MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • నన్ను అక్కడ్నుంచి తీసేశారు.. నేను మీతో కూడా ఆడను.. రంజీ లకు ముందు బెంగాల్ కు షాకిచ్చిన సాహా

నన్ను అక్కడ్నుంచి తీసేశారు.. నేను మీతో కూడా ఆడను.. రంజీ లకు ముందు బెంగాల్ కు షాకిచ్చిన సాహా

Wriddhiman Saha:  కెరీర్ చరమాంకంలో ఉన్న టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కు బీసీసీఐ షాకిచ్చింది. దీంతో అతడు సొంత జట్టుకు.. 

2 Min read
Author : Srinivas M
| Updated : Feb 09 2022, 02:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కీలక నిర్ణయం తీసుకున్నాడు. బెంగాల్ కు చెందిన సాహా..   త్వరలో ప్రారంభం కాబోయే  రంజీ సీజన్ నుంచి తప్పుకున్నాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

వ్యక్తిగత కారణాలతో రంజీల నుంచి తప్పకుంటున్నట్టు ప్రకటించినా దాని వెనుకాల  వేరే కారణాలు ఉన్నట్టుగా తెలుస్తున్నది. భారత జట్టు నుంచి మెల్లగా కనుమరుగవుతున్న అతడు.. ఆ బాధతోనే   రంజీల నుంచి కూడా తప్పుకున్నట్టు సమాచారం. 

38

మొహాలి వేదికగా  వచ్చే నెల నుంచి భారత జట్టు.. శ్రీలంకతో   టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు గాను టీమిండియాలో అతడిని ఎంపిక చేయడం కష్టమేనని అతడికి బోర్డు వర్గాల నుంచి తెలిసింది. దీంతో అతడు భారత జట్టులో చోటు దక్కనప్పుడు రంజీలు ఆడి ఏం ఉపయోగమని  భావించి ఉంటాడని సాహాకు దగ్గరి వ్యక్తులు మీడియాతో చెప్పినట్టు తెలుస్తున్నది. 
 

48

న్యూజిలాండ్ తో ముగిసిన టెస్టు సిరీస్ లో సాహా ఆడాడు.  అయితే అప్పుడు రిషభ్ పంత్ కు విశ్రాంతినిచ్చిన  సెలెక్టర్లు.. సాహాకు  అవకాశమిచ్చారు. కానీ దక్షిణాఫ్రికా పర్యటనకు తిరిగి  పంత్ కే వికెట్ కీపింగ్ బాధ్యతలను అప్పజెప్పింది బీసీసీఐ. 

58

పంత్ కు సబ్ స్టిట్యూట్ గా  కోన భరత్ ను  తీర్చిదిద్దాలనే  భావనలో బీసీసీఐ ఉంది. తద్వారా అతడు కూడా   మెరుగవుతాడు. మరోవైపు సాహా కూడా  వయసు మీద పడుతుండటంతో గతంలో మాదిరిగా బ్యాటింగ్ లో రాణించడం లేదు. 

68

ఇదే విషయమై బీసీసీఐకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. ‘శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కు ఎంపిక చేయబోమని  జట్టు యాజమాన్యంలోని కీలక వ్యక్తులు సాహాకు నేరుగా చెప్పారు. పంత్ కు ప్రత్యామ్నయంగా భరత్  కు అవకాశం ఇవ్వాలని  సెలెక్టర్లు భావిస్తున్నారు. 

78

అతడిని ఇప్పట్నుంచే జట్టులో చేర్చితే పరిస్థితులకు అలవాటు పడతాడు. అందుకే సాహాను పక్కనపెట్టారు. దీంతో అతడు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కు ఈ రంజీ సీజన్ లో ఆడబోనని చెప్పి ఉంటాడు..’  అని తెలిపాడు. 
 

88

భారత్ తరఫున 40 టెస్టులు ఆడిన సాహా.. 1,353 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు కూడా ఉన్నాయి.  వికెట్ కీపర్ గా 104 మందిని  పెవిలియన్ కు పంపాడు. ఇందులో 92 క్యాచులు, 12 స్టంప్ అవుట్ లు ఉన్నాయి. 

About the Author

SM
Srinivas M
రిషబ్ పంత్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ZIM: 15 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. జింబాబ్వేను చిత్తు చేసిన టీమిండియా
Recommended image2
T20Iల్లో జింబాబ్వేపై అత్యధిక పరుగులు చేసిన టాప్-5 భారత బ్యాటర్లు వీరే.. నంబర్ వన్ ఎవరంటే?
Recommended image3
India vs Zimbabwe : ఇండియా, జింబాబ్వే T20 సీరిస్ అస్సలు మిస్సవ్వొద్దు.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved