- Home
- Sports
- Cricket
- కోహ్లీ, రోహిత్, జడేజాలకు కొమ్ములొచ్చాయా? ఎందుకని ఆ మ్యాచులు ఆడడం లేదు.. - కపిల్ దేవ్
కోహ్లీ, రోహిత్, జడేజాలకు కొమ్ములొచ్చాయా? ఎందుకని ఆ మ్యాచులు ఆడడం లేదు.. - కపిల్ దేవ్
టీమిండియాలోకి వచ్చిన తర్వాత చాలామంది క్రికెటర్లు, దేశవాళీ టోర్నీల్లో ఆడడం మానేస్తున్నారు. టీమ్‌లో చోటు కోసం ఎదురుచూస్తున్న శిఖర్ ధావన్ కూడా ఆడితే ఐపీఎల్, లేదంటే టీమిండియాకే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. ఈ ధోరణిపై ఫైర్ అయ్యాడు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్..

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లు.. దేశవాళీ టోర్నీల్లో ఆడి చాలా కాలమే అయ్యింది. టీ20, వన్డేలు మాత్రమే ఆడుతున్న హార్ధిక్ పాండ్యా, యజ్వేంద్ర చాహాల్ వంటి ప్లేయర్లు కూడా దేశవాళీ టోర్నీల్లో కనిపించడం లేదు..
అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా, హనుమ విహారి, మయాంక్ అగర్వాల్ వంటి టెస్టు ప్లేయర్లు మాత్రమే దేశవాళీ టోర్నీల్లో కనిపిస్తున్నారు.. సూర్యకుమార్ యాదవ్ కూడా రంజీ ట్రోఫీతో పాటు దేవ్‌ధర్ ట్రోఫీలోనూ ఆడాడు.. ఇషాన్ కిషన్ మాత్రం దేవ్‌ధర్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు.
rohit kohli
‘ప్రతీ ప్లేయర్‌కి దేశవాళీ క్రికెట్ చాలా ముఖ్యం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా లేదా మరో భారత టాప్ ప్లేయర్‌ని ఒక్క దేశవాళీ మ్యాచ్ ఆడుతుండగా చూశామా.. టీమిండియాలోకి రాగానే చాలామంది ప్లేయర్లకు కొమ్ములు మొలిచేస్తున్నాయి..
rohit kohli dhawan
మేము ఇంక దేశవాళీ క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారు. అయితే ప్రతీ ప్లేయర్, దేశవాళీ టోర్నీల్లో ఆడితే, వారికి మాత్రమే కాకుండా భవిష్యత్ తరానికి కూడా అది ఉపయోగపడుతుంది. టీమిండియా స్టార్ ప్లేయర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నప్పుడు ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు..
వెస్టిండీస్ టూర్‌లో టీమిండియా ఫెయిల్యూర్‌కి సంజూ శాంసన్‌ని ఒక్కడినే బాధ్యుడిని చేస్తూ మాట్లాడడం విన్నాను. అతను సరిగ్గా ఆడలేదు సరే, మిగిలిన అందరూ బాగా ఆడారా? సంజూ శాంసన్ చాలా గొప్ప ప్లేయర్, ఎంతో టాలెంట్ ఉన్న ఆటగాడు..
Sanju Samson
అయితే ఓ ఆటగాడు సక్సెస్ అవ్వడానికి అతని బలం, బలహీనత తెలుసుకోవడం చాలా ముఖ్యం. టాపార్డర్‌లో ఆడే సంజూ శాంసన్‌ని లోయర్ మిడిల్ ఆర్డర్‌లో పంపించి, ఆడమంటే ఎలా ఆడతాడు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్..