49 ఎప్పుడు వస్తుందో తెలీదు! కానీ 50వ సెంచరీ మాత్రం ఆ దేశంపైనే... సునీల్ గవాస్కర్ కామెంట్...
వన్డేల్లో మెరుపు వేగంతో 48 సెంచరీలు బాదేశాడు విరాట్ కోహ్లీ. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 95 పరుగులు చేసి, సెంచరీకి 5 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ..
Virat Kohli
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో 5 మ్యాచుల్లో 354 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, తన సూపర్ ఫామ్‌ని కొనసాగిస్తున్నాడు. 3 సెంచరీలు బాదిన క్వింటన్ డి కాక్ మాత్రమే 407 పరుగులతో విరాట్ కంటే ముందున్నాడు..
Rohit Sharma -Virat Kohli
విరాట్ కోహ్లీ మరో సెంచరీ చేస్తే, 49 వన్డే సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేస్తాడు. ఆ తర్వాత ఇంకో సెంచరీ చేస్తే, వన్డేల్లో 50వ సెంచరీ చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా వరల్డ్ రికార్డు క్రియేట్ చేస్తాడు..
Virat Kohli
ఇప్పటికే విరాట్ కోహ్లీ 50వ సెంచరీ గురించి, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఆరు నెలలుగా ప్రోమోలు తయారుచేసి సిద్ధం చేసి పెట్టుకుంది. విరాట్ 50వ సెంచరీ మీద స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా నడుస్తున్నాయి...
‘విరాట్ కోహ్లీ 49వ వన్డే సెంచరీ ఎప్పుడు కొడతాడో తెలీదు కానీ, రికార్డు బ్రేకింగ్ 50వ సెంచరీ ఎప్పుడు కొడతాడో మాత్రం నాకు బాగా తెలుసు...
Virat Kohli
విరాట్ తన 50వ వన్డే సెంచరీని ఈడెన్ గార్డెన్స్‌లో సౌతాఫ్రికాపై బాదుతాడు. ఎందుకంటే ఆ రోజు అతని బర్త్ డే (నవంబర్ 5). పుట్టిన రోజున 50వ సెంచరీ బాదడం కంటే స్పెషల్ గిఫ్ట్ ఇంకేముంటుంది...
Virat Kohli
ఈడెన్ గార్డెన్స్‌లో కోహ్లీ సెంచరీ చేస్తే, స్టేడియంలో ప్రేక్షకులు అందరూ లేచి నిలబడి చప్పట్లతో అభినందిస్తారు. విజిల్స్, క్లాప్స్, కేకలతో స్టేడియం దద్ధరిల్లిపోతుంది..
క్రికెటర్ అయినా ఇలాంటి మూమెంట్సే కదా కోరుకుంటాడు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్..