MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మెగా క్రికెట్ స‌మ‌రానికి డేట్ ఫిక్స్.. ఐపీఎల్ 2025 ఎప్పుడంటే?

మెగా క్రికెట్ స‌మ‌రానికి డేట్ ఫిక్స్.. ఐపీఎల్ 2025 ఎప్పుడంటే?

IPL 2025 Schedule : ఐపీఎల్ మెగా వేలం 2025 వచ్చేసింది. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో 10 ఐపీఎల్ జట్ల (మూడేళ్ల) ఫ్యూచర్స్ ను రూపొందించనున్నారు. దీని కోసం ఇప్ప‌టికే అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఇదే సమయంలో రాబోయే మూడు ఐపీఎల్ సీజన్ల డేట్స్ కూడా వచ్చాయి.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 22 2024, 10:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Virat, Dhoni, Rohit

Virat, Dhoni, Rohit

IPL 2025 Schedule : క్రికెట్ ల‌వ‌ర్స్ కు గుడ్ న్యూస్. ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌ల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) థ్రిల్‌ను కూడా అభిమానులు చూడగలరు. ఎందుకంటే  నవంబర్ 22-26 వరకు పెర్త్‌లో తొలి టెస్టు జ‌ర‌గ‌నుంది. అదే సమయంలో నవంబర్ 24-25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఆట‌గాళ్ల కోసం ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మొత్తం 10 జట్లలో 204 ప్లేయ‌ర్ల స్థానాలు ఖాళీలు ఉండగా, 575 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేశారు. మెగా వేలానికి ముందు బీసీసీఐ తన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్ రాబోయే సీజన్ తేదీలను ప్రకటించింది. కేవ‌లం ఒక సీజన్‌లో మాత్రమే కాకుండా తదుపరి మూడు సీజన్‌ల మొదటి, చివరి మ్యాచ్‌ల తేదీలను విడుదల చేసింది.

35
Rishabh Pant,KL Rahul,Arshdeep Singh, IPL, IPL2025

Rishabh Pant,KL Rahul,Arshdeep Singh, IPL, IPL2025

ఐపీఎల్ రాబోయే సీజ‌న్లు ఎప్పుడు ప్రారంభం అవుతాయి? 

ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో నివేదిక ప్రకారం.. ఐపీఎల్ 18వ సీజన్ (ఐపీఎల్ 2025) వచ్చే ఏడాది మార్చి 14న ప్రారంభమవుతుంది. ఫైనల్ మ్యాచ్ మే 25న ముగుస్తుంది. దీని తర్వాత ఐపీఎల్ 2026 మార్చి 15న ప్రారంభం కానుంది. టైటిల్ మ్యాచ్ మే 31న జరగనుంది. ఆ త‌ర్వాత ఏడాది వ‌చ్చే ఐపీఎల్ అంటే ఐపీఎల్ 2027 మొదటి మ్యాచ్ మార్చి 14 న జరుగుతుంది. ఆ సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 30న జరగనుంది. అయితే, ఈ ఐపీఎల్ తేదీలను విండోగా విడుదల చేసింది. ఇందులో మార్పులు కనిపించే అవ‌కాశం కూడా ఉంది. 

45
IPL 2025 CSK Retention, IPL 2025, CSK Retention, CSK

IPL 2025 CSK Retention, IPL 2025, CSK Retention, CSK

ఎన్ని దేశాల ఆట‌గాళ్లు అందుబాటులో ఉంటారు? 

ఈ నివేదిక ప్ర‌కారం.. ఐపీఎల్ 2025 సీజన్‌కు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే ఆటగాళ్లు పూర్తిగా అందుబాటులో ఉంటారు. వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన 6 రోజుల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్ ఐపీఎల్ ప్రారంభం కానుంది. అయితే, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం టోర్నమెంట్‌ను పాకిస్తాన్‌లో నిర్వహిస్తుందా లేదా హైబ్రిడ్ మోడల్‌ను ఎంచుకుంటుందా అనే దానిపై ఇంకా అనిశ్చితి ఉంది.

55
Rohit Sharma, Virat Kohli, IPL 2025

Rohit Sharma, Virat Kohli, IPL 2025

రాబోయే ఐపీఎల్ లో ఇంత‌కు ముందుకంటే ఎక్కువ మ్యాచ్‌లు

ఐపీఎల్ 2025లో జరిగే మ్యాచ్‌ల సంఖ్య 2024 కంటే ఎక్కువగా ఉంటుందని సమాచారం. గత సీజన్‌లో 74 మ్యాచ్‌లు నిర్వహించబడ్డాయి. ఐపీఎల్ 2025, 2026 సీజ‌న్ల‌లో వ‌రుస‌గా 84-84 మ్యాచ్‌లు ఉంటాయి. దీని తర్వాత ఎడిష‌న్ లో 94 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్ ప్రసార హక్కులను విక్రయించే సమయంలో బీసీసీఐ బ్రాడ్‌కాస్టర్లతో ఈ ఒప్పందం చేసుకుంది. కాగా, ప్ర‌స్తుత షెడ్యూల్ తో ఐపీఎల్ జట్లకు పెద్ద ఉపశమనం క‌లిగింది. ఎందుకంటే.. ప్రధాన టెస్ట్ ఆడే దేశాలకు చెందిన విదేశీ ఆటగాళ్లు అంద‌రూ ఐపీఎల్ రాబోయే మూడు సీజన్లలో ఆడేందుకు వారి బోర్డుల నుండి అనుమతి పొందారు. అయితే, ఈ లిస్టులో పాకిస్థాన్ జట్టుకు చోటు దక్కలేదు. ఆ టీమ్ ఆట‌గాళ్లు ఐపీఎల్‌లో ఆడరు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs NZ: తొలి వన్డేలో భారత్ జోరు.. కోహ్లీ మెరుపులు, కివీస్‌పై ఘన విజయం
Recommended image2
IND vs NZ: న్యూజిలాండ్‌లో అర్ష్‌దీప్ సింగ్ సరికొత్త రికార్డు.. మనోడి దెబ్బకు కుప్పకూలిన కివీస్
Recommended image3
Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు ది బిగ్ షో గుడ్ బై.. గ్లెన్ మాక్స్‌వెల్ రిటైర్మెంట్ కు కారణం ఏమిటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved