ప్రపంచ క్రికెట్‌లో ఏ ప్లేయరు కోరుకోని టాప్-4 రికార్డులు
worst cricket records : ప్రపంచ క్రికెట్‌లో గొప్ప రికార్డులతో పాటు చెత్త రికార్డులు కూడా చాలానే నమోదయ్యాయి. ఏ క్రికెటర్ కూడా తన పేరు మీద ఇలాంటి రికార్డులు ఉండాలని కోరుకోడు. అలాంటి నాలుగు రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
muttaiah muralidharan
1. సున్నా పరుగుల వద్ద అత్యధిక ఔట్లు..
క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన లెజెండరీ బౌలర్ ముత్తయ్య మురళీధరన్. శ్రీలంక క్రికెట్ రూపురేఖలను పూర్తిగా మార్చిపడేసిన ఈ స్టార్ 1347 వికెట్లు తీసుకున్నా అంతర్జాతీయ క్రికెట్ లో ప్రత్యేక గుర్తింపు సాధించాడు. కానీ, అతని పేరుతో ఇప్పటికీ ఒక చెత్త రికార్డు ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సార్లు సున్నా వద్ద ఔట్ అయిన బ్యాట్స్‌మెన్ ముత్తయ్య మురళీధరన్. ముత్తయ్య మురళీధరన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధికంగా 59 సార్లు సున్నాకే ఔటయ్యాడు.
2. తొంభైల ఔట్ రికార్డు
ప్రపంచంలోని ఏ క్రికెటర్ తన పేరిట ఈ రికార్డు సృష్టించాలని అనుకోడు. అలాంటిది సచిన్ టెండూల్కర్ దురదృష్టం కొద్ది చాలా సార్లు 90-99 పరుగుల మధ్య ఔట్ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ చేయడం ప్రతి బ్యాట్స్‌మెన్ కల. సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు కొట్టి చరిత్ర సృష్టించాడు. కానీ, అతని కెరీర్ లో ఏకంగా 28 సార్లు 90-99 పరుగుల మధ్య ఔట్ అయ్యాడు. టెస్ట్‌లో 18 సార్లు, వన్డే క్రికెట్‌లో 10 సార్లు నైంటీస్‌లో పెవిలియన్ కు చేరాడు.
3. మూడు ఫార్మాట్లు.. ఒక ఓవర్ లో అత్యధిక పరుగులు
టీ20 ఇంటర్నేషనల్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న చెత్త రికార్డు ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ పేరిట ఉంది. 2007 టీ20 ప్రపంచ కప్ లో స్టువర్ట్ బ్రాడ్ ఒకే ఓవర్‌లో 36 పరుగులు ఇచ్చాడు. అలాగే, వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన డాన్ వాన్ బంగే అతని ఓవర్‌లో అత్యధికంగా 36 పరుగులు చేశాడు. అలాగే, టెస్ట్ క్రికెట్‌లో ఒక ఓవర్ లో స్టువర్ట్ బ్రాడ్ అత్యధికంగా 35 పరుగులు సమర్పించుకున్నాడు.
4. టెస్ట్ క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక సంఖ్యలో నో బాల్‌లు
క్రికెట్ ఫార్మాట్ ఏదయినా సరే అదనపు పరుగులు ఇచ్చే బౌలర్ ను ఎవరూ ఇష్టపడరు. కాబట్టి అలాంటి చెత్త రికార్డును తమ పేరుమీద ఉండటం ఏ ప్లేయర్ కు ఇష్టముండదు. అయితే టెస్టు క్రికెట్‌లో ఒక ఓవర్‌లో అత్యధిక నో బాల్‌లు వేసిన ఆటగాడిగా వెస్టిండీస్‌కు చెందిన కర్ట్లీ ఆంబ్రోస్ చెత్త రికార్డు సృష్టించాడు. కానీ, అతను టెస్ట్ క్రికెట్‌లో 400 కంటే ఎక్కువ వికెట్లు తీసిన ఒక స్టార్. 1993 ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లోని పెర్త్ టెస్ట్‌లో ఒకే ఓవర్‌లో 9 నో బాల్స్ వేశాడు. ఈ ఓవర్ 15 బంతులు. ఇది టెస్ట్ క్రికెట్ లో అత్యంత పోడవైన ఓవర్ గా నిలిచింది.