- Home
- Sports
- Cricket
- ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించాం, కానీ న్యూజిలాండ్‌తో... - టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ...
ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించాం, కానీ న్యూజిలాండ్‌తో... - టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ...
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ ఫేవరెట్ అంటూ బ్రెండన్ మెక్‌కల్లమ్‌తో పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే భారత సారథి విరాట్ కోహ్లీ మాత్రం ఈ వ్యాఖ్యలపై భిన్నంగా స్పందించాడు.

ముంబైలో బీసీసీఐ ఏర్పాటుచేసిన బయో బబుల్ జోన్‌లో క్వారంటైన్ గడిపిన భారత క్రికెటర్లు, ప్రత్యేక ఛార్టెడ్ ఫ్లైట్‌లో లండన్ బయలుదేరి వెళ్లారు. ఈ టూర్‌కి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన భారత సారథి విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.

‘వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ని తేలిగ్గా తీసుకోవడం లేదు. ఎందుకంటే ఐపీఎల్ నుంచి టెస్టు ఫార్మాట్‌కి తగ్గట్టుగా మారడం పెద్ద సవాలే. అయితే మేం కొన్నేళ్లుగా మంచి విజయాలు సాధిస్తున్నాం. ఆ విజయాలతో సంతోషంగా ఉన్నాం.

ఫైనల్ మ్యాచ్‌కి ఒత్తిడిలో బరిలో దిగాలని అనుకోవడం లేదు. ఇది ఒక మ్యాచ్ మాత్రమే. అయితే మేం ఇదొక్కటే గెలవాలని అనుకోవడం లేదు. కొన్నేళ్ల పాటు టీమిండియాను టాప్‌లో ఉంచాలనేదే నా ప్రధాన లక్ష్యం.

ఇంగ్లాండ్ పరిస్థితులు, న్యూజిలాండ్‌కి అనుకూలంగా ఉంటాయని అంటున్నారు. మేం ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలోనే ఓడించాం. అంటే ఇప్పుడు పిచ్, వాతావరణ పరిస్థితులతో జట్టు పర్ఫామెన్స్‌కి ఎలాంటి సంబంధం ఉండదు.

ఎవరు బాగా ఆడితే, వారికే విజయం దక్కుతుంది... అయితే న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయం’ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ.

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడిన తర్వాత 42 రోజుల పాటు ఖాళీగా ఉంటుంది భారత జట్టు. ఈ గ్యాప్‌లో భారత జట్టు ఏం చేస్తుందనేదానిపై క్లారిటీ లేదు. ఇదే ప్రశ్న, విరాట్ కోహ్లీకి కూడా ఎదురైంది.

‘బిజీ షెడ్యూల్‌తో గడుపుతున్న క్రికెటర్లకు ఈ గ్యాప్ చాలా మంచిదే. ఐదు టెస్టుల సిరీస్‌కి ముందు దొరికిన ఈ సమయాన్ని రిలాక్స్ అవ్వడానికి ఉపయోగించుకుంటాం.

మాకు చిల్ అవ్వడానికి, కుటుంబంతో గడపడానికి సమయం దొరుకుతుంది. అలాగే ప్రాక్టీస్ చేయడానికి కావాల్సినంత టైం ఉంటుంది... ’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ.

జూన్ 2న లండన్ ఫ్లైట్ ఎక్కిన భారత పురుషుల జట్టు, మళ్లీ సెప్టెంబర్ 15నే తిరిగి స్వదేశానికి రానుంది. అదే సమయంలో ఐపీఎల్ షెడ్యూల్ ఖరారు కావడంతో అటు నుంచి అటే యూఏఈ వెళ్తారు భారత క్రికెటర్లు. ఐపీఎల్ ముగిసిన తర్వాత టీ20 వరల్డ్‌కప్ కూడా ఆడతారు.