MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • Usman Tariq : పాక్ బౌలర్ ఉస్మాన్ తారిక్ ది లీగల్ బౌలింగా? త్రోయింగా?

Usman Tariq : పాక్ బౌలర్ ఉస్మాన్ తారిక్ ది లీగల్ బౌలింగా? త్రోయింగా?

ఉస్మాన్ తారిక్.. ఈ పాకిస్థానీ క్రికెటర్ బౌలింగ్ యాక్షన్ ప్రస్తుతం వివాదాస్పదం అవుతోంది. అతడిది ఇల్లీగల్ బౌలింగ్ అని కొందరు.. లీగల్ అని మరికొందరు అంటున్నారు. 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 16 2026, 05:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇదెక్కడి బౌలింగ్ రా నాయనా..!
Image Credit : Getty

ఇదెక్కడి బౌలింగ్ రా నాయనా..!

Usman Tariq : అంతర్జాతీయ క్రికెట్లో మెరుపువేగంతో బంతులువేస్తూ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే బౌలర్లను అనేకమంది చూశాం. బంతిని గింగిరాలు తిప్పుతూ వికెట్లు పడగొట్టే వరల్డ్ క్లాస్ స్పిన్నర్లను చూశాం. కానీ వీడెవడండీ బాబు... ఇలా బౌలింగ్ చేస్తున్నాడు...! అని అనిపిస్తుంటుంది పాకిస్థాన్ ప్లేయర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ చూస్తుంటే. ప్రస్తుతం ఐసిసి టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఈ పాకిస్థానీ బౌలింగ్ పై తీవ్ర చర్చ సాగుతోంది... అతడి యాక్షన్ ను చాలామంది వ్యక్తిరేకిస్తున్నారు. అయితే కొందరు మాత్రం అతడి బౌలింగ్ యాక్షన్ ను సమర్దిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ ఎలా ఉంటుంది..?
Image Credit : Getty

ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ ఎలా ఉంటుంది..?

సాధారణంగా క్రికెట్లో రెండు రకాల బౌలర్లు ఉంటారు... ఫేస్, స్పిన్. ఎక్కువ దూరంనుండి పరుగెత్తుకుంటూ వచ్చి గంటకు 130-140 కిలోమీటర్ల వేగంతో బంతిని విసురుతుంటారు ఫేస్ బౌలర్లు. స్పిన్నర్లకు ఇంత శ్రమ ఉండదు... కానీ టెక్నిక్ అవసరం. బంతికి గింగిరాలు తిప్పుతూ మణికట్టుతో మాయాజాలం చేస్తుంటారు.

పాకిస్థానీ క్రికెటర్ తారిక్ కూడా స్పిన్ బౌలర్... కానీ అతడి బౌలింగ్ యాక్షన్ చాలా భిన్నంగా ఉంటుంది. సాధారణ స్పిన్నర్ల మాదిరిగానే చిన్నగా పరుగెత్తుకుంటూ వస్తాడు… కానీ బంతి విసిరేముందు కాస్త ఆగుతాడు... తర్వాత బంతి వేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ త్రో విసిరినట్లు ఉంటుందని కొందరు… బౌలింగ్ పేరుతో త్రో విసురుతాడని మరికొందరు ఆరోపిస్తున్నారు. అయితే ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ ను వ్యతిరేకించే ఎక్కువమంది ఉన్నారు. ఇతడిని ఐసిసి ఎందుకు అనుమతిస్తుందో అర్థంకావడంలేదని ఆశ్యర్యం వ్యక్తంచేస్తున్నారు మాజీ క్రికెటర్లు.

35
తారిక్ బౌలింగ్ పై సెహ్వాగ్ కామెంట్స్..
Image Credit : Getty

తారిక్ బౌలింగ్ పై సెహ్వాగ్ కామెంట్స్..

అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదగాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది... క్రికెట్లో మంచి నైపుణ్యం కలిగివుండాలని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు. కానీ ఉస్మాన్ తారిక్ లాంటి బౌలర్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడటం విడ్డూరంగా ఉందని... ఇతడు గల్లీ క్రికెటర్లకు ఏమాత్రం తీసిపోడని పేర్కొన్నారు. ఇలాంటి బౌలర్లను ఇంటర్నేషనల్ క్రికెట్ లో అనుమతించకూడని... లేదంటే గల్లి క్రికెటర్లను కూడా గొప్ప బౌలర్ అని నమ్మినట్లేనని అన్నారు. తారిక్ బౌలింగ్ యాక్షన్ పై విచారణ జరిపించాలని సెహ్వాగ్ డిమాండ్ చేశారు.

45
తారిక్ బౌలింగ్ పై సీనియర్లు సీరియస్...
Image Credit : X

తారిక్ బౌలింగ్ పై సీనియర్లు సీరియస్...

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాటింగ్ కూడా పాకిస్థానీ బౌలర్ తారిక్ యాక్షన్ పై రియాక్ట్ అయ్యారు. అతడు బ్యాటర్లను చూస్తూ బంతిని రిలీజ్ చేస్తున్నాడు... ఇది రూల్స్ కి విరుద్దమని అన్నారు. బ్యాటర్ ఏ షాట్ ఆడతాడో కాస్త ఆగి గ్రహించాకే బంతిని విసురుతున్నాడని అన్నారు. కాబట్టి తారిఖ్ పై ఐసిసి వెంటనే యాక్షన్ తీసుకోవాలని సూచించారు.

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా తారిక్ బౌలింగ్ ను తప్పుబట్టాడు. పాకిస్థానీ క్రికెటర్ తారిక్ బౌలింగ్ ను తాను దగ్గర్నుంచి చూశానని... అది త్రో మాత్రమే, బౌలింగ్ యాక్షన్ కాదని అన్నారు. ఇలాంటి త్రో బౌలర్లను అనుమతించకూడదని ఐసిసికి సూచించారు.

ఇక ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరూన్ గ్రీన్ అయితే ఏకంగా మైదానంలోనే తారిక్ బౌలింగ్ యాక్షన్ పై అభ్యంతరం వ్యక్తంచేశాడు. పాకిస్థాన్ తో జరిగిన ఓ టీ20 సీరిస్ లో తారిక్ బౌలింగ్ లో ఔటవగానే అంపైర్ వైపు చూస్తే ''వీడు బాల్ విసురుతున్నాడు'' అనేలా సీరియస్ గా సైగ చేశాడు. ఇది ఆ సమయంలో పెద్ద దుమారమే లేపింది.

55
తారిక్ బౌలింగ్ కు సపోర్ట్...
Image Credit : X/@LindaRods

తారిక్ బౌలింగ్ కు సపోర్ట్...

పాకిస్థానీ స్పిన్నర్ తారిక్ బౌలింగ్ యాక్షన్ ను విమర్శించేవారే కాదు ప్రశంసించేవారు ఉన్నారు. ఆసిస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అతడికి సపోర్ట్ చేస్తున్నాడు...''తారిక్ రెండుసార్లు బౌలింగ్ టెస్ట్ ఎదుర్కొన్నాడు. ఐసిసి నిపుణులే అతడి బౌలింగ్ యాక్షన్ కు క్లియరెన్స్ ఇచ్చారు. కాబట్టి అనవసరంగా వివాదం చేయవద్దు'' అని సూచించారు.

ఇక ఇండియన్ అంపైర్ అనిల్ చౌదరి కూడా తారిక్ కు అండగా నిలిచారు. ''ఇతడి మోచేతిలో డబుల్ ఎల్బో ఉండటంవల్ల డిఫరెంట్ యాక్షన్ ఉంది.. ఇది త్రో కాదు లీగల్ బౌలింగే..'' అని అనిల్ చౌదరి పేర్కొన్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
పాకిస్తాన్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Recommended image2
Smriti Mandhana: బిగ్గెస్ట్ మైల్‌స్టోన్.. ప్రపంచంలో మొదటి ప్లేయర్‌గా స్మృతి మంధాన సరికొత్త రికార్డు
Recommended image3
Team India ODI captain: గిల్ ఔట్.. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా కొత్త వన్డే కెప్టెన్
Related Stories
Recommended image1
IND vs PAK : పాకిస్థాన్‌ను పాతాళానికి తొక్కిన భారత్.. గెలుపు వీరులు వీరే
Recommended image2
IND vs PAK : పాకిస్థాన్ పై భారత్ అద్భుత విజయానికి.. టాప్ రీజన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved