MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఆమె నా ప్రపంచం అంటూ విరాట్ కోహ్లీ పోస్ట్... టెండూల్కర్‌కీ, నీకు ఉన్న తేడా ఇదేనంటూ...

ఆమె నా ప్రపంచం అంటూ విరాట్ కోహ్లీ పోస్ట్... టెండూల్కర్‌కీ, నీకు ఉన్న తేడా ఇదేనంటూ...

ప్రస్తుతం ట్విట్టర్‌లో వన్ వార్డ్ ట్రెండ్ నడుస్తోంది.కొందరు ‘ఫుట్‌బాల్’, మరికొందరు ‘క్రికెట్’, ఇంకొందరు ‘లవ్’, ‘ట్రస్ట్’, ‘బిగ్‌బాస్’... ఇలా తాము ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే దాని గురించి సింగిల్ వర్డ్‌తో ట్వీట్ చేస్తున్నారు. ఇదే సమయంలో విరాట్ కోహ్లీ వేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 02 2022, 07:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తన భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ఫోటోను ట్వీట్ చేసిన విరాట్ కోహ్లీ... ‘మై వరల్డ్... లవ్’ అంటూ కాప్షన్ జోడించాడు. విరాట్ కోహ్లీ చేసిన పోస్టుకి సోషల్ మీడియా నుంచి మిశ్రమ స్పందన వస్తోంది... దానికి కారణం సచిన్ టెండూల్కర్ వేసిన ట్వీట్...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Sachin Tendulkar

Sachin Tendulkar

10 ఏళ్ల క్రితం క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ టెండూల్కర్, ఇప్పటికీ ‘క్రికెట్’ అంటూ తాను ఎక్కువగా ప్రేమించేది ఇంకేదీ లేదని క్లారిటీ ఇచ్చేశాడు. సచిన్ టెండూల్కర్ ట్వీట్‌కి వేలల్లో లైకులు వచ్చాయి... దీంతో విరాట్ ట్వీట్‌ని, టెండూల్కర్ ట్వీట్‌ని పోలుస్తూ పోస్టులు చేస్తున్నారు నెటిజన్లు...

37

సచిన్ టెండూల్కర్ తన జీవితంలో మిగిలిన అన్ని విషయాల కంటే క్రికెట్‌ని ఎక్కువగా ప్రేమించాడని... అందుకే 24 ఏళ్ల పాటు క్రికెట్ కెరీర్‌ని కొనసాగించి, 100 సెంచరీలు చేయగలిగాడని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

47

సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేస్తాడని అనుకున్న విరాట్ కోహ్లీ, కెరీర్ మధ్యలో ఫోకస్ ప్రేమ, పెళ్లి, కుటుంబం వంటి వాటిపైకి మళ్లించడం వల్లే 1000+ రోజులుగా సెంచరీ చేయలేకపోతున్నాడంటూ ట్రోల్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు...

57

ఆరేళ్ల క్రితం గ్లవ్స్, బ్యాటు, హెల్మెట్ ఉన్న క్రికెట్ కిట్‌ను పోస్ట్ చేసిన విరాట్ కోహ్లీ, ‘లైఫ్ ఇన్ ఏ బాక్స్’ అంటూ కాప్షన్ ఇచ్చాడు. ఆరేళ్లలో విరాట్ జీవితంలో చాలా మారిపోయాయని, క్రికెట్‌కి అతను ఇచ్చే ప్రాధాన్యం కూడా తగ్గిపోయిందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్.. 

67

అయితే ఫ్యాన్స్ నుంచి విరాట్ కోహ్లీకి మంచి సపోర్ట్ దక్కుతోంది. కుటుంబం కంటే ఏదీ ఎక్కువ కాదని, ఆ విషయం విరాట్ కోహ్లీ తెలుసుకున్నాడని, అందుకే తన భార్య ఫోటోను పోస్ట్ చేశాడని అంటున్నారు కోహ్లీ అభిమానులు...

77
Anushka Sharma holds Virat Kohli

Anushka Sharma holds Virat Kohli

విరాట్ కోహ్లీ వేసిన ట్వీట్‌కి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. ‘లక్కీ మ్యాన్ మేట్...’ అంటూ కామెంట్ చేశాడు డేవిడ్ వార్నర్... 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Recommended image2
రాంచీలో ర‌ఫ్ఫాడించిన షాయ్ హోప్.. టీమిండియాపై వెస్టిండిస్‌ సంచ‌ల‌న విజ‌యం
Recommended image3
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved