ప్రపంచ కప్ 2019: టీమిండియాకు మూడొచ్చేనా... ఆ మూడు అడ్డుకునేనా!!

First Published 29, May 2019, 9:28 PM IST

ప్రపంచ వ్యాప్తంగా వున్న  క్రికెట్ ప్రియులను అలరించేందులకు ప్రపంచ కప్  మరోసారి సిద్దమయ్యింది. నాలుగేళ్లకోసారి జరిగే ఆ విశ్వ క్రీడలో విజేతగా నిలవాలని ప్రతి జట్టు ఆశపడుతుంది. కానీ ఆ అవకాశం కేవలం ఒకే జట్టుకు లభిస్తుంది. ఇలా వరల్డ్ కప్ టైటిట్ ఆశించి  భంగపడ్డ జట్లన్ని మరో నాలుగేళ్లపాటు ఎదురుచూడాల్సిందే. ఇలా ఇప్పటివరకు కేవలం నాలుగు జట్లు మాత్రమే ప్రపంచ కప్ ను ముద్దాడగలిగాయి. 

ఈ ఐసిసి వన్డే వరల్డ్ కప్ చరిత్రను ఓసారి పరిశీలిస్తే ఆస్ట్రేలియా ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ జట్టు ఏకంగా ఐదుసార్లు ఈ ట్రోపీని ఎగరేసుకుపోయింది. 1987  అలెన్ బోర్డర్, 1999 స్టీవ్ వాఘ్, 2003,2007 లలో వరుసగా రెండుసార్లు రికీ పాంటింగ్, 2015 లో జరిగిన చివరి వరల్డ్ కప్ మైకెల్ క్లార్క్ సారథ్యంలో ఆసిస్ ప్రపంచ  విజేతగా నిలిచింది.

ఇక ఆ తర్వాత అత్యధికంగా అంటే రెండుసార్లు ప్రపంచ కప్ విజేతగా నిలిచిన ఘనత టీమిండియాతో పాటు విండీస్ కు దక్కుతుంది. మొదటి రెండు వరల్డ్ కప్  ట్రోపీలను క్లైవ్ లాయిడ్ కెప్టెన్సీలో వెస్టిండిస్ సాధించగా, 1983 లో కపిల్ దేవ్, 2011 లో ఎంఎస్ ధోని సారథ్యంలో భారత్ విజేతగా నిలిచింది.

ఇక మన దాయాది పాకిస్థాన్, శ్రీలంక లు చెరోసారి ఈ ట్రోపీని అందుకున్నాయి. 1992 లో ఇమ్రాన్ ఖాన్ పాక్ ను, 1996 లో అర్జున్ రణతుంగ శ్రీలంకను ప్రపంచ కప్ విజేతలుగా నిలబెట్టారు.

ఇలా ఇప్పటివరకు కేవలం నాలుగు జట్లు మాత్రమే ప్రపంచ విజేతలుగా నిలిచాయి. క్రికెట్ కు పుట్టినిల్లయిన ఇంగ్లాండ్, హేమాహేమీ ఆటగాళ్లను కలిగిన దక్షిణాఫ్రికా,  సంచలనాలు సృష్టించగల సత్తావున్న న్యూజిలాండ్ ఒక్కసారి కూడా ఈ ట్రోపీని అందుకోలేకపోయాయి. అయితే ఈసారి ఎలాగైనా ప్రపంచ కప్ సాధించాలని ఈ  మూడు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి.

అలాగే టీమిండియా కూడా ఈ మెగా టోర్నీలో హాట్ పేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ప్రస్తుతం బ్యాటింగ్, బౌలింగ్ పరంగా చూసుకున్నా భారత జట్టు పటిష్టంగా  కనిపిస్తోంది. అలాగే గతకొంత కాలంగా స్వదేశంలోనే, విదేశాల్లోనూ కోహ్లీ సేన అదరగొడుతూ మంచి పామ్ లో వుంది. దీంతో ఈసారి వరల్డ్ కప్ ట్రోపీని టీమిండియా  సాధించే అవకాశాలే ఎక్కువగా వున్నాయని క్రికెట్ విశ్లేషకులతో పాటు మాజీ క్రికెట్ దిగ్గజాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ మధ్యకాలంలో కాస్త ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా కూడా ఈ ట్రోపీ విజయంతో గాడిన పడాలని చూస్తోంది. అంతేకాకుండా గతంలోని తమ  ఆధిపత్యాన్ని కొనసాగించి తమ సత్తా తగ్గలేదని నిరూపించుకోవాలని భావిస్తోంది. ఇలా ఆసిస్ గనుక ఈసారి ప్రపంచ విజేతగా మారితే ఆరో ట్రోపీని అందుకోనుంది.

వెస్టిండిస్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు కూడా 20వ శతాబ్దం తర్వాత క్రికెట్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయాయి. కాబట్టి ఈ 21 శతాబ్దంలో తమ ఆధిపత్యాన్ని ఈ  ప్రపంచ కప్ గెలుపుతో మొదలుపెట్టాలని చూస్తున్నాయి. తమదైనరోజున ఈ మూడు జట్లు ఎలాంటి సంచలనాలనైనా సృష్టించగలవు. కాబట్టి వీటిని మిగతా జట్లు  అంత ఈజీగా తీసుకోవడం లేదు.

ఇక బంగ్లాదేశ్, అప్ఘానిస్థాన్ లు పసికూనలే అయినా సన్నాహక మ్యాచుల్లో అద్భుతంగా ఆడాయి. అప్ఘాన్ అయితే ఏకంగా పాక్ ను ఓడించి రికార్డు విజయాన్న  నమోదుచేసుకుంది. అయితే ఈ రెండు కొన్ని మ్యాచుల్లో సంచలన విజయాలు నమోదుచేయవచ్చు కానీ టోర్నీ ఆసాంతం రాణించలేవు. కాబట్టి ఈ రెండు మిగతా  జట్ల అవకాశాలను దెబ్బతీయవచ్చు కానీ ప్రపంచ కప్ సాధించే అవకాశాలు చాలా తక్కువగా వున్నాయి.

loader