిళా ప్రీమియర్ లీగ్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. బెంగళూరుతో పాటు వడోదర, లక్నో, ముంబైలలో మహిళా ప్రీమియర్ లీగ్ టోర్నీలు జరుగుతాయి.
మూడో ఎడిషన్ మహిళా ప్రీమియర్ లీగ్‌లో మొత్తం 22 మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్ వడోదరలో జరుగుతుంది. గుజరాత్ జెయింట్స్‌తో స్మృతి మంధాన నాయకత్వంలోని రాయల్ చాలెజంర్స్ బెంగళూరు జట్టు (ఆర్సీబీ) తలపడుతుంది. 2024 ఎడిషన్‌లో ఆర్సీబీ ఛాంపియన్‌గా నిలిచింది. ప్రస్తుత ఛాంపియన్ ఆర్‌సిబి ఈసారి కూడా ట్రోఫీపై కన్నేసింది.
తొలి 6 మ్యాచ్‌ల తర్వాత మహిళా ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు బెంగళూరుకు మారుతాయి. బెంగళూరులో 8 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ దశలో చివరి మ్యాచ్ ముంబైలో మార్చి 11న జరుగుతుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి.
నాకౌట్ మ్యాచ్‌లు ముంబైలో జరుగుతాయి. మార్చి 13న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. మార్చి 15న ముంబైలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్‌ల సమయం ఇంకా ప్రకటించలేదు.
మహిళా ప్రీమియర్ లీగ్ టోర్నీలో నాలుగు జట్లు పాల్గొంటున్నాయి. ప్రస్తుత ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గత ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్, మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో పాటు యుపి వారియర్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు పాల్గొంటున్నాయి.
| WPL 2025 షెడ్యూల్ | |||
| తేదీ | మ్యాచ్ | ప్రారంభ సమయం | వేదిక |
| ఫిబ్రవరి 14, శుక్రవారం | గుజరాత్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | 7:30 PM | BCA స్టేడియం, వడోదర |
| ఫిబ్రవరి 15, శనివారం | ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ | 7:30 PM | BCA స్టేడియం, వడోదర |
| ఫిబ్రవరి 16, ఆదివారం | గుజరాత్ జెయింట్స్ vs యుపి వారియర్జ్ | 7:30 PM | BCA స్టేడియం, వడోదర |
| ఫిబ్రవరి 17, సోమవారం | ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | 7:30 PM | BCA స్టేడియం, వడోదర |
| ఫిబ్రవరి 18, మంగళవారం | గుజరాత్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ | 7:30 PM | BCA స్టేడియం, వడోదర |
| ఫిబ్రవరి 19, బుధవారం | UP వారియర్జ్ vs ఢిల్లీ క్యాపిటల్స్ | 7:30 PM | BCA స్టేడియం, వడోదర |
| ఫిబ్రవరి 21, శుక్రవారం | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ముంబై ఇండియన్స్ | 7:30 PM | ఎం చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు |
| ఫిబ్రవరి 22, శనివారం | ఢిల్లీ క్యాపిటల్స్ vs యూపీ వారియర్జ్ | 7:30 PM | ఎం చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు |
| ఫిబ్రవరి 24, సోమవారం | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs యూపీ వారియర్జ్ | 7:30 PM | ఎం చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు |
| ఫిబ్రవరి 25, మంగళవారం | ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ జెయింట్స్ | 7:30 PM | ఎం చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు |
| ఫిబ్రవరి 26, బుధవారం | ముంబై ఇండియన్స్ vs UP వారియర్జ్ | 7:30 PM | ఎం చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు |
| ఫిబ్రవరి 27, గురువారం | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ | 7:30 PM | ఎం చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు |
| ఫిబ్రవరి 28, శుక్రవారం | ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ | 7:30 PM | ఎం చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు |
| మార్చి 1, శనివారం | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ | 7:30 PM | ఎం చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు |
| మార్చి 3, సోమవారం | UP వారియర్జ్ vs గుజరాత్ జెయింట్స్ | 7:30 PM | ఎకానా స్టేడియం, లక్నో |
| మార్చి 6, గురువారం | UP వారియర్జ్ vs ముంబై ఇండియన్స్ | 7:30 PM | ఎకానా స్టేడియం, లక్నో |
| మార్చి 7, శుక్రవారం | గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ | 7:30 PM | ఎకానా స్టేడియం, లక్నో |
| మార్చి 8, శనివారం | UP వారియర్జ్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | 7:30 PM | ఎకానా స్టేడియం, లక్నో |
| మార్చి 10, సోమవారం | ముంబై ఇండియన్స్ vs గుజరాత్ జెయింట్స్ | 7:30 PM | CCI, ముంబై |
| మార్చి 11, మంగళవారం | ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | 7:30 PM | CCI, ముంబై |
| మార్చి 13, గురువారం | ఎలిమినేటర్ - లీగ్ దశలో 2వది vs లీగ్ దశలో 3వది | 7:30 PM | CCI, ముంబై |
| మార్చి 15, శనివారం | ఫైనల్ - లీగ్ దశలో 1వది vs ఎలిమినేటర్ విజేత | 7:30 PM | CCI, ముంబై |