విరాట్ కోహ్లీ ఆడటం కష్టమేనా..
Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించిన టీమిండియా జట్టులో రన్ మిషన్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ గాయంతో బాధపడుతున్నాడు.

ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో ఇండియా 3-1 తేడాతో ఓడిపోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తో పాటు భారత ప్లేయర్ల బ్యాటింగ్ వైఫల్యమే దీనికి ప్రధాన కారణం. మొదటి టెస్ట్‌లో సెంచరీ కొట్టిన కోహ్లీ ఆ తర్వాత ఒక్క అర్ధ సెంచరీ కూడా చేయలేదు. ఈ పరాజయం తర్వాత కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ క్రమంలోనే రంజీ ట్రోఫీ లాంటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాలని సూచించారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి జట్లతో ఆడాలంటే రంజీ ఉపయోగపడుతుందని సునీల్ గవాస్కర్ లాంటి మాజీల సలహాలు ఇస్తున్నారు.
విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ లలో ఆడతాడా?
స్టార్ ప్లేయర్లు సైతం పరుగులు చేయడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో దేశవాళీ క్రికెట్ లో ఆడాలనే మాజీ సలహాల మధ్య కోచ్ గౌతమ్ గంభీర్ స్పందిస్తూ.. 'అందరూ రంజీ ట్రోఫీ ఆడాలి. దీనికి ప్రాధాన్యత ఇవ్వకపోతే టెస్ట్ క్రికెట్ ఆడేవాళ్ళను ఎంపిక చేయడం కష్టం' అన్నారు.
బీసీసీఐ ఒత్తిడితో కోహ్లీ రంజీలో ఢిల్లీ తరఫున ఆడతారని వార్తలు వచ్చాయి. జనవరి 23న సౌరాష్ట్రతో మ్యాచ్‌కు ముందు ఢిల్లీ జట్టులో చేరతారని ప్రచారం జరిగింది. అయితే కోహ్లీకి గాయం అయిందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
విరాట్ కోహ్లీకి ఏమైంది?
విరాట్ కోహ్లీకి మెడనొప్పి వచ్చిందట. నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో రంజీలో ఆడతారా లేదా అన్నది సందేహం. ఢిల్లీకి సౌరాష్ట్ర, రైల్వేస్‌తో మ్యాచ్‌లు ఉన్నాయి. సౌరాష్ట్ర మ్యాచ్‌ను వదిలేసి రైల్వేస్‌తో ఆడతారని పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. రంజీ మ్యాచ్ లలో మొత్తంగా ఆడడు అని కూడా పలు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
కోహ్లీ గాయం.. బీసీసీఐ అసంతృప్తి
ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లకు ముందు రంజీ మంచి ప్రాక్టీస్ అవుతుందని బీసీసీఐ భావిస్తోంది. కానీ కోహ్లీకి గాయం అయిందన్న వార్తతో బీసీసీఐ అసంతృప్తిగా ఉంది. కోహ్లీకి ఎలా గాయం అయింది? రంజీ ఆడకుండా ఉండటానికే ఇలా చేశారా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రంజీ ఆడే ఢిల్లీ జట్టును త్వరలోనే ఎంపిక చేయనున్నారు. అప్పుడు కోహ్లీ ఆడతారా లేదా అన్నది తేలిపోతుంది.
ఖో ఖో ప్రపంచ కప్ 2025: ఫైనల్లో భారత్ vs నేపాల్.. గెలిచేది ఎవరు?
Image Credit: Getty Images
టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 స్క్వాడ్ ఇదే
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ శనివారం ముంబైలో విలేకరుల సమావేశంలో ఐసీసీ మెగా టోర్నీ కోసం జట్టు వివరాలను పంచుకున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్.