MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • WPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి.. డబ్ల్యూపీఎల్ ఛాంపియన్ గా ముంబై ఇండియన్స్

WPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి.. డబ్ల్యూపీఎల్ ఛాంపియన్ గా ముంబై ఇండియన్స్

Women's Premier League (WPL 2025): ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 (WPL 2025) ఫైనల్ పోరు చివరి వరకు ఉత్కంఠగా సాగింది. ఢిల్లీ క్యాపిటల్స్ - ముంబై ఇండియన్స్ గెలుపు కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. కానీ, ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో ముంబై జట్టు విజయాన్ని అందుకుని ఛాంపియన్ గా నిలిచింది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 15 2025, 11:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

WPL 2025 - Delhi Capitals vs Mumbai Indians: మ‌హిళా ప్రీమియర్ లీగ్ 2025 (డ‌బ్ల్యూపీఎల్ 2025) ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ - ముంబై ఇండియన్స్ త‌ల‌ప‌డ్డాయి. శనివారం రాత్రి 7:30 గంటలకు ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు ఉత్కంఠ‌గా సాగింది. ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ నాయ‌క‌త్వంలో ముంబై ఇండియ‌న్స్ విజ‌యాన్ని అందుకుని ఛాంపియ‌న్ గా నిలిచింది. ముందుగా బౌలింగ్ లో అద‌ర‌గొట్టిన ఢిల్లీ టీమ్ బ్యాటింగ్ లో ప‌రుగులు చేయ‌డంలో కీల‌క ప్లేయ‌ర్లు విఫ‌లం కావ‌డంతో ఓటమి నుంచి త‌ప్పించుకోలేక‌పోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
WPL Final

WPL Final

ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ మెగ్ లాన్నింగ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొద‌ట బ్యాటింగ్ కు దిగిన ముంబై టీమ్ ప‌రుగులు చేయ‌డంలో తీవ్రంగా ఇబ్బంది ప‌డింది.  ముంబై ఇండియన్స్ తమ 20 ఓవర్లలో 149/7 ప‌రుగులు చేసింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 44 బంతుల్లో కీల‌కమైన‌ 66 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడారు. 

ఆ త‌ర్వాత ఢిల్లీ క్యాపిట‌ల్స్ 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 141 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. దీంతో ముంబై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండోసారి టైటిల్ గెలుచుకుంది. అంతకుముందు, ముంబై జట్టు 2023లో ఛాంపియన్‌గా నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడో ఫైనల్లో ఓటమిపాలైంది. ఢిల్లీ మూడు WPL ఫైనల్స్ ఆడింది. ఆ మూడింటిలోనూ ఓడిపోయింది.

33
wpl, Mumbai, wpl 2025,

wpl, Mumbai, wpl 2025,

మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ ఫలితాలు

2023- ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

2024 - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది.

2025 - ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ పై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ముంబై ఉంచిన 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులు చేసింది. మారిజాన్ కాప్ 26 బంతుల్లో అత్యధికంగా 40 పరుగులు చేసింది. చివరి ఓవర్లలో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడింది కానీ, జ‌ట్టుకు విజ‌యాన్ని అందించ‌లేక‌పోయింది. 18వ ఓవర్‌లో ఆమె నాట్ స్కైవర్ బ్రంట్ బౌలింగ్ లో ఔట్ అయ్యారు. అదే ఓవర్లో శిఖా పాండే ఖాతా తెరవకుండానే ఔట్ కావడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. చివరి ఓవర్లో ఢిల్లీ 14 పరుగులు చేయాల్సి వచ్చింది. నిక్కీ ప్రసాద్, శ్రీ చరణి (3 పరుగులు నాటౌట్) జట్టును విజయపథంలో నడిపించలేకపోయారు. నిక్కీ 23 బంతుల్లో 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved