MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Sports
  • Cricket
  • Team india: కెప్టెన్ శ్రేయస్‌కు తిక్క రేగింది.. టీమిండియా వరుస ఓటములపై లైవ్‌లోనే సీరియస్

Team india: కెప్టెన్ శ్రేయస్‌కు తిక్క రేగింది.. టీమిండియా వరుస ఓటములపై లైవ్‌లోనే సీరియస్

Team india: ఇంగ్లాండ్‌తో జరిగిన 4వ టీ20లో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమితో సిరీస్ ను కోల్పోయింది. వరుస సిరీస్ ఓటములపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ బౌలర్ల ప్లాన్స్ ను ఎండగట్టారు. లైవ్‌లోనే సీరియస్ అయ్యాడు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 10 2026, 10:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
IND vs ENG: 7 ఏళ్ల తర్వాత టీమిండియాకు ఘోర అవమానం.. శ్రేయస్ అయ్యర్ ఫైర్
Image Credit : bcci

IND vs ENG: 7 ఏళ్ల తర్వాత టీమిండియాకు ఘోర అవమానం.. శ్రేయస్ అయ్యర్ ఫైర్

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు మరో ఘోర పరాజయం ఎదురైంది. బ్రిస్టల్‌లో జరిగిన నాలుగో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు భారత్‌ను దారుణంగా ఓడించింది. ఏకంగా 37 బంతులు మిగిలి ఉండగానే, 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌ను ఇంగ్లాండ్ 3-0తో కైవసం చేసుకుని అజేయ ఆధిక్యంలో నిలిచింది.

గత 7 ఏళ్లలో భారత్ వరుసగా రెండు టీ20 సిరీస్‌లు ఓడిపోవడం ఇదే మొదటిసారి. చివరిసారిగా ఫిబ్రవరి 2019 లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో భారత్ వరుస సిరీస్‌లను కోల్పోయింది. అప్పట్లో న్యూజిలాండ్ 2-1తో, ఆస్ట్రేలియా 2-0తో భారత్‌ను ఓడించాయి. ఇప్పుడు మళ్లీ ఐర్లాండ్ (0-2), ఇంగ్లాండ్ చేతుల్లో భారత్ వరుస సిరీస్‌లను పారేసుకుంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆడిన గత 6 టీ20 మ్యాచ్‌లలో భారత్ 5 మ్యాచ్‌ల్లో ఓడిపోవడం గమనార్హం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మ్యాచ్ సాగిందిలా.. క్యూ కట్టిన బ్యాటర్లు
Image Credit : X/BCCI

మ్యాచ్ సాగిందిలా.. క్యూ కట్టిన బ్యాటర్లు

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ, భారత బ్యాటింగ్ లైన్ అప్ మరోసారి పూర్తిగా తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారత్ కేవలం 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ ముందు 159 పరుగుల సాధారణ టార్గెట్‌ను ఉంచింది.

లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. భారత బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ కేవలం 13.5 ఓవర్లలోనే ఒకే ఒక్క వికెట్ కోల్పోయి 159 పరుగులు చేసేశారు. దీంతో మ్యాచ్‌తో పాటు సిరీస్ కూడా ఇంగ్లాండ్ వశమైంది.

Related Articles

Related image1
Worlds Cheapest Electric Car: మార్కెట్‌ను షేక్ చేస్తున్న ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు
Related image2
IND vs ENG: వరుసగా 5 మ్యాచ్ లలో చిత్తు.. భారత్ ఓటమికి టాప్ 5 కారణాలు ఇవే
35
సహనం కోల్పోయిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
Image Credit : bcci

సహనం కోల్పోయిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

వరుసగా రెండు టీ20 సిరీస్‌లు ఓడిపోవడంతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. "మరోసారి మాకు తీవ్ర నిరాశే ఎదురైంది. స్కోరు బోర్డుపై 158 పరుగులు ఏమాత్రం సరిపోవు. ఇంగ్లాండ్ ఎంత వేగంగా మ్యాచ్‌ను ముగించిందో మనమంతా చూశాం. మేము బౌలింగ్‌కు వచ్చేటప్పుడు, బౌలర్లకు ఒకటే చెప్పాను. మిడిల్ స్టంప్, లెగ్ స్టంప్ పైభాగంలో పడేలా ఒకే లెంగ్త్‌లో పదే పదే బౌలింగ్ చేయమని అడిగాను. ఎందుకంటే అక్కడ షాట్లు కొట్టడం, బౌండరీలు బాదడం చాలా కష్టం" అని శ్రేయస్ వివరించాడు.

45
ప్లాన్స్ సరిగ్గా వర్కౌట్ కాలేదు.. యంగ్ ప్లేయర్లకు గుణపాఠం
Image Credit : Getty

ప్లాన్స్ సరిగ్గా వర్కౌట్ కాలేదు.. యంగ్ ప్లేయర్లకు గుణపాఠం

టీమ్ అనుకున్న ప్లాన్‌ను గ్రౌండ్‌లో సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయిందని శ్రేయస్ అయ్యర్ ఒప్పుకున్నాడు. "మా ప్లాన్స్ సరిగ్గా పని చేయలేదు. బౌలింగ్‌లో స్పీడ్ మార్చడానికి లేదా ఏదైనా కొత్తగా ట్రై చేయడానికి చూసినప్పుడు, ఆ చెత్త బాల్స్‌ను ఇంగ్లాండ్ బ్యాటర్లు బాగా వాడుకుని రన్స్ చేశారు. ప్రస్థుతం టీమ్ ఒక ట్రాన్సిషన్ ఫేజ్‌లో ఉంది. కాబట్టి చాలా తప్పులు జరుగుతాయి. ఇంగ్లాండ్ కండిషన్స్‌లో ఇక్కడి యంగ్ ప్లేయర్లు చాలా మంది ఫస్ట్ టైమ్ ఆడుతున్నారు. ఈ తప్పుల నుంచే విదేశీ పిచ్‌లపై ఎలా ఆడాలో, పరిస్థితులకు ఎలా అలవాటు పడాలో వాళ్లకు అర్థమవుతుంది" అని అయ్యర్ పేర్కొన్నాడు.

అలాగే, "చేసిన తప్పుల నుండి ఎంత త్వరగా నేర్చుకుంటే టీమ్‌కు అంత మంచిది. మా టీమ్‌లో త్వరగా నేర్చుకునే ప్లేయర్స్ ఉన్నారని నాకు నమ్మకం ఉంది. వాళ్లు కచ్చితంగా సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుని, నెక్స్ట్ మ్యాచ్‌లో స్ట్రాంగ్‌గా కంబ్యాక్ ఇస్తారు" అని ఆశాభావం వ్యక్తం చేశాడు.

55
శ్రేయస్ ఒంటరి పోరాటం.. తర్వాతి మ్యాచ్ ఎప్పుడంటే?
Image Credit : X/BCCI

శ్రేయస్ ఒంటరి పోరాటం.. తర్వాతి మ్యాచ్ ఎప్పుడంటే?

ఈ ఘోర పరాజయంలో భారత్‌కు దక్కిన ఏకైక పాజిటివ్ పాయింట్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ మాత్రమే. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన శ్రేయస్ 49 బంతుల్లో 163.27 స్ట్రైక్ రేట్‌తో 5 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ.. "నా పర్ఫార్మెన్స్ పట్ల హ్యాపీగానే ఉన్నా. కానీ, టీమ్‌ గెలవనప్పుడు ఈ రన్స్‌కు ఎలాంటి వాల్యూ ఉండదు. నేను ఎప్పుడు ఆడినా టీమ్‌ను గెలిపించడానికే చూస్తాను. కానీ ఈరోజు మా బ్యాడ్ లక్. నెక్స్ట్ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నాం" అని అన్నాడు.

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 వర్షం వల్ల రద్దయింది. ఆ తర్వాత మాంచెస్టర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 4 వికెట్లతో గెలిచింది. నాటింగ్‌హామ్‌లో జరిగిన మూడో మ్యాచ్‌లో ఏకంగా 125 పరుగుల తేడాతో హోస్ట్ టీమ్ విజయం సాధించింది. ఇప్పుడు నాలుగో మ్యాచ్ కూడా గెలవడంతో సిరీస్‌లో 3-0తో భారత్ వెనుకబడింది. ఈ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరిదైన ఐదో మ్యాచ్ జూలై 11న సౌతాంప్టన్‌లో జరగనుంది.

England win the 4th T20I by nine wickets to take a 3-0 lead in the series.

Scorecard ▶️ https://t.co/vKZQwVKyYP#TeamIndia | #ENGvINDpic.twitter.com/h8dw0OgWw6

— BCCI (@BCCI) July 9, 2026

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Tallest Cricketers : అత్యంత పొడగరి ఇండియన్ క్రికెటర్ ఇతడే... హైట్ ఎంతో తెలుసా?
Recommended image2
KL Rahul Love Story: బెంగళూరులో సీక్రెట్ మీటింగ్ నుంచి ఖండాలా పెళ్లి వరకు.. కేఎల్ రాహుల్ - అథియా శెట్టి లవ్ స్టోరీ ఇదే
Recommended image3
AUS vs BAN: 149 ఏళ్ల టెస్ట్ హిస్టరీలో బిగ్గెస్ట్ సంచలనం.. ఆస్ట్రేలియాకు సొంతగడ్డపైనే షాకిచ్చిన బంగ్లాదేశ్
Related Stories
Recommended image1
Worlds Cheapest Electric Car: మార్కెట్‌ను షేక్ చేస్తున్న ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు
Recommended image2
IND vs ENG: వరుసగా 5 మ్యాచ్ లలో చిత్తు.. భారత్ ఓటమికి టాప్ 5 కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved