మీడియాకి ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో మాకు బాగా తెలుసు... మాజీ కోచ్ రవిశాస్త్రి...
సౌతాఫ్రికా టూర్‌కి ముందు విరాట్ కోహ్లీ ఇచ్చిన ప్రెస్ కాన్ఫిరెన్స్‌పై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. నిజానికి విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ఇదే కారణం...

బీసీసీఐ, విరాట్ కోహ్లీ మధ్య సత్సంబంధాలు లేవనే విషయం, ఈ ప్రెస్ కాన్ఫిరెన్స్ ద్వారా ప్రపంచానికి తెలిసిపోయింది...
సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, తనను ఓ జర్నలిస్ట్ బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ ఛాట్‌కి సంబంధించిన స్క్రీన్ షాట్లు షేర్ చేయడంపై పెద్ద చర్చే జరిగింది...
తాజాగా భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ విషయం గురించి, నేటి మీడియా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.
భారత జట్టు తరుపున 80 టెస్టులు, 150 వన్డేలు ఆడిన రవి శాస్త్రి, నేటితరం క్రికెటర్లతో పోలిస్తే తమ తరం జర్నలిస్టులతో మంచి రిలేషన్ మెయింటైన్ చేశామంటూ వ్యాఖ్యానించాడు...
‘మేం క్రికెట్ ఆడిన సమయంతో పోలిస్తే, ఇప్పుడు మీడియా పూర్తిగా మారిపోయింది. అప్పటి జర్నలిజం, జర్నలిస్టులు చాలా హుందాగా వ్యవహరించేవాళ్లు...
అంతేకాదు నేటితరం క్రికెటర్లతో పోలిస్తే, మా తరానికి జర్నలిస్టులతో ఎలా మెలగాలో, ఏం చెప్పాలో ఏది చెప్పకూడదో బాగా తెలుసు...
డ్రెస్సింగ్ రూమ్‌లో నేను గత ఏడేళ్లుగా ఉంటున్నా. వృద్ధిమాన్ సాహా విషయంలో జర్నలిస్టు వ్యవహరించిన విధానం తప్పు. కానీ ఇప్పుడు మీడియా అలా తయారైంది.
మా సమయంలో కేవలం ప్రింట్ మీడియా మాత్రమే ఉండేది. టెలివిజన్ ఉన్నా కేవలం దూరదర్శన్ మాత్రమే. కానీ ఇప్పుడు మీడియా హద్దులు బాగా విస్తరించాయి...
వేల సంఖ్యలో టీవీ ఛానెళ్లు, సోషల్ మీడియా ఛానెళ్లు ఉన్నప్పుడు ప్రేక్షకులను ఆకర్షించడానికి ఇలాంటి వన్నీ చేస్తున్నారు... దీని గురించి డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా సార్లు చర్చించాం...
మీడియాతో మాట్లాడాలని అనుకుంటే ప్రెస్ కాన్ఫిరెన్స్ పెట్టి మాట్లాడాలని సూచించాం. అప్పుడైతే అందరూ కలిసి ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు వేయడానికి వీలు ఉంటుంది....
ఇలాంటి మీడియా వల్ల ఆటగాళ్లు పూర్తిగా ఆటపై ఫోకస్ పెట్టలేకపోతున్నారు. మాకు ఈ తలనొప్పులు అన్నీ ఉండేవి కావు...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...