- Home
- Sports
- Cricket
- కోచ్ అనిల్ కుంబ్లేని చూసి ప్లేయర్లు భయపడ్డారా? విరాట్ ఏం చెప్పాడు!... మరోసారి తెరపైకి ఆ వివాదం...
కోచ్ అనిల్ కుంబ్లేని చూసి ప్లేయర్లు భయపడ్డారా? విరాట్ ఏం చెప్పాడు!... మరోసారి తెరపైకి ఆ వివాదం...
రవిశాస్త్రికి ముందు టీమిండియా హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే. అయితే భారత సారథి విరాట్ కోహ్లీతో విభేదాల కారణంగా అనిల్ కుంబ్లే హెడ్ కోచ్ బాధ్యతల నుంచి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. నిజానికి కోహ్లీ కారణంగా కుంబ్లేని హెడ్ కోచ్ పొజిషన్ నుంచి తప్పించింది బీసీసీఐ...

విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరడంతో వివాదాన్ని పరిష్కరించడానికి బీసీసీఐ, సీఓఏ (కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్)ని నియమించాల్సి వచ్చింది...
విరాట్ కోహ్లీ వాదనలను, అనిల్ కుంబ్లే అభిప్రాయాలను విన్న సీఓఏ, చివరికి చేసేదేమీలేక టీమిండియా హెడ్ కోచ్‌ని మారుస్తూ నిర్ణయం తీసుకుంది...
బీసీసీఐ అనుబంధ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్స్‌లో సభ్యుడిగా ఉన్న వినోద్ రాయ్, ‘నాన్ జస్ట్ ఏ నైట్‌వాచ్‌మెన్ - మై ఇన్నింగ్స్ ఇన్ బీసీసీఐ’ పుస్తకంలో కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు..
‘కెప్టెన్‌తో, టీమ్ మేనేజ్‌మెంట్‌తో మేం జరిపిన చర్చల వల్ల అనిల్ కుంబ్లే, టీమ్ సభ్యుల క్రమశిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉండేవాడు...
అందుకే టీమ్ సభ్యులకు, అనిల్ కుంబ్లే వ్యవహరించే విధానం నచ్చలేదు. విరాట్ కోహ్లీతో మేం ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు, కొందరు యంగ్ క్రికెటర్లు, కోచ్ అనిల్ కుంబ్లేని చూసి భయపడుతున్నారని చెప్పాడు...
అనిల్ కుంబ్లే లండన్ నుంచి వచ్చిన తర్వాత ఈ విషయం గురించి సుదీర్ఘ చర్చలు జరిపాం. ఈ పరిణామాలతో అనిల్ కుంబ్లే చాలా బాధపడ్డారు...
తాను కరెక్టుగానే ఉన్నాననే, కరెక్టుగా ఉండడమే వాళ్లకి నచ్చడం లేదని చాలా ఫీల్ అయ్యాడు. కెప్టెన్ కానీ, టీమ్ కానీ తన నిర్ణయాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని కుంబ్లే బాధపడడం చూశా...
ప్లేయర్లు క్రమశిక్షణతో నడుచుకునేలా చూడడం కోచ్ బాధ్యత. ఓ సీనియర్‌గా అనిల్ కుంబ్లే చాలా ప్రొఫెషనల్‌గా నడుచుకున్నారు...
కనీసం సీనియర్ క్రికెటర్ అనే గౌరవం కూడా కెప్టెన్ కానీ, ప్లేయర్లు కానీ అనిల్ కుంబ్లేకి ఇవ్వలేదు...’ అంటూ రాసుకొచ్చాడు వినోద్ రాయ్..
2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియా ఘోర ఓటమి తర్వాత హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు అనిల్ కుంబ్లే. అయితే కుంబ్లే మీద కోపంతోనే టీమిండియా కావాలని ఫైనల్‌లో ఓడిందనే ఆరోపణలు కూడా వచ్చాయి.