Paris Olympic 2024: వరల్డ్ మోస్ట్ ఫేమస్ నెంబర్.2 టీటీఈ స్వప్నిల్ కుసాలే.. మరి నెంబర్.1 ఎవరు? ఎందుకు?
World Most Famous Railway TTE: గురువారం జరిగిన పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్‌లో స్వప్నిల్ కుసాలే బ్రాంజ్ మెడల్ గెలిచాడు. ఈ విభాగంలో భారత్ కు తొలి పతకాన్ని అందించి చరిత్ర సృష్టించాడు.
World Most Famous Railway TTE : షూటర్ స్వప్నిల్ కుసాలే పారిస్ ఒలింపిక్స్ 2024లో 3 పొజిషన్ రైఫిల్ ఈవెంట్‌లో ఒలింపిక్ పతకం సాధించి తొలి భారతీయ షూటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.వృత్తిరీత్యా సెంట్రల్ రైల్వేస్ టీటీఈ అయిన కుసాలే ఇప్పుడు ప్రపంచంలోనే ప్రసిద్ద రెండో రైల్వే టీటీఈగా గుర్తింపు సాధించాడు. గత 10 సంవత్సరాల నుంచి స్వప్నిల్ కుసాల్ సెంట్రల్ రైల్వేస్‌లో టీటీఈగా పనిచేస్తున్నాడు.
పనితో పాటు పూణేలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఉంటూ షూటింగ్ లో శిక్షణ పొందుతున్నాడు. స్వప్నిల్ తన జీవితంలో ఎక్కువ భాగం కొల్హాపూర్ సమీపంలోని కుటుంబానికి దూరంగా గడిపాడు. ఈ గ్రామం డ్రగ్స్, ఆల్కహాల్ రహితంగా అలాగే సేంద్రియ వ్యవసాయానికి ప్రసిద్ధి చెందింది. ఇలాంటి పరిస్థితులే కుసాల్ ను చిన్న వయస్సులోనే సెంట్రల్ రైల్వేస్ లో జాబ్ సాధించడం, టిక్కెట్ కలెక్టర్‌గా విధుల నిర్వహిస్తూనే షూటింగ్ కెరీర్ లో అత్యున్నత స్థాయికి చేరుకునేలా చేశాయి.
అతను తన మొదటి రైఫిల్ కోసం తన మొదటి ఆరు నెలల జీతాన్ని వెచ్చించాడనీ, దాని ధర రూ. 3 లక్షల కంటే ఎక్కువని స్వప్నిల్ కుసలే తండ్రి సురేష్ కుసాలే చెప్పినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, ఆసియా క్రీడలు 2022 షూటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన స్వప్నిల్ కుసలే మొత్తంగా ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న 7వ భారతీయ షూటర్‌గా నిలిచాడు.
MS Dhoni Swapnil Kusale
29 ఏళ్ల అతను 2012 లండన్ ఒలింపిక్స్ పతక విజేత గగన్ నారంగ్, చైన్ జింగ్ వంటి వారిని ఓడించి తన మొదటి సీనియర్ జాతీయ టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో 2015లో తనదైన ముద్ర వేసినప్పటి నుండి అతని ప్రయాణం అద్భుతంగా ముందుకు సాగుతోంది. ఆసియా క్రీడల నిరాశ తర్వాత, 2022లో జరిగిన బాకు ప్రపంచ కప్‌లో తన మొట్టమొదటి వ్యక్తిగత ISSF ప్రపంచ కప్ పతకానికి 50 మీటర్ల రైఫిల్ లో రజతం సాధించాడు.
എം എസ് ധോണി
స్వప్నిల్ కుసాల్ మాదిరిగానే అంతకుముందు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రయాణం సాగింది. ఎందుకంటే ఎంఎస్ ధోని కూడా భారత క్రికెట్ కు నాయకత్వం వహించకముందు భారతీయ రైల్వేలో టిక్కెట్ కలెక్టర్ గా పనిచేశాడు. టీటీఈ కొనసాగుతూనే క్రికెట్ ప్రయాణం సాగించాడు. భారత క్రికెట్ జట్టులోకి అడుగుపెట్టి తనదైన ముద్ర వేశాడు.
భారత జట్టును మూడు ఫార్మాట్ లలో ఛాంపియన్ గా నిలబెట్టిన లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోని. కెప్టెన్ కూల్ గా గ్రౌండ్ లో అదరగొట్టే ప్రదర్శనలు ఇచ్చి భారత జట్టుకు అనేక విజయాలు అందించాడు. అందుకే ధోని వరల్డ్ మోస్ట్ ఫేమస్ రైల్వే టీటీఈగా గుర్తింపు సాధించాడు. దాదాపు చాలా దగ్గరి పోలికలు ఉన్న స్వప్నిల్ కుసాలే ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ 2024 లో బ్రాంజ్ మెడల్ సాధించి వరల్డ్ మోస్ట్ ఫేమస్ నెంబర్.2 టీటీఈగా నిలిచాడు. రైల్వే ఉద్యోగి నుంచి ఛాంపియన్ క్రీడాకారులుగా భారత కీర్తిని ఈ ఇద్దరు పెంచారు.