ఉన్ముక్త్ చంద్ అందుకే ఫెయిల్ అయ్యాడు, విరాట్ కోహ్లీ అవుతాడనుకుంటే...
ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2008 గెలిచిన తర్వాత మెరుపు వేగంతో టీమిండియాలోకి దూసుకొచ్చాడు విరాట్ కోహ్లీ. అయితే 2012లో అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన యువ భారత కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ మాత్రం టీమిండియా తరుపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు...

దాదాపు 9 ఏళ్ల పాటు టీమిండియాలో చోటు కోసం, ఐపీఎల్‌లో అవకాశాల కోసం ఎదురుచూస్తూ గడిపేసిన ఉన్ముక్త్ చంద్, 2021లో భారత క్రికెట్‌కి రాజీనామా చేసి, యూఎస్‌కే తరలివెళ్లిపోయాడు...
విరాట్ కోహ్లీ సూపర్ సక్సెస్ సాధించిన తర్వాత భారీ అంచనాలతో క్రికెట్ ప్రపంచానికి పరిచయమైన ఉన్ముక్త్ చంద్ ఫెయిల్ అవ్వడానికి గల కారణాలను వివరించాడు భారత మాజీ క్రికెటర్ నిఖిల్ చోప్రా...
‘అండర్-19 తర్వాత రంజీ ట్రోఫీలో ఆడేటప్పుడు తనను తాను మార్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అప్పటిదాకా అబ్బాయిగా ఉండే ప్లేయర్, రంజీ ట్రోఫీలో ఓ యువకుడిగా పాల్గొనాల్సి ఉంటుంది...
అండర్-19 తోనే కుర్రతనం పోతుంది. రంజీ ట్రోఫీలో పాల్గొనే సమయానికి పరిణితి సాధించిన ఓ యువ క్రికెటర్‌లా ఆడాల్సి ఉంటుంది...
అండర్-19 వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ, ఢిల్లీ తరుపున రంజీ ట్రోఫీ ఆడాడు. ఆ సీజన్‌లో చాలా బాగా రాణించి, సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు...
కెరీర్ ఆరంభంలో జట్టులో కోల్పోయినా, దేశవాళీ టోర్నీల్లో నిలకడగా పరుగులు చేస్తుండడంతో సెలక్టర్లకు, విరాట్ కోహ్లీని పక్కనబెట్టడానికి కారణాలేమీ దొరకలేదు...
విరాట్ కోహ్లీతో పోలిస్తే, ఉన్ముక్త్ చంద్ ఈ మార్పు చూపించలేకపోయాడు. అండర్-19 ప్లేయర్‌గా సాధించిన దానితోనే సంతృప్తి చెందినట్టుగా రిలాక్స్ అయిపోయాడు...
ఉన్ముక్త్ చంద్‌లో చాలా టాలెంట్ ఉంది, అయితే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మాత్రం అతనికి తెలియలేదు. టీమిండియాకి సెలక్ట్ కావాలంటే మిగిలినవాళ్ల కంటే నువ్వు బెస్ట్ అని నిరూపించుకోవాలి...
విరాట్ కోహ్లీ చేసింది అదే, ఉన్ముక్త్ చంద్ చేయలేకపోయింది అదే... ’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ నిఖిల్ చోప్రా...
48 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 2690 పరుగులు చేసిన ఉన్ముక్త్, 79 లిస్టు ఏ మ్యాచుల్లో 2796 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తరుపున ఆడిన ఉన్ముక్త్ చంద్, 21 మ్యాచుల్లో 300 పరుగులు చేశాడు...
ఇక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో నిరాశచెందిన ఉన్ముక్త్ చంద్, 2021లో యూఎస్‌ఏకి మకాం మార్చాడు. అక్కడ మైనర్ క్రికెట్ లీగ్‌లో పాల్గొన్న ఉన్ముక్త్ చంద్, బిగ్ బాష్ లీగ్‌లో పాల్గొన్న మొట్టమొదటి భారత క్రికెటర్‌లా రికార్డు క్రియేట్ చేశాడు...
అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన 2008లోనే టీమిండియాలోకి వచ్చిన విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా, గత దశాబ్దంలో 20 వేల పరుగులు చేసిన ఏకైక ప్లేయర్‌గా రికార్డులు క్రియేట్ చేశాడు..