MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • మాకు ఫైనల్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వద్దు.. రోహిత్ సేనకు సెమీస్‌లోనే షాకిస్తాం : బట్లర్

మాకు ఫైనల్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వద్దు.. రోహిత్ సేనకు సెమీస్‌లోనే షాకిస్తాం : బట్లర్

T20 World Cup 2022: తుది దశకు చేరుకున్న టీ20 ప్రపంచకప్ లో ఎవరు ఫైనల్ చేరుతారని క్రికెట్ విశ్లేషకులు, ఫ్యాన్స్ అంచనాలు కడుతున్న వేళ.. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  సెమీస్ లో తాము రోహిత్ సేనకు షాకిస్తామని  అంటున్నాడు.

2 Min read
Author : Srinivas M
Published : Nov 09 2022, 01:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టీ20 ప్రపంచకప్ లో  తొలి నుంచి   వరుస విజయాలతో గ్రూప్-2లో టాప్ లో నిలిచిన  భారత జట్టు.. అదృష్టం కొద్ది సెమీస్ చేరిన  పాకిస్తాన్ జట్లు  ఈ టోర్నీలో మరోసారి పోటీ పడాలని ఇరుదేశాల ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ ప్రేమికులు కూడా కోరుకుంటున్నారు. సెమీస్ చేరిన  ఇంగ్లాండ్- ఇండియా, న్యూజిలాండ్- పాకిస్తాన్ ల మధ్య విజేతలెవరో  తేలాక ఫైనల్ ఎవరి మధ్య ఉండనుందనే దానిపై స్పష్టత రానుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే ఫ్యాన్స్ కోరుకుంటున్నట్టుగా ఈ మెగా టోర్నీలో తాము ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ చూడటానికి ఇష్టపడటం లేదని.. రోహిత్ సేనకు షాకులిస్తామని ఇంగ్లాండ్ సారథి జోస్ బట్లర్ అన్నాడు. ఇండియాతో మ్యాచ్ కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

36

బట్లర్ మాట్లాడుతూ.. ‘చూడండి.. మాకు ఈ టోర్నీ ఫైనల్ లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూడాలని లేదు. అందుకే మేం మా ప్రణాళికలతో ఉన్నాం. అలాంటిది జరుగకుండా భారత జట్టును అడ్డుకుంటాం.   అందుకు ఏం చేయాలో అది చేస్తాం.

46

భారత జట్టు చాలా స్ట్రాంగ్ టీమ్. చాలాకాలంగా భారత జట్టు నిలకడైన ఆటతీరుకు పెట్టింది పేరు. ఆ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు.  నాణ్యమైన ఆటగాళ్లు కూడా బెంచ్ కే పరిమితమవుతున్నారంటే ఆ జట్టు ఎంత దృఢంగా ఉందో అర్థం చేసుకోవచ్చు..’ అని అన్నాడు. 

56

ఈ టోర్నీలో అత్యద్భుత ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ గురించి బట్లర్ మాట్లాడుతూ.. ‘సూర్య ఆటను చూసినకొద్దీ చూడబుద్దవుతుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు మెరుగ్గా ఆడిన వాళ్లలో సూర్య ఒకడు. తన కెరీర్ లో  సూర్య చాలా క్రికెట్ ఆడాడు. అదే అతడి బలం. మైదానం నలుమూలలా అన్ని షాట్లు ఆడగల సమర్థుడు. సూర్య అంత త్వరగా వికెట్ ఇవ్వడు. కానీ మేం అతడిని ఔట్ చేసేందుకు మా ప్రయత్నాలు చేస్తాం..’ అని చెప్పాడు. 

66

గాయంతో బాధపడుతున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు డేవిడ్ మలన్, మార్క్ వుడ్ ల గురించి కూడా బట్లర్ స్పందించాడు. ‘మ్యాచ్ సమయానికల్లా వాళ్లు ఎలా ఉంటారనేది చూస్తున్నాం.  మలన్ కు గాయం కావడంతో శ్రీలంకతో మ్యాచ్ లో బ్యాటింగ్ కు దిగలేదు. వుడ్ బాడీ స్టిఫ్నెస్ తో బాధపడుతున్నాడు. కానీ మా వైద్య సిబ్బంది వాళ్లిద్దరినీ పర్యవేక్షిస్తున్నది.  మ్యాచ్ వరకూ ఆ ఇద్దరూ  ఫిట్ గా ఉంటారని అనుకుంటున్నా..’ అని చెప్పాడు. 

About the Author

SM
Srinivas M
భారత దేశం
పాకిస్తాన్

Latest Videos
Recommended Stories
Recommended image1
RRR vs HEC : ఏంటిది రెడ్డిగారు.. రంగారెడ్డితో అలా చెడుగుడు ఆడేసుకున్నారు..!
Recommended image2
India vs Ireland: ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఫిక్స్.. టీమ్ లో ప్లేస్ కోసం ముగ్గురు స్టార్ల మధ్య ఫైట్
Recommended image3
ICC Rankings: గిల్ ఖాతాలో అదిరిపోయే రికార్డ్.. బుమ్రా నంబర్ 1 కుర్చీ లాగేసుకున్న కీవీస్ ప్లేయర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved