MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Sports
  • Cricket
  • IND vs ENG: కింగ్ కోహ్లీ విధ్వంసం.. ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో బద్దలవ్వబోయే 9 వరల్డ్ రికార్డులు ఇవే !

IND vs ENG: కింగ్ కోహ్లీ విధ్వంసం.. ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో బద్దలవ్వబోయే 9 వరల్డ్ రికార్డులు ఇవే !

India vs England: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌తో విరాట్ కోహ్లీ రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ కొన్ని అరుదైన రికార్డులు సాధించడానికి సిద్ధంగా ఉన్నారు. కింగ్ కోహ్లీ సాధించబోయే 9 భారీ రికార్డులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 14 2026, 08:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
విరాట్ కోహ్లీ రీఎంట్రీతో రికార్డుల మోతే !
Image Credit : AFP

విరాట్ కోహ్లీ రీఎంట్రీతో రికార్డుల మోతే !

టీమిండియా రన్ మెషిన్, కింగ్ విరాట్ కోహ్లీ మళ్లీ గ్రౌండ్‌లోకి అడుగుపెడుతున్నాడు. టీ20 సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత, భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. ఈ వన్డే సిరీస్ జూలై 14, 16, 19 తేదీల్లో జరగనుంది. జూలై 14న ఎడ్జ్‌బాస్టన్‌లో జరగబోయే తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని టీమిండియా ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లాండ్ 4-0తో క్లీన్ స్వీప్ చేయడంతో, కనీసం ఈ 50 ఓవర్ల ఫార్మాట్‌లోనైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని మెన్ ఇన్ బ్లూ భావిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఇంగ్లాండ్ లో కింగ్ కోహ్లీ సూపర్ ట్రాక్ రికార్డులు
Image Credit : Virat Kohli\Instagram

ఇంగ్లాండ్ లో కింగ్ కోహ్లీ సూపర్ ట్రాక్ రికార్డులు

యూకే లోనే నివసిస్తున్న విరాట్ కోహ్లీకి ఇంగ్లాండ్ పిచ్‌లపై అదిరిపోయే రికార్డు ఉంది. గత ఏడాది నుండి అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. 2025లో 13 మ్యాచ్‌ల్లో 65.10 సగటుతో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో 651 పరుగులు చేశాడు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కేవలం 3 మ్యాచ్‌ల్లోనే 80.0 సగటుతో 240 పరుగులు రాబట్టాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి.

జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన గత వన్డే సిరీస్‌కు కోహ్లీ దూరం అయ్యాడు. మే 31న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో తగిలిన హ్యామ్‌స్ట్రింగ్ గాయం వల్ల అతను ఆ సిరీస్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఇంగ్లాండ్‌పై అటాక్‌కు రెడీ అయ్యాడు. ఈ వన్డే సిరీస్‌లో కోహ్లీ సాధించబోయే ఆ 9 అద్భుతమైన రికార్డులు గమనిస్తే..

37
వన్డేల్లో వేగంగా 15 వేల పరుగులు
Image Credit : AFP

వన్డేల్లో వేగంగా 15 వేల పరుగులు

అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 15,000 పరుగుల మార్కును అందుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించేందుకు విరాట్ కోహ్లీ కేవలం 203 పరుగుల దూరంలో ఉన్నాడు. తన తదుపరి 77 వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఈ పరుగులు సాధిస్తే చాలు, వరల్డ్ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన అత్యంత వేగవంతమైన బ్యాటర్‌గా కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు.

47
లిస్ట్ ఏ క్రికెట్, ఇంగ్లాండ్‌పై సెంచరీల రికార్డు
Image Credit : Getty

లిస్ట్ ఏ క్రికెట్, ఇంగ్లాండ్‌పై సెంచరీల రికార్డు

క్రికెట్ ప్రపంచంలో అత్యధిక లిస్ట్ ఏ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలవడానికి కోహ్లీకి కేవలం 2 సెంచరీలు మాత్రమే కావాలి. అంతేకాకుండా, అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లాండ్ జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన భారతీయ ఆటగాడిగా నిలిచేందుకు కూడా విరాట్‌కు మరో 2 సెంచరీలు అవసరం. ఈ మూడు వన్డేల్లో కోహ్లీ బ్యాట్ నుండి రెండు సెంచరీలు వస్తే ఈ రెండు రికార్డులు బద్దలవుతాయి.

57
ఇంగ్లాండ్ గడ్డపై రన్ మెషిన్ హవా
Image Credit : Getty

ఇంగ్లాండ్ గడ్డపై రన్ మెషిన్ హవా

ఇంగ్లాండ్ దేశంలో వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్‌గా నిలిచేందుకు విరాట్ కోహ్లీకి కేవలం 9 పరుగులు మాత్రమే అవసరం. ఈ తొమ్మిది పరుగులు చేస్తే చాలు, ఇంగ్లాండ్ పిచ్‌లపై ఇండియా తరఫున మోస్ట్ సక్సెస్‌ఫుల్ వన్డే బ్యాటర్ అవుతాడు. అలాగే ఇంగ్లాండ్‌పై ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసిన ఇండియన్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేయడానికి కోహ్లీకి ఒక్క హాఫ్ సెంచరీ చాలు.

67
విజయాల్లో భాగస్వామ్యంతో రికార్డు
Image Credit : BCCI

విజయాల్లో భాగస్వామ్యంతో రికార్డు

టీమిండియా గెలిచిన మ్యాచ్‌ల్లో అత్యధిక వన్డే హాఫ్ సెంచరీలు (50+) చేసిన భారతీయ ఆటగాడిగా నిలిచేందుకు విరాట్‌కు కేవలం ఒకే ఒక్క ఫిఫ్టీ ప్లస్ స్కోరు అవసరం. దీనితో పాటు, భారత్ గెలిచిన వన్డే మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ క్రికెటర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకోవడానికి కోహ్లీకి ఇంకా 36 పరుగులు కావాలి.

77
నంబర్ 3 పొజిషన్, వన్డే రికార్డులు
Image Credit : Asianet News

నంబర్ 3 పొజిషన్, వన్డే రికార్డులు

వన్డే క్రికెట్‌లో వన్ డౌన్ అంటే నంబర్ 3 పొజిషన్‌లో బ్యాటింగ్ చేస్తూ 16,000 పరుగుల మైలురాయిని పూర్తి చేయడానికి విరాట్ కోహ్లీకి మరో 81 పరుగులు కావాలి. చివరగా, వన్డే ఫార్మాట్‌లో ఇంగ్లాండ్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్‌గా టాప్‌లో కూర్చోవడానికి కోహ్లీకి 150 పరుగులు అవసరం. ఈ రెండు జట్ల మధ్య 3 వన్డేల పోరు జరగనుండటంతో అభిమానులందరి కళ్ళు కింగ్ కోహ్లీ ప్రదర్శనపైనే ఉన్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
విరాట్ కోహ్లీ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఖ‌రారు.. ఎవ‌రు ఇన్‌, ఎవ‌రు అవుట్ అంటే.?
Recommended image2
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image3
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Related Stories
Recommended image1
Top 5 Low Calorie Beers in India: ఇండియాలో దొరికే టాప్ 5 లో-క్యాలరీ బీర్లు ఏవో తెలుసా? సూపర్ టేస్ట్ !
Recommended image2
Andhra Kashmir: బాబోయ్ ఏపీలో మంచు కురిసే ప్లేస్ ఉందా? ఆంధ్రా కాశ్మీర్ పూర్తి వివరాలు మీకోసం !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved