- Home
- Sports
- Cricket
- రెండేళ్లుగా టెస్టుల్లో టాప్ లేపుతున్నాం! ఆస్ట్రేలియాలో కూడా చుక్కలు చూపించాం... - రోహిత్ శర్మ
రెండేళ్లుగా టెస్టుల్లో టాప్ లేపుతున్నాం! ఆస్ట్రేలియాలో కూడా చుక్కలు చూపించాం... - రోహిత్ శర్మ
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023కి సర్వం సిద్దమైంది. జూన్ 7 నుంచి కెన్నింగ్టన్ ఓవల్‌లో ప్రారంభమయ్యే ఈ ఫైనల్ టెస్టులో ఇండియా, ఆస్ట్రేలియా తలబడబోతున్నాయి. ఈ ఫైనల్‌కి ముందు ఐసీసీ ఈవెంట్‌లో రోహిత్ శర్మ, ప్యాట్ కమ్మిన్స్ పాల్గొన్నారు...
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఈ కార్యక్రమంలో 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రీఫీ గురించి మాట్లాడాడు రోహిత్ శర్మ. ఆడిలైడ్ టెస్టులో 36/9 ఘోర పరాభవం తర్వాత పెటర్నిటీ లీవ్ మీద విరాట్ కోహ్లీ స్వదేశానికి వచ్చేశాడు. తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న అజింకా రహానే, మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీ చేసి టీమిండియాకి కమ్‌బ్యాక్ విజయాన్ని అందించాడు..
తొలి టెస్టులో మహ్మద్ షమీ, రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్, మూడో టెస్టులో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారి, జస్ప్రిత్ బుమ్రా, కెఎల్ రాహుల్ (ప్రాక్టీస్ సెషన్స్) గాయపడిన తర్వాత కూడా రిజర్వు బెంచ్ ప్లేయర్లతో నాలుగో టెస్టు ఆడింది టీమిండియా...
సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారి పట్టువిడవని పోరాటంతో డ్రా చేసుకున్న టీమిండియా, బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియా కంచుకోటను కూల్చింది. రిషబ్ పంత్, శుబ్‌మన్ గిల్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్‌ల కారణంగా గబ్బాలో ఆస్ట్రేలియాకి 32 ఏళ్ల తర్వాత తొలి పరాజయాన్ని రుచి చూపించింది..
‘రెండేళ్లుగా మేం టెస్టుల్లో అదరగొడుతున్నాం. కరోనా తర్వాత జనాలు ఇళ్లల్లో బందీ అయిపోయారు, బబుల్‌లో ఉన్నాం. ఏం జరుగుతుందో కూడా గ్రహించలేకపోయాం. మా టీమ్‌లోని కొందరు కుర్రాళ్లు ఈ పరిస్థితులను చూసి భయపడ్డారు, నిరుత్సాహపడ్డారు...
ఆ క్లిష్ట పరిస్థితుల్లో బాగా ఆడాలంటే ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొడ్డి నిలబడాల్సి ఉంటుంది. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో మేం ఆడిన విధానం టాప్ క్లాస్. ఆడిలైడ్‌లో మొదటి టెస్టులో చిత్తుగా ఓడిన తర్వాత టీమ్ అద్భుతంగా కమ్‌బ్యాక్ ఇచ్చింది...
చాలామంది ప్లేయర్లు గాయపడ్డారు. నేను ఆడింది ఆఖరి రెండు టెస్టులు మాత్రమే. అయినా టీమ్‌లో అందరూ పడిన కష్టాన్ని చూశాను. ఆ విజయం వెనక చాలా గ్రౌండ్ వర్క్ ఉంది. కుర్రాళ్లు బాధ్యత తీసుకుని ముందుండి గెలిపించారు..
చాలా మంది సీనియర్లు ఆ పర్యటనకు దూరమయ్యారు. అయినా విదేశాల్లో మేం ఆడిన బెస్ట్ సిరీస్ అదే. అలాగే గత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ చాలా ఎంజాయ్ చేశా. పిచ్‌లు చాలా ఛాలెంజింగ్‌గా ఉన్నా, మేం సిరీస్ గెలవగలిగాం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..