MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • భార్యతో ధావన్ విడాకులు.. అసలు ఎవరీ ఆయేషా ముఖర్జీ..?

భార్యతో ధావన్ విడాకులు.. అసలు ఎవరీ ఆయేషా ముఖర్జీ..?

ఆయేషా ముఖర్జీ.. మెల్ బోర్న్ లో మాజీ కిక్ బాక్సర్. ఆమె జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కిక్ బాక్సర్ గా గుర్తింపు పొందారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 08 2021, 10:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్.. తన భార్య ఆయేషా ముఖర్జీతో విడిపోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన భార్య ఆయేషా స్వయంగా వెల్లడించారు. గతంలోనే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న ఆయేషాను ప్రేమించి.. తొమ్మిది సంవత్సరాల క్రితం ధావన్ పెళ్లి చేసుకున్నాడు.  అయితే.. అనూహ్యంగా.. వీరు తమ పెళ్లి బంధానికి స్వస్తి పలికారు.

210

గత కొంతకాలం ధావన్, ఆయేషాల మధ్య మనస్పర్థలు చోటుచేసుకుంటున్నాయట. అందుకే వారు విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ విడాకుల సంగతి పక్కన పెడితే.. అసలు ధావన్ కి ఆయేషా ఎలా పరిచయం అయ్యింది.. అసలు ఎవరీ ఆయేషా అన్న విషయం తెలుసుకుందామా..

310

ఆయేషా ముఖర్జీ.. తో శిఖర్ ధావన్ కి ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది. వీరిద్దరికి టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కామన్ ఫ్రెండ్. అతని ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది.

410

ఆయేషా ముఖర్జీ.. మెల్ బోర్న్ లో మాజీ కిక్ బాక్సర్. ఆమె జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కిక్ బాక్సర్ గా గుర్తింపు పొందారు.

510

శిఖర్ ధావన్ ను వివాహం చేసుకోవడానికి ముందు... ఆయేషా ముఖర్జీ ఆస్ట్రేలియా వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. ఈ జంట 200లో తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. ఆమెకు ఆలియా అనే పేరు కూడా పెట్టారు. వారు 2005లో రియా అనే మరో కుమార్తెకు జన్మనిచ్చారు.
 

610

ఆయేషా ముఖర్జీ ఆంగ్లో ఇండియన్. బ్రిటీష్ సంతతికి చెందిన భారతీయ తల్లిదండ్రులకు ఆమె జన్మించారు. ఆయేషా పుట్టిన తర్వాత ఆమె కుటుంబం ఆస్ట్రేలియాకు వెళ్లింది. ఆ మె ఆ తర్వాత మెల్ బోర్న్ లో స్థిరపడ్డారు.
 

710

ఆయేషా ఆగస్టు 27, 1975లో జన్మించారు. ఆమె గత నెలలోనే 46 సంవత్సరాలు నిండియి. కాగా.. ధావన్, ఆయేషా దంపతలకు ఒక కుమారుడు కూడా ఉన్నారు.

810

కాగా.. ఆయేషా ఎక్కువ శాతం.. తలకు క్యాప్ పెట్టుకొని దర్శనమిస్తూ ఉంటారు. అయితే.. ఆమె అలా క్యాప్ పెట్టుకోవడానికి కారణమేంటా అని ఓ సారి మీడియా ప్రశ్నించగా ఆమె చెప్పిన సమాధానం విని అందరూ షాకయ్యారు.

910

కాగా.. ఆయేషా ఎక్కువ శాతం.. తలకు క్యాప్ పెట్టుకొని దర్శనమిస్తూ ఉంటారు. అయితే.. ఆమె అలా క్యాప్ పెట్టుకోవడానికి కారణమేంటా అని ఓ సారి మీడియా ప్రశ్నించగా ఆమె చెప్పిన సమాధానం విని అందరూ షాకయ్యారు.

1010

‘నేను చిన్న చిన్న విషయాలపై పెద్ద ఫోకస్ చేయను. నా రోజంతా చాలా బిజీగా గడిచిపోతుంది. కేవలం ముఖ్యమైన వాటిపైనే నేను ఎక్కువగా ఫోకస్ పెడతాను. ఫిట్నెస్ మీద నా దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత నేను కుటుంబానికి సమయం కేటాయిస్తాను. వంట చేయడం, పిల్లలను స్కూల్ కి పంపడం, వాళ్ల అవసరాలు తీర్చడం.. యూట్యూబ్ వీడియోలు  చేయడం.. ఇలా బిజీ బిజీగా గడిచిపోతుంది. దీంతో.. నాకు జుట్టు దువ్వుకోవడానికి కూడా సమయం ఉండదు. అందుకే ఎక్కువగా క్యాప్ పెట్టి కవర్ చేస్తుంటాను’ అని ఆమె చెప్పడం విశేషం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Zimbabwe : ఇది కదా కమ్ బ్యాక్ అంటే.. 2024లో జీరో.. 2026లో హీరో
Recommended image2
T20 World Cup 2026: సూపర్ 8లో భారత్, సౌతాఫ్రికాలకు జింబాబ్వే వార్నింగ్ !
Recommended image3
ఒకే ఒక్క మ్యాచ్‌లో 8 వికెట్లు.. భారత గడ్డపై అరుదైన రికార్డు సృష్టించాడు.. అతడెవరంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved