వామికను సోషల్ మీడియాకి దూరంగా, సోసైటీకి దగ్గరగా పెంచుతాం... కూతురిపై విరాట్ కోహ్లీ...
కూతురు పుట్టకముందు నుంచే ఆమె విషయంలో చాలా కేర్ తీసుకోవడం మొదలెట్టాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. భార్య కాన్పు కోసం ఆస్ట్రేలియా టూర్ నుంచి పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశానికి తిరిగి వచ్చేసిన కోహ్లీ, ఎన్నిరకాల విమర్శలు వచ్చినా వాటిని పట్టించుకోలేదు.
ఆస్ట్రేలియా టూర్‌లో ఆడిలైడ్‌లో ఘోర పరాజయం తర్వాత భార్య డెలివరీ కోసం అర్ధాంతరంగా స్వదేశానికి తిరిగి వచ్చేశాడు విరాట్ కోహ్లీ. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో విరాట్ కోహ్లీ ఇలా చేయడం కరెక్ట్ కాదని కొందరు విమర్శిస్తే, కుటుంబానికి తోడుగా ఉండాలని విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని మరికొందరు ప్రశంసించారు.
విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ 2021, జనవరి 11న ఆడబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. తమ కూతురికి ‘వామిక’ అనే నామకరణం చేశారు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ...
వామిక కోహ్లీకి ఇప్పటికే సోషల్ మీడియాలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వామిన పేరు మీద కొన్ని వందల ఫ్యాన్ పేజీలు కూడా పుట్టుకొచ్చేశాయి...
అయితే ఇప్పటివరకూ వామిక ముఖాన్ని బయటపెట్టలేదు విరుష్క జోడి. తాజాగా అభిమానుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన విరాట్ కోహ్లీకి ఓ అభిమాని, వామిక ఫోటోను చూపించాల్సిందిగా కోరాడు...
అభిమాని ప్రశ్నకు... ‘వామికను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని అనుకుంటున్నాం... సోషల్ మీడియా అంటే ఏంటో ఆమెకి అర్థమయ్యేదాకా ఎక్కడా తన ఫోటోలు కనిపించనివ్వం. సోషల్ మీడియా గురించి అర్థం చేసుకున్నాక దాన్ని వాడాలా? వద్దా? తన ఇష్టానికి వదిలేస్తాం...’ అంటూ సమాధానం ఇచ్చాడు విరాట్ కోహ్లీ...
ధోనీ కూతురు జీవా సింగ్‌కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కూతురు కోసం ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేసింది సాక్షి ధోనీ. రోహిత్ శర్మ కూతురు సమైరా గురించి ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు రితికా, రోహిత్..
ఈ ఇద్దరు క్రికెట్ స్టార్లతో పోలిస్తే విరాట్, అనుష్క తీసుకున్న నిర్ణయం కాస్త భిన్నమైనదే. వామిక పేరుకి అర్థం తెలపాలని ఓ అభిమాని అడగగా... ‘దుర్గా దేవికి ఉన్న మరో పేరు’ అంటూ వివరించాడు విరాట్ కోహ్లీ...