ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్-6 సునామీ ఇన్నింగ్స్ ఎవరివో తెలుసా?
Top 6 explosive innings in Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. అయితే, ఇప్పటివరకు జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలలో టాప్-6 సునామీ ఇన్నింగ్స్ లు ఎవరో ఆడారో ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ప్రపంచంలోని అత్యుత్తమ జట్ల మధ్య హై-ఆక్టేన్ మ్యాచ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ 50 ఓవర్ల టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరగనుంది. దీనికి పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఉన్నాయి. టీమిండియా ఆడే మ్యాచ్‌లకు దుబాయ్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు ఆడిన అత్యుత్తమ సునామీ ఇన్నింగ్స్ లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వీరేంద్ర సెహ్వాగ్ vs ఇంగ్లాండ్ (2002)
టీమిండియా ఢాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ధనాధన్ బ్యాటింగ్ తో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. 2002 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై అతని ప్రదర్శన అద్భుతమైనది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 270 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. సెహ్వాగ్ మొదటి బంతి నుండే అటాక్ మొదలు పెట్టాడు. సెహ్వాగ్ 104 బంతుల్లో 126 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. సౌరవ్ గంగూలీ (109 బంతుల్లో 117*)తో 192 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకోల్పడంతో భారత్ 39.3 ఓవర్లలో సులభంగా టార్గెట్ ను ఛేదించడంలో సహాయపడ్డాడు. సెహ్వాగ్ 45 బంతుల్లో అర్ధ సెంచరీ, 81 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.
2. ఇయాన్ మోర్గాన్ vs దక్షిణాఫ్రికా (2009)
సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో ఇయాన్ మోర్గాన్ తన అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ 222/3తో ఉన్నప్పుడు 5వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను, 197.05 స్ట్రైక్ రేట్‌తో 34 బంతుల్లో 67 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 262/4 వద్ద పాల్ కాలింగ్‌వుడ్ ఔటైన తర్వాత, మోర్గాన్‌పై బాధ్యత పడింది. తన దూకుడును కొనసాగిస్తూ వరుస బౌండరీలతో పరుగుల వరద పారించాడు. ఇంగ్లాండ్ స్కోర్ బోర్డును 323/8కి చేర్చాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో విజయం సాధించడంలో ఇది కీలకమైన ఇన్నింగ్స్ గా నిలిచింది.
షాహిద్ అఫ్రిది
3. షాహిద్ అఫ్రిది vs నెదర్లాండ్స్ (2002)
షాహిద్ అఫ్రిది ఎప్పుడూ ఏ బ్యాటింగ్ స్థానంలోనైనా తన అద్భుతమైన బ్యాటింగ్ లో గుర్తింపు పొందాడు. 2002 ఛాంపియన్స్ ట్రోఫీలో నెదర్లాండ్స్‌పై అతని ప్రదర్శన అద్భుతమైన స్ట్రోక్ ప్లే తో సాగింది. తన దూకుడుతో డచ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అఫ్రిది 18 బంతుల్లో 55 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్తాన్ 16.2 ఓవర్లలో 137 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సహాయపడ్డాడు. అఫ్రిది 305.55 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు, ఇది ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో రికార్డు. అతని పేలుడు ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి.
హార్దిక్ పాండ్యా
4. హార్దిక్ పాండ్యా vs పాకిస్తాన్ (2017)
2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా తన పేలుడు బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. పాకిస్తాన్ నిర్దేశించిన 335 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, భారత్ 13.3 ఓవర్లలో 54/5తో కష్టాల్లో ఉంది. అప్పుడు 22 ఏళ్ల వయస్సున్న పాండ్యా ఒత్తిడితో కూడిన పరిస్థితి ఉన్నప్పటికీ ధైర్యంగా బ్యాటింగ్‌కు దిగాడు. పాకిస్తాన్ బౌలర్లపై అటాక్తీ మొదలు పెట్టాడు. 43 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 76 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతని స్ట్రైక్ రేట్ 176.74. క్రీజులో పాండ్యా ఉండటం వల్ల భారత్‌కు కొద్దిగా ఆశలు చిగురించాయి. కానీ అతని దురదృష్టకర రనౌట్ అతని ఇన్నింగ్స్‌ను ముగించడమే కాకుండా ఫైనల్లో భారత్ విజయాన్ని దూరం చేసింది.
5. మిచెల్ జాన్సన్ vs వెస్టిండీస్ (2009)
మిచెల్ జాన్సన్ గొప్ప బౌలర్ మాత్రమే కాదు బ్యాటర్ కూడా. తన అంతర్జాతీయ కెరీర్‌లో తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని కూడా చూపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ దశ మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇది కనిపించింది. ఆస్ట్రేలియా 164/6తో ఉన్నప్పుడు 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జాన్సన్ 47 బంతుల్లో 73 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అతని స్ట్రైక్ రేట్ 155.31. అతని ప్రదర్శనలో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మిచెల్ జాన్సన్ ఇన్నింగ్స్ ఆసీస్ 50 ఓవర్లలో 275/8 స్కోర్ చేయడంలో సహాయపడింది. ఆ తర్వాత బౌలర్లు వెస్టిండీస్‌ను 225 పరుగులకే కట్టడి చేసి 50 పరుగుల తేడాతో విజయం సాధించారు.
శిఖర్ ధావన్
6. శిఖర్ ధావన్ vs దక్షిణాఫ్రికా (2013)
శిఖర్ ధావన్ నమ్మకమైన టాప్-ఆర్డర్ బ్యాటర్ మాత్రమే కాదు, పేలుడు స్ట్రోక్-మేకర్ కూడా. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో కార్డిఫ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో ఇది కనిపించింది. ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ధావన్ 94 బంతుల్లో 114 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతని స్ట్రైక్ రేట్ 121.27. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. భారత్ 50 ఓవర్లలో 331/7 స్కోర్ చేయడంలో ఇది సహాయపడింది. భారత బౌలర్లు దక్షిణాఫ్రికాను 50 ఓవర్లలో 305 పరుగులకే కట్టడి చేశారు. రోహిత్ శర్మ 65 పరుగులతో పాటు ధావన్ ఇన్నింగ్స్ భారత్‌కు కీలకమైంది. శిఖర్ ధావన్ ఐదు మ్యాచ్‌లలో 90.75 సగటుతో రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో సహా 363 పరుగులతో టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.