MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • Cricket
  • విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు.. లెజెండ‌రీ ప్లేయ‌ర్ల‌ను అధిగ‌మిస్తాడా?

విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు.. లెజెండ‌రీ ప్లేయ‌ర్ల‌ను అధిగ‌మిస్తాడా?

Virat Kohli : దులీప్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ ఆడ‌తాడ‌నుకున్నారు. కానీ, దులీప్ ట్రోఫీకి కోహ్లీ ఎంపిక కాలేదు. దీంతో బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌లో నేరుగా ఆడ‌నున్నాడు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 15 2024, 12:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Virat Kohli

Virat Kohli

Virat Kohli : ఇటీవ‌ల శ్రీలంక ప‌ర్య‌ట‌న‌ను ముగించిన భార‌త్ వ‌చ్చే నెల‌లో బంగ్లాదేశ్ లో టెస్టు సిరీస్ ఆడ‌నుంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో కోహ్లీ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్‌లో ఆడిన అత‌ని నుంచి పెద్ద ఇన్నింగ్స్ రాలేదు. ఇప్పుడు దులీప్ ట్రోఫీలో ఆడతాడని వార్తలు వచ్చాయి, కానీ అది జరగలేదు. విరాట్ కోహ్లీ దులీప్ ట్రోఫీకి ఎంపిక కాలేదు. దీంతో బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌లో నేరుగా అడుగుపెట్టనున్నాడు.ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ ప‌లు రికార్డులు సృష్టించే ఛాన్స్ ఉంది.


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Virat Kohli,Sachin Tendulkar

Virat Kohli,Sachin Tendulkar

బంగ్లాదేశ్ సిరీస్ లో విరాట్ కోహ్లీ ప‌లు రికార్డులు సృష్టించ‌నున్నాడు. బంగ్లాదేశ్‌పై అత్యధిక పరుగులు చేసిన ప్లేయ‌ర్ల లిస్టులో పుజారా, ద్రవిడ్‌ల కంటే కోహ్లీ కాస్త వెనుకబడి ఉన్నాడు. ఈ సిరీస్‌లో మంచి ప్ర‌ద‌ర్శ‌నతో వీరిని అధిగ‌మించే అవ‌కాశ‌ముంది. బంగ్లాదేశ్‌పై అత్యధిక టెస్టు పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్లలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. 6 మ్యాచ్‌ల్లో 9 ఇన్నింగ్స్‌ల్లో 437 పరుగులు చేశాడు. అతని కంటే ముందు చెతేశ్వర్‌ పుజారా (468 పరుగులు), రాహుల్‌ ద్రవిడ్‌ (560 పరుగులు), సచిన్‌ టెండూల్కర్‌ (820 పరుగులు) ఉన్నారు. విరాట్ 32 పరుగులు చేస్తే, పుజారా 124 పరుగులు చేస్తే ద్రవిడ్‌ను అధిగమిస్తాడు. ఇదే స‌మ‌యంలో స‌చిన్ టెండూల్క‌ర్ ను అధిగ‌మించాలంటే బంగ్లాదేశ్ తో జ‌రిగే సిరీస్ లో కోహ్లీ 384 పరుగులు చేయాల్సి ఉంటుంది.

35

టెస్టు సిరీస్‌లో గ్రేట్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డాన్ బ్రాడ్‌మన్‌ను కూడా విరాట్ అధిగ‌మించ‌నున్నాడు. బ్రాడ్‌మాన్ 52 టెస్టు మ్యాచ్‌ల్లో 99.94 సగటుతో 6996 పరుగులు చేశాడు. అలాగే, 29 సెంచరీలు కొట్టాడు. విరాట్ కోహ్లి 113 టెస్టు మ్యాచ్‌లు ఆడి 191 ఇన్నింగ్స్‌ల్లో 49.15 సగటుతో 8848 పరుగులు చేశాడు. 29 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు సాధించాడు. బంగ్లాదేశ్‌పై విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే బ్రాడ్‌మన్‌ను అధిగమిస్తాడు. అలాగే, ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హేడెన్, వెస్టిండీస్‌కు చెందిన శివనారాయణ్ చందర్‌పాల్‌ల 30 సెంచ‌రీల రికార్డును స‌మం చేస్తాడు. 

45

బంగ్లాదేశ్‌పై అత్యధిక సెంచరీలు సాధించిన జట్టులో కోహ్లీ ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, మాజీ ఓపెనర్ మురళీ విజయ్‌లతో సమానంగా ఉన్నాడు. మరో సెంచరీతో వీరిద్దరినీ అధిగ‌మించ‌నున్నాడు. బంగ్లాదేశ్‌పై కోహ్లి, గంభీర్, విజయ్ చెరో 2 సెంచరీలు చేశారు. రాహుల్ ద్రవిడ్ 3, స‌చిన్ టెండూల్క‌ర్ 5 సెంచ‌రీల‌తో ముందున్నారు.

 

55
Virat Kohli

Virat Kohli

విరాట్‌తో పాటు గౌతమ్ గంభీర్‌కు ఈ సిరీస్ ప్రత్యేకం. కోచ్‌గా అతనికి ఇదే తొలి టెస్టు సిరీస్. టీ20లో విజయం సాధించినా వన్డేల్లో సిరీస్ లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇక టెస్టు సిరీస్‌లో టీమిండియా ఎలా రాణిస్తుందో చూడాలి. ఓవరాల్‌గా బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌ భారత క్రికెట్‌కు చాలా కీలకం. ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేందుకు విరాట్ కోహ్లీకి ఇది సువర్ణావకాశం. అలాగే, కోచ్‌గా గౌతమ్ గంభీర్ తన సత్తాను నిరూపించుకోవడానికి మంచి ఛాన్స్. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved