- Home
- Sports
- Cricket
- ప్లేయర్‌గా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, కోచ్‌గా అండర్-19 వరల్డ్ కప్ గెలిచి... వీవీఎస్ లక్ష్మణ్ ఖాతాలో...
ప్లేయర్‌గా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, కోచ్‌గా అండర్-19 వరల్డ్ కప్ గెలిచి... వీవీఎస్ లక్ష్మణ్ ఖాతాలో...
అండర్-19 వరల్డ్‌కప్ 2022 ట్రోఫీని యువ భారత జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి, నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న భారత జట్టు, కెరీర్‌లో ఐదో టైటిల్ సొంతం చేసుకుంది...

లీగ్ మధ్యలో కీలక ప్లేయర్లు కరోనా బారిన పడి, జట్టుకి దూరమైనా... కెప్టెన్, వైస్ కెప్టెన్ అన్ని మ్యాచులకు అందుబాటులో లేకపోయినా ఘన విజయాలతో టోర్నీని ముగించింది.
గత నాలుగు సీజన్లలో వరుసగా ఫైనల్ చేరిన అండర్-19 భారత జట్టు, రెండు సీజన్లలో టైటిల్ గెలిచింది. 2018 ఫైనల్‌లో పృథ్వీషా కెప్టెన్సీలో అండర్-19 వరల్డ్‌కప్ టైటిల్ గెలిచింది భారత జట్టు...
ఆ తర్వాత గత సీజన్‌లో ప్రియమ్ గార్గ్ కెప్టెన్సీలో ఫైనల్ చేరినా, బంగ్లాదేశ్ చేతుల్లో పరాభవాన్ని ఎదుర్కొంది. ఈసారి ఆ లెక్కలన్నీ సరి చేసింది భారత జట్టు...
అండర్-19 ఆసియా కప్ టైటిల్ గెలిచిన నెలరోజుల్లోపే అండర్-19 వరల్డ్ కప్ టైటిల్ కూడా గెలిచి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది యువ భారత జట్టు...
రాహుల్ ద్రావిడ్ భారత హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకోవడంతో ఎన్‌సీఏ హెడ్‌గా బాధ్యతలు తీసుకున్న వీవీఎస్ లక్ష్మణ్, రెండు ట్రోఫీలతో తన కొత్త కెరీర్‌ని ఆరంభించాడు...
ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకి మార్గదర్శకుడిగా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్, ఓ అరుదైన ఘనతను కూడా సాధించాడు...
భారత అండర్-19 జట్టుకి భారత మాజీ క్రికెటర్ హృషీకేశ్ కనిత్కర్ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. అయితే వీవీఎస్ లక్ష్మణ్ కూడా అండర్-19 టీమ్‌తో కలిసి వెస్టిండీస్‌కి వెళ్లి, జట్టుకి మార్గనిర్దేశకుడిగా వ్యవహరించాడు.
టీమిండియా తరుపున 134 టెస్టులు, 86 వన్డే మ్యాచులు ఆడిన వీవీఎస్ లక్ష్మణ్, దాదాపు 16 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాడు....
వీవీఎస్ లక్ష్మణ్ ప్లేయర్‌గా ఉన్న సమయంలో నాలుగు వరల్డ్ కప్ టోర్నీలు జరిగినా, ఒక్క దాంట్లోనూ ఆయనకి అవకాశం దక్కలేదు. 100కి పైగా టెస్టులు ఆడి ఒక్క వరల్డ్‌కప్ మ్యాచ్ కూడా ఆడని భారత ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు వీవీఎస్ లక్ష్మణ్...
ప్లేయర్‌గా వరల్డ్ కప్ మ్యాచ్ ఆడలేకపోయినా, ఎన్‌సీఏ (జాతీయ క్రికెట్ అకాడమీ) డైరెక్టర్‌గా ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్ టైటిల్ గెలిచాడు వీవీఎస్ లక్ష్మణ్...