MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • 2004లో టీమిండియా, పాక్-A టీమ్‌తో ఓడిపోయింది! ఇప్పుడేమో ఇలా తయారైంది... - పాక్ మాజీ కెప్టెన్..

2004లో టీమిండియా, పాక్-A టీమ్‌తో ఓడిపోయింది! ఇప్పుడేమో ఇలా తయారైంది... - పాక్ మాజీ కెప్టెన్..

2023 ఆసియా కప్‌కి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో పాల్గొనేందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేసింది. అయితే భారత జట్టు, పాక్ గడ్డ మీద అడుగుపెట్టలంటే భారత ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉంటుంది. దీంతో కేంద్రం ఈ విషయంపై ఎలా స్పందిస్తుంది, టీమిండియా.. ఒకటిన్నర దశాబ్దం తర్వాత పాక్‌లో అడుగుపెడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 17 2022, 05:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చివరిసారిగా 2004లో పాకిస్తాన్‌లో పర్యటించింది టీమిండియా. ఈ పర్యటనలో ఐదు వన్డేలు, మూడు టెస్టులు ఆడింది. 1999 కార్గిల్ వివాదం తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్ ఇదే. 2003 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా చేతుల్లో చిత్తుగా ఓడిన పాకిస్తాన్, వన్డే సిరీస్‌లో 3-2 తేడాతో, టెస్టు సిరీస్‌ని 2-1 తేడాతో పరాజయం పాలైంది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
india vs pakistan 2003

india vs pakistan 2003

అయితే పాక్‌లో అడుగుపెట్టిన తర్వాత పాకిస్తాన్-A టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. పాక్ ఏ టీమ్ చేతుల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత జట్టు, ఆ తర్వాత వన్డే, టెస్టు సిరీస్‌లను సొంతం చేసుకుని సగర్వంగా స్వదేశానికి తిరిగి వచ్చింది...

36

తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 335 పరుగుల భారీ స్కోరు చేసింది. వీరేంద్ర సెహ్వాగ్ 75, సచిన్ టెండూల్కర్ 76 పరుగులు చేయగా రాహుల్ ద్రావిడ్ 69 బంతుల్లో 13 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 92 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు...

46

అయితే ఈ లక్ష్యాన్ని 24 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి, పర్యాటన జట్టుకి షాక్ ఇచ్చింది పాకిస్తాన్ ఏ టీమ్. తాఫీక్ ఉమర్ 104, ఇమ్రాన్ నజీర్ 32 బంతుల్లో 65 పరుగులు చేశాడు. నజీముల్లా 35, ఫైసల్ ఇక్బాల్ 50, ఖైసిర్ అబ్బాస్ 38 పరుగులు చేశారు...

56

‘టీమిండియా 2004లో పాకిస్తాన్‌కి వచ్చింది. అప్పుడు పాకిస్తాన్ A టీమ్ చేతుల్లో వాళ్లు ఓడిపోయారు. ఇప్పటికీ ఆ మ్యాచ్ నాకు ఇంకా గుర్తుంది. ఇమ్రాన్ నజీర్ ఆడిన ఇన్నింగ్స్ చాలా స్పెషల్. గడాఫీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టును A టీమ్ ఓడించిందంటే అప్పుడు రిజర్వు బెంచ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు...

66

సౌతాఫ్రికా టూర్‌కి పాకిస్తాన్ A టీమ్స్‌తో కలిసి వెళ్లాను. అండర్ 19 టూర్లు కూడా జరిగేవి. కానీ ఇప్పుడు అవేమీ లేవు. దీనికి ఎవరు బాధ్యులు. ఈ సిస్టమ్‌లో ఇన్ని మార్పులు తీసుకొచ్చింది ఎవరు? ఎవరిని నిందించాలి... ప్రశ్నలు చాలా ఉన్నాయి, కానీ సమాధానాలు చెప్పే వాళ్లే కనిపించడం లేదు..’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026: తెలుగమ్మాయి దెబ్బకు వరల్డ్ రికార్డులు బ్రేక్.. టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న శ్రీచరణి
Recommended image2
T20 World Cup: బంగ్లాపై గెలిచినా ఇండియాకు సెమీస్ టెన్షన్.. ఆసీస్‌ను కొడితేనే గండం గట్టెక్కేనా?
Recommended image3
RRR vs HEC : ఏంటిది రెడ్డిగారు.. రంగారెడ్డితో అలా చెడుగుడు ఆడేసుకున్నారు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved