2019 వన్డే వరల్డ్ కప్ ఫెయిల్యూర్‌కి సెలక్టర్లే కారణం! కోహ్లీకి సరైన టీమ్‌ని ఇవ్వలేదు.. - గౌతమ్ గంభీర్
2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీ లీగ్ స్టేజీలో వరుస విజయాలు అందుకుంది భారత జట్టు. లీగ్ స్టేజీలో 7 విజయాలు అందుకుని, టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్ చేరిన భారత జట్టు, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో పరాజయం పాలైంది...
వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీలో ఎమ్మెస్ ధోనీ, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, కెఎల్ రాహుల్ రూపంలో నలుగురు వికెట్ కీపర్లను ఎంపిక చేశారు సెలక్టర్లు..
నాలుగో స్థానంలో అద్భుతంగా రాణిస్తున్న అంబటి రాయుడిని కాదని, ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ని వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఎంపిక చేసింది సెలక్షన్ కమిటీ...
విజయ్ శంకర్ గాయపడినా అతని స్థానంలో అంబటి రాయుడికి వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన అంబటి రాయుడు, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు నిర్ణయం ప్రకటించాడు...
Dhoni-Kohli-Gambhir
‘ప్రపంచ క్రికెట్ చరిత్రలో భారత్‌కి అతి చెత్త సెలక్షన్ కమిటీ ఉంది. అంబటి రాయుడు లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్‌ని వరల్డ్ కప్‌కి ఎంపిక చేయలేదు...
Vijay Shankar
అంబటి రాయుడిని సెలక్ట్ చేయకపోయినా అతని స్థానంలో వేరే బ్యాటర్‌ని సెలక్ట్ చేసినా బాగుండేది. టీమ్ సెలక్షన్ విషయంలో సెలక్షన్ కమిటీ చేసిన పొరపాట్లే, భారత జట్టు ఓటమికి ప్రధాన కారణం..
Dhoni-Kohli-Ravi Shastri
కెప్టెన్‌కి, హెడ్ కోచ్‌కి ఏం కావాలి? టీమ్ అవసరాలు ఏంటి? అనే విషయాలను కూడా తెలుసుకోకుండా టీమ్‌ని సెలక్ట్ చేశారు. అప్పుడు ఛైర్మెన్ ఎవరో కూడా నాకు గుర్తు లేదు కానీ 2019 వన్డే వరల్డ్ కప్ ఓటమికి మాత్రం వాళ్లే బాధ్యులు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...
dhoni rishabh
విజయ్ శంకర్ గాయపడడంతో అతని స్థానంలో రిషబ్ పంత్‌ని వరల్డ్ కప్‌కి ఎంపిక చేశారు సెలక్టర్లు. అప్పటికే ధోనీ, దినేశ్ కార్తీక్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లు ఉన్నా, పంత్‌ని ప్రపంచ కప్‌కి సెలక్ట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది..
‘విజయ్ శంకర్‌ని సెలక్ట్ చేయడం వల్ల అతను బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అతను త్రీడీ ప్లేయర్‌లా టీమ్‌కి ఉపయోగపడతాడు... ’ అంటూ కామెంట్ చేశాడు అప్పటి సెలక్షన్ కమిటీ ఛైర్మెన్ ఎమ్మెస్కే ప్రసాద్. ‘వరల్డ్ కప్ మ్యాచులు చూసేందుకు త్రీడీ గ్లాసెస్ ఆర్డర్ పెట్టా’ అంటూ అంబటి రాయుడు చేసిన ట్వీట్, పెను దుమారం రేపింది..