- Home
- Sports
- Cricket
- టీ20 సిరీస్ పోతే పోయింది, మా అసలు టార్గెట్ అదే... శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు...
టీ20 సిరీస్ పోతే పోయింది, మా అసలు టార్గెట్ అదే... శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు...
స్వదేశంలో వరుసగా క్లీన్ స్వీప్ విజయాలు అందుకుంటూ వచ్చిన భారత జట్టుకి షాక్ ఇచ్చింది సౌతాఫ్రికా జట్టు. వరుసగా 13 టీ20 మ్యాచుల్లో గెలిచి వరల్డ్ రికార్డును క్రియేట్ చేయాలని భావించిన టీమిండియా ఆశలపై నీళ్లు చల్లిన సఫారీ జట్టు, సిరీస్ విజయం దిశగా సాగుతోంది...

Image credit: PTI
తొలి రెండు టీ20 మ్యాచుల్లో ఘన విజయాలు అందుకున్న సౌతాఫ్రికా, మరో మ్యాచ్ గెలిస్తే చాలు సిరీస్ సొంతం చేసుకుంటుంది. అయితే ఈ పరాజయాలను పెద్దగా పట్టించుకోబోమని అంటున్నాడు టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్...
‘ప్రస్తుతం మా ముందున్న లక్ష్యం టీ20 వరల్డ్ కప్. దాన్ని సాధించడానికి కావాల్సిన అస్త్రాలను తయారుచేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నాం..
Image credit: PTI
మిగిలిన విషయాలన్నీ పక్కనబెట్టి కేవలం ఆటపై దృష్టిపెడితేనే రిజల్ట్ బాగుంటుంది. ఇప్పుడు జరుగుతున్న మ్యాచులన్నీ టీ20 వరల్డ్ కప్‌కి ప్రాక్టీస్ గానే చూస్తున్నాం. ఇంతకుముందు ఇలాంటి మ్యాచులు లేకనే సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాం...
Image credit: PTI
టీమ్ మీటింగ్స్‌లో కూడా వీటి గురించే చర్చించుకుంటాం. ఫలితాలతో మాకు సంబంధం లేదు. టీమ్ మీటింగ్స్‌తో మేం అనుకున్న ప్రణాళికలను అమలు చేయడమే మా ప్రధాన కర్తవ్యం... వాటి నుంచి ఫలితాలను విశ్లేషించుకోవచ్చు..
ఓడిపోయిన మ్యాచుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. ఈ పాఠాలు, మిగిలిన మ్యాచుల్లో గెలవడానికి బాగా పనికి వస్తాయి. ఓ ప్లేయర్‌గా టీమ్‌ని చూస్తూ పెరుగుతాం... కాబట్టి ఆస్ట్రేలియా వెళ్లే జట్టులో నాకు ప్లేస్ ఉంటుందని ఆశిస్తున్నా...’ అంటటూ కామెంట్ చేశాడు భారత క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్...
గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌కి దూరమైన శ్రేయాస్ అయ్యర్, గాయం నుంచి కోలుకుని సెకండ్ ఫేజ్‌లో బరిలో దిగాడు. అయితే తగినంత ప్రాక్టీస్, ఫిట్‌నెస్ లేదనే ఉద్దేశంతో అతనికి టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో చోటు కల్పించలేదు సెలక్టర్లు...
గాయం నుంచి కోలుకున్న తర్వాత టీ20ల్లో అదరగొడుతున్న శ్రేయాస్ అయ్యర్, మిడిల్ ఆర్డర్‌లో ప్లేస్ కోసం సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడాలతో పోటీపడబోతున్నాడు...
సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌గా ఉండి, టీమ్‌కి అందుబాటులో ఉంటే శ్రేయాస్ అయ్యర్‌కి తుది జట్టులో చోటు దక్కుతుందా? అనేది అనుమానమే...