MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ధోనీకి బర్త్ డే విషెస్ చెప్పని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... అసలు కారణం ఇదేనా...

ధోనీకి బర్త్ డే విషెస్ చెప్పని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... అసలు కారణం ఇదేనా...

మహేంద్ర సింగ్ ధోనీ, జూలై 7న 42వ పుట్టినరోజు జరుపుకున్నాడు. సచిన్ టెండూల్కర్‌, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, వసీం జాఫర్, వరుణ్ చక్రవర్తి, రిషబ్ పంత్.. ఇలా మాజీ క్రికెటర్లు, యువక్రికెటర్లు అందరూ ధోనీకి సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు... 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jul 08 2023, 10:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఎక్కడున్నా సరే మహేంద్ర సింగ్ ధోనీ బర్త్ డేకి అతన్ని వెలిసి కలిసి సెలబ్రేట్ చేయడం రిషబ్ పంత్‌కి అలవాటు. 2021లో దుబాయ్‌కి వెళ్లి, మాహీ బర్త్ డే సెలబ్రేట్ చేశాడు రిషబ్ పంత్...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

2022 డిసెంబర్‌లో తీవ్రంగా గాయపడి కోలుకుంటున్న రిషబ్ పంత్, ఈసారి మాహీ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో పాలుపంచుకోలేకపోయాడు. అయినా తన ఇంట్లోనే ధోనీ బర్త్ డేని కట్ చేసి సెలబ్రేట్ చేసి, మాహీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు రిషబ్ పంత్..

39

అయితే భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం మహేంద్ర సింగ్ ధోనీకి బర్త్ డే విషెస్ చెప్పలేదు. విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటాడు..

49

ప్రతీ క్రికెటర్‌ బర్త్‌ డేకి ఇన్‌స్టాలో స్టేటస్ పెట్టి విష్ చేస్తుంటాడు విరాట్ కోహ్లీ. అలాగే కొందరు సీనియర్లకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసి బర్త్ డే విషెస్ చేస్తుంటాడు. అయితే మాహీ బర్త్ డే సమయంలో కోహ్లీ ఇన్‌స్టాలో స్టేటస్ కానీ, ట్విట్టర్‌లో పోస్ట్ కానీ చేయకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది..

59

రోహిత్ శర్మ కూడా సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్‌గా ఉంటాడు. నిన్న గాక మొన్న ఓ ప్రమోషనల్ పోస్ట్ కూడా చేశాడు రోహిత్. అయితే ధోనీ బర్త్ డే సందర్భంగా రోహిత్ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి విషెస్ చెబుతూ ఒక్క పోస్ట్ కూడా రాలేదు..

69
Dhoni-Rohit

Dhoni-Rohit

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ధోనీ కెప్టెన్సీలోనే టీమ్‌లోకి వచ్చారు. మాహీ సారథ్యంలోనే వరుసగా మ్యాచులు ఆడి స్టార్లుగా ఎదిగారు. ఈ ఇద్దరూ మాహీ వల్లే తామీ స్థాయిలో ఉన్నామని చాలాసార్లు ప్రకటించారు కూడా.. 

79

ప్రస్తుతం ఈ ఇద్దరూ వెస్టిండీస్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటూ జూలై 12న ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌పై దృష్టి సారించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... మాహీతో నేరుగా మాట్లాడి విషెస్ తెలిపారని సమాచారం..

89

ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి టైటిల్ గెలిపించిన ధోనీ, త్వరలో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోబోతున్నట్టు ప్రకటించబోతున్నాడని సమాచారం..

99

అప్పుడు మాహీ గురించి ఎమోషనల్ పోస్టులు చేసేందుకే... ఇప్పుడు బర్త్ డే విషెస్ చెప్పలేదని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో త్వరలోనే తేలిపోనుంది.. 

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ZIM: టీమిండియా ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌... ఒక మ్యాచ్ ఉండ‌గానే సిరీస్ కైవ‌సం
Recommended image2
IND vs ZIM Preview : టీమిండియాలో కీలక మార్పులు.. ఈ ఓపెనర్‌పై వేటు పడుతుందా?
Recommended image3
IND vs ZIM: 15 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. జింబాబ్వేను చిత్తు చేసిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved