అందుకే ధోనీ ఎవ్వరినీ తిట్టనిచ్చేవాడు కాదు... మైదానంలో ఎవరైనా తిట్టినా...
మహేంద్ర సింగ్ ధోనీ... ‘కూల్ కెప్టెన్’, ‘మిస్టర్ కూల్’. ఎలాంటి పరిస్థితుల్లో అయినా చాలా కామ్‌గా కూల్‌గా ఉండే మహేంద్ర సింగ్ ధోనీ, అప్పుడప్పుడూ టెంపర్ కోల్పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే తోటి క్రికెటర్‌ను ఎప్పుతూ బూతులు తిట్టిన సంఘటనలు మాత్రం లేవు.

తన కూల్ యాటిట్యూడ్‌తోనే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ... కొన్నిసార్లు బౌలర్లు, ఫీల్డర్లు, తోటి క్రికెటర్లపై అరవడం కూడా జరిగింది.

ముఖ్యంగా సౌతాఫ్రికా టూర్‌లో తనని పట్టించుకోకుండా దిక్కులు చూస్తున్న నాన్‌స్ట్రైయికర్ మనీశ్ పాండేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ.

అలాగే 2019 ఐపీఎల్ సీజన్‌లో అయితే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే అంపైర్ వైడ్ ఇచ్చి, ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నాడని... ఏకంగా క్రీజులోకి వచ్చి వారితో గొడవ పెట్టుకున్నాడు ధోనీ...

అయితే ఏ సమయంలోనూ తోటి క్రికెటర్‌ని బూతులు తిట్టడం కానీ, తన జట్టులోని క్రికెటర్లని కానీ తిట్టనిచ్చేవాడు కాదట మహేంద్ర సింగ్ ధోనీ. దీనికి కారణం అతని సెంటిమెంట్ అట.

‘ఎదుటివారికి ఎలా సమాధానం చెప్పాలో అతనికంటూ ఓ స్పెషల్ స్టైల్ ఉంది. ఒకవేళ ఎవరైనా ఏదైనా అంటే తల్లిని, చెల్లిని తిట్టకుండా మాట్లాడాలని గట్టిగా చెప్పేవాడు మహేంద్ర సింగ్ ధోనీ...

ఒకవేళ ఎవరైనా నోరు జారి బూతులు తిడితే, వారిపై మందలించేవాడు. ఇంట్లో ఆడవాళ్లకి గౌరవం ఇవ్వాలని, ఎవరో తప్పు చేస్తే అమ్మ, సోదరిని తిట్టం భావ్యం కాదని చెప్పేవాడు...

మనం అనే ఒక మాటను ఎదుటివారిని వ్యక్తిగతంగా బాధించకూడదని ధోనీ అభిప్రాయం. అతను స్లెడ్జింగ్‌ని డీల్ చేసే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది... 2007లో మొదటిసారి కెప్టెన్ అయ్యాడు ధోనీ...

ఆ తర్వాత ఏడు సంవత్సరాలకి కూడా ధోనీ నిర్ణయంలో ఎలాంటి మార్పు రాలేదు. 2014-15 ఆస్ట్రేలియా టూర్‌లో విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, బ్రాడ్ హ్యాడ్డిన్ మధ్య గొడవ జరిగింది.

బ్రాడ్, కోహ్లీ మధ్య మాటామాటా పెరిగి కొట్టుకునేదాకా వెళ్లారు. ఆ సమయంలో కూడా ధోనీ, విరాట్ కోహ్లీని పర్సనల్‌గా వెళ్లి తిట్టకూడదని వారించాడు. ధోనీ ఎంట్రీతో ఆసీస్ ప్లేయర్లు కూడా తగ్గారు...

తన జట్టులోని సభ్యులతో ధోనీకి ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉండేది. అందుకే ధోనీ చెప్పగానే ప్లేయర్లు కూడా దాన్ని పాటించేవాళ్లు... ’ అంటూ చెప్పుకొచ్చాడు ‘ది ధోనీ టచ్’ పుస్తకం రాసిన రచయిత భరత్ సుదర్శన్.

2013 ఫైనల్‌కి ముందు ఐపీఎల్‌ను స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ముంచెత్తాయి. ఇద్దరు యువ సీఎస్‌కే ప్లేయర్లపై కూడా వేటు పడింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు అందరూ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు.

‘ముంబై ఇండియన్స్‌తో ఫైనల్ మ్యాచ్‌కి ముందు సీఎస్‌కే ప్లేయర్లు అందరూ టెన్షన్‌లో ఉండడాన్ని ధోనీ గమనించాడు. అందరూ కూడా ధోనీ ఏం మాట్లాడాతాడోనని ఎదురుచూస్తూ నిల్చున్నారు.

కానీ ధోనీ మాత్రం దాని గురించి ఏమీ మాట్లాడలేదు. ‘‘బాయ్స్... మనం ఫెయిర్ ప్లే అవార్డ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నాం. మీరేం చేస్తారో తెలీదు, మనం టాప్‌లో ముగించాలి. గుడ్ లక్’ అని కామెంట్ చేశాడు ధోనీ...’ అంటూ తెలిపాడు సుదర్శన్...