ICC T20 World Cup 2024: ఇంగ్లాండ్ లో కొత్త ప్రయాణం షురూ చేసిన కీరన్ పొలార్డ్..
Kieron Pollard: ఇటీవల వెస్టిండీస్ చేతిలో 2-3 తేడాతో సిరీస్ కోల్పోయిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండు ఫామ్ తో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలోనే 2024 టీ20 వరల్డ్ కప్ కు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ సేవలను ఉపయోగించుకోవాలని ఇంగ్లాండు నిర్ణయించుకుంది.
Kieron Pollard
England Cricket Team-Kieron Pollard: రాబోయే క్రికెట్ మెగా ఈవెంట్ టీ20 వరల్డ్ కప్ కు ఇంకా ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. ప్రతిష్టాత్మక వైట్ బాల్ ఈవెంట్ కు యూఎస్ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇదిలావుండగా, ఇటీవల వెస్టిండీస్ చేతిలో 2-3 తేడాతో సిరీస్ కోల్పోయిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఫామ్ తో సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో 2024 టీ20 వరల్డ్ కప్ కు దిగ్గజ ప్లేయర్, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ సేవలను ఉపయోగించుకోవాలని ఇంగ్లాండ్ క్రికెట్ నిర్ణయించుకుంది. ఇదే విషయం గురించి తాజాగా ప్రకటన చేయడంతో కీరన్ పొలార్డ్ ఇంగ్లాండ్ తో తన కొత్త ప్రయాణం ప్రారంభించాడు.
Kieron Pollard
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ 2024 టీ20 ప్రపంచకప్ కోసం ఇంగ్లాండ్ కోచింగ్ టీమ్ లో చేరనున్నట్లు ఈసీబీ ఆదివారం ప్రకటించింది. పొలార్డ్ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ కోసం ప్రత్యేకంగా సహాయ కోచ్ గా ఇంగ్లాండ్ జట్టులో భాగం అవుతాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన 36 ఏళ్ల సోమర్సెట్ మాజీ ఆల్ రౌండర్ వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నప్పుడు కరేబియన్ పరిస్థితులపై పూర్తి అవగాహన కలిగి వుండటంతో ఇంగ్లాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.
Kieron Pollard
పొలార్డ్ సేవలు టీం కు లాభిస్తాయని ఇంగ్లాండ్ భావిస్తోంది. 2012లో వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన పొలార్డ్ ఈ ఫార్మాట్ లో రికార్డు స్థాయిలో 600కు పైగా మ్యాచ్ లను ఆడాడు. టీ20 ప్రపంచకప్ తొమ్మిదో ఎడిషన్ జూన్ 4 నుంచి 30 వరకు బార్బడోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో జరగనుంది. 16 నుంచి 20 జట్లకు విస్తరించిన ఈ టోర్నీలో మరోసారి టైటిల్ ను సాధించాలని ఇంగ్లాండ్ ప్లాన్స్ చేస్తోంది.