Most Expensive Car Collection: విరాట్, సచిన్, ధోనీ.. ఎవరి దగ్గర ఖరీదైన కారుంది?
Most Expensive Car Collection: విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ.. భారత క్రికెట్‌లో దిగ్గజాలు. క్రికెట్‌లో వీళ్ళ కంట్రిబ్యూషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంపాదనలోనూ అంతే. అలాగే, వీరిదగ్గర అదరిపోయే లగ్జరీ కార్ల కలెక్షన్ కూడా ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

భారత క్రికెట్ దిగ్గజత్రయం
సచిన్, ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. విరాట్ ఇంకా ఆడుతున్నాడు. ఈ ముగ్గురూ భారత క్రికెట్ దిగ్గజాలు. వీళ్ళ కంట్రిబ్యూషన్ అంత గొప్పది.
సంపాదనలో ముగ్గురూ..
విరాట్, సచిన్, ధోనీ.. సంపాదనలో దాదాపు ఒకేలా ఉన్నారు. పెద్ద తేడా ఏమీ లేదు. విరాట్ క్రికెట్ తో పాటు వ్యాపారాలతో కూడా సంపాదిస్తున్నాడు. సచిన్, ధోనీ కూడా బాగానే సంపాదిస్తున్నారు.
ఈ ముగ్గురికి కార్ల పిచ్చి
చాలా మంది క్రికెటర్లకు ఖరీదైన కార్లంటే పిచ్చి. విరాట్, ధోనీ, సచిన్ కూడా అంతే. వీళ్ళ దగ్గర లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది. ఎవరి దగ్గర ఏముందో చూద్దాం.
సచిన్ కార్ కలెక్షన్
సచిన్ కార్లకు పెద్ద ఫ్యాన్. మొదటి నుంచీ ఖరీదైన కార్లలో తిరగడం ఇష్టం. ఆయన దగ్గర కోట్ల రూపాయల విలువ చేసే కార్లు ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ C36 నుంచి 4.18 కోట్ల లాంబోర్ఘిని URUS S వరకూ ఉన్నాయి.
ధోనీ కార్ కలెక్షన్
ధోనీ దగ్గర కూడా చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. 3.57 కోట్ల Ferrari 599 GTO ఉంది. ఈ విషయంలో సచిన్ కంటే కాస్త వెనకే ఉన్నాడు. కానీ, అతని గ్యారేజీలో ఇంకా చాలా కార్లు ఉన్నాయి.
విరాట్ కార్ కలెక్షన్
విరాట్ గ్యారేజీలో ఖరీదైన బెంట్లీ కాంటినెంటల్ కారుంది. దీని ధర 3.29 నుంచి 4.04 కోట్లు. 3.41 కోట్ల ఫ్లయింగ్ Spur కూడా ఉంది. ప్రస్తుతం విరాట్, సచిన్, ధోనీ కంటే ముందున్నాడు.