- Home
- Sports
- Cricket
- టీమిండియాతో ఆడితే, ఇలాగే చేస్తారా? ఇంగ్లాండ్ టీమ్‌పై విండీస్ ప్లేయర్ బ్రాత్‌వైట్ ఫైర్...
టీమిండియాతో ఆడితే, ఇలాగే చేస్తారా? ఇంగ్లాండ్ టీమ్‌పై విండీస్ ప్లేయర్ బ్రాత్‌వైట్ ఫైర్...
యాషెస్ సిరీస్‌లో ఘోర పరాభవం తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ జట్టు, మొదటి టెస్టును డ్రాగా ముగించగలిగింది. అయితే ఐదు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి రోజు ఆఖరి ఓవర్ దాకా డ్రాకి అంగీకరించలేదు ఇంగ్లాండ్ జట్టు...

తొలి ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్ స్టో 140 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ 311 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. విండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 375 పరుగలు చేసి, 64 పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది.
విండీస్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నుర్మా బోనర్ 123 పరుగులు చేయగా క్రెగ్ బ్రాత్‌వైట్ 55, జాసన్ హోల్డర్ 45 పరుగులు చేసి రాణించారు.
రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జో రూట్ 109 పరుగులు, జాక్ క్రావల్లీ 121 పరుగులు చేయడంతో 6 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది ఇంగ్లాండ్...
286 పరుగుల టార్గెట్‌తో ఐదో రోజు మొదటి సెషన్‌లో బ్యాటింగ్ మొదలెట్టిన వెస్టిండీస్ 70.1 ఓవర్లు బ్యాటింగ్ చేసి 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది...
67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్‌ను బోనర్ 38, జాసన్ హోల్డర్ 37 పరుగులు చేసి ఆదుకున్నారు. అయితే ఈ ఇద్దరూ 35 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వరకూ డ్రాకి అంగీకరించలేదు ఇంగ్లాండ్...
‘నేను వెస్టిండీస్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండి ఉంటే, దీన్ని అవమానంగా భావించేవాడిని. ఇద్దరు బ్యాటర్లు క్రీజులో సెటిల్ అయిపోయారు...
పిచ్ నుంచి పెద్దగా సహకారం కూడా లభించనప్పుడు ఇంగ్లాండ్ ఆఖరి ఓవరూ వరకూ 6 వికెట్లు తీయగలమనే నమ్మకంతో ఉన్నారు. ఆఖరి 5 బంతులు మిగిలినప్పుడు డ్రాకి ఒప్పుకున్నారు...
యాషెస్ టెస్టు మ్యాచ్ అయితే ఇలాగే చేయగలరా? లేదా టీమిండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లతో ఆడినప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారా? లేదు... మరి మాపైనే ఎందుకు ఇలా?
ఇప్పటికే విండీస్ బ్యాటర్లు తమ ఆటతో ఇంగ్లాండ్‌కి గట్టి సమాధానం చెప్పారు. ఇప్పుడు ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉన్నాయి. మేం ఇంగ్లాండ్ కంటే బాగా ఆడగలం.. అని నిరూపించాల్సిన సమయం వచ్చింది...’ అంటూ కామెంట్ చేశాడు వెస్టిండీస్ మాజీ క్రికెటర్, మాజీ టీ20 కెప్టెన్ కార్లస్ బ్రాత్‌వైట్...