- Home
- Sports
- Cricket
- నువ్వు ఇప్పుడు కెప్టెన్‌వి కాదు బ్రో! లైట్ తీస్కో... షాకింగ్ విషయాలు బయటపెట్టిన విరాట్ కోహ్లీ...
నువ్వు ఇప్పుడు కెప్టెన్‌వి కాదు బ్రో! లైట్ తీస్కో... షాకింగ్ విషయాలు బయటపెట్టిన విరాట్ కోహ్లీ...
సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా... ఈ ఇద్దరికీ ఓ విషయంలో పోలిక ఉంది. టీమిండియాకి సంచలన విజయాలు అందించిన ‘దాదా’ సౌరవ్ గంగూలీ బలవంతంగా కెప్టెన్సీ నుంచి తప్పించబడితే, టెస్టుల్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా దాదాపు ఇదే పరిస్థితిని ఫేస్ చేశాడు...

వన్డే కెప్టెన్సీని బలవంతంగా తప్పించడంతో మనస్థాపం చెంది టెస్టు కెప్టెన్సీకి రిటైర్మెంట్ ఇచ్చాడు విరాట్ కోహ్లీ... రెడ్ బాల్ క్రికెట్‌లో ఏడేళ్లు, వైట్ బాల్ క్రికెట్‌లో నాలుగేళ్లు టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ, కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితిని ఫేస్ చేశాడు? ఈ విషయాన్ని ఆర్‌సీబీ పాడ్‌కాస్ట్‌లో బయటపెట్టాడు కోహ్లీ...
‘కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కొన్నిరోజులు టీమ్‌లో సర్దుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అలాంటిదేమీ లేదని అబద్ధం చెప్పొచ్చు కానీ ఇది ప్రతీ ఒక్కరికీ ఉండేది. కెప్టెన్‌గా టీమ్‌లో జరిగే ప్రతీ చిన్నదానికి బాధ్యత వహించిన నేను, ఆ పొజిషన్‌లో లేననే నిజాన్ని వొంటబట్టించుకోవడానికి చాలా సమయమే పట్టింది..
kohli
నేను కెప్టెన్‌ని కాదనే నిజాన్ని గ్రహించి, ఓ సాధారణ ఆటగాడిని ఉండడానికి చాలా శ్రమపడాల్సి వచ్చింది. కొన్నిసార్లు నాకు తెలియకుండానే ఏదో నిర్ణయం చెప్పడానికి ముందుకు వచ్చేవాడిని. అప్పుడు వెంటనే ‘నువ్వు కెప్టెన్‌వి కాదు బ్రో... లైట్ తీస్కో’ అని నాకు నేను చెప్పుకునేవాడిని..
చాలాసార్లు ఏదో చెప్పాలని అనుకునేవాడిని. అయితే నోటి దాకా వచ్చిన దాన్ని వెనక్కి తీసుకునేవాడిని. అప్పటికే నిర్ణయం తీసుకున్నాక మనం అభిప్రాయం చెప్పి ఎలాంటి లాభం ఉండదు. మన అభిప్రాయానికి విలువ లేదని తెలిసినా చెప్పడం అవివేకమే..
కెప్టెన్‌గా టీమ్‌లో హోదా అనుభవించిన తర్వాత ఓ సాధారణ ప్లేయర్‌గా ఉండేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. టీమ్‌లో మనల్ని ఒకలా చూసిన వాళ్లు కూడా కెప్టెన్సీ పోయిన తర్వాత మరోలా చూడడం మొదలెడతాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనసుని చాలా బాధపెడతాయి.
అయితే ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక దానికి కట్టుబడి ఉండాలి. ఆర్‌సీబీ విషయంలో నా నిర్ణయం సరైనదేనని అనిపించింది. ఫాఫ్ దగ్గరికి వెళ్లి, ఇది చేస్తే బాగుంటుందని ఏ విషయాన్నైనా గట్టిగా చెప్పగలను. నా నిర్ణయాన్ని అతను సంతోషంగా స్వీకరిస్తాడు.. అది అతను నాకిచ్చే గౌరవం..’ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ..