సచిన్ రికార్డు బ్రేక్ చేస్తాడనే భయంతోనే విరాట్ కోహ్లీకి రెస్ట్! ఆడమ్ గిల్‌క్రిస్ట్ స్పందన...
బుల్లెట్ స్పీడ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో 77 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. వన్డేల్లో 47 సెంచరీలు బాదేసిన విరాట్, మరో 3 శతకాలు చేస్తే.. సచిన్ టెండూల్కర్ రికార్డు కూడా బ్రేక్ అవుతుంది. అయితే గత ఏడాదిన్నరగా విరాట్ కోహ్లీ ఆడిన మ్యాచుల కంటే రిజర్వు బెంచ్‌లో కూర్చున్న మ్యాచుల సంఖ్యే ఎక్కువ..
సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 463 వన్డేలు ఆడితే, అందులో 44.83 సగటుతో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు బాదాడు. రికార్డు స్థాయిలో 18426 పరుగులు చేసి... వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు..
sachin kohli
విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా తన వన్డే కెరీర్‌లో 280 మ్యాచులు ఆడి 47 సెంచరీలు, 65 హాఫ్ సెంచరీలతో 13027 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ వన్డే యావరేజ్ 57.38గా ఉంది.. కోహ్లీ మరో 2 సెంచరీలు చేస్తే, సచిన్ రికార్డును సమం చేస్తాడు..
‘సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేస్తాడనే ఉద్దేశంతోనే విరాట్ కోహ్లీని కొన్ని రోజులుగా వరుసగా మ్యాచులు ఆడించడం లేదు..’ అని ఆడమ్ గిల్‌క్రిస్ట్ కామెంట్ చేసినట్టుగా ఓ వ్యక్తి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు..
దీంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, సచిన్ టెండూల్కర్‌ని ట్రోల్ చేస్తూ పోస్టులు చేయడం మొదలెట్టారు. సంజూ శాంసన్‌ని కాదని, ముంబై ప్లేయర్లు కావడం వల్లే సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లను ఆడిస్తున్నాడని రోహిత్ శర్మ ట్రోల్ ఎదుర్కొంటున్నాడు.
Kohli-Rohit hug
ఇప్పుడు ముంబై ప్లేయర్ కావడం వల్లే సచిన్ టెండూల్కర్ రికార్డులు, విరాట్ ఎక్కడ బ్రేక్ చేస్తాడనే భయంతోనే అతన్ని రెస్ట్ పేరుతో రోహిత్ శర్మ అండ్ కో... టీమ్‌కి దూరం పెడుతున్నారని ట్రోల్ చేస్తున్నారు..
ఈ పోస్ట్ చూసిన ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, ‘నేను ఇలా ఎప్పుడూ చెప్పలేదు...’ అంటూ వివరణ ఇచ్చాడు. దీంతో సచిన్- విరాట్ ఫ్యాన్స్ మధ్య గొడవకి కాస్త బ్రేక్ పడినట్టైంది..