ఫోకస్ అంతా సచిన్ రికార్డుపైనే! వన్డే వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచుల్లో విరాట్‌కి చెత్త రికార్డు...
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ లీగ్ మ్యాచుల్లో భారత జట్టు అంచనాలకు మించి అదరగొట్టింది. తొమ్మిదికి తొమ్మిది మ్యాచులు గెలిచి టేబుల్ టాపర్‌గా, అన్‌బీటెడ్ టీమ్‌గా సెమీస్ చేరింది. భారత జట్టు నుంచి విరాట్ కోహ్లీ 594, రోహిత్ శర్మ 503, శ్రేయాస్ అయ్యర్ 421 పరుగులతో టాప్ 10లో ఉన్నారు..
Trent Boult-Virat Kohli
లీగ్ స్టేజ్ ముగిసే సమయానికి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, మరో 80 పరుగులు చేస్తే, సచిన్ టెండూల్కర్ 673 పరుగుల రికార్డును బ్రేక్ చేస్తాడు.
2003 వన్డే వరల్డ్ కప్‌లో సచిన్ టెండూల్కర్ 7 సార్లు 50+ స్కోర్లు చేసి, 673 పరుగులతో వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. 20 ఏళ్లుగా ఏ క్రికెటర్ కూడా ఈ రికార్డును టచ్ చేయలేకపోయాడు..
ఈసారి విరాట్ కోహ్లీ 594తో పాటు క్వింటన్ డి కాక్ 591, రచిన్ రవీంద్ర 565 పరుగులతో సచిన్ టెండూల్కర్ రికార్డుకి దగ్గరగా వచ్చారు. రోహిత్ శర్మ 503, డేవిడ్ వార్నర్ 499లకు కూడా ఛాన్స్ ఉంది...
అయితే విరాట్ కోహ్లీపైనే ఫోకస్ అంతా తిరుగుతోంది. వన్డేల్లో 50వ సెంచరీకి చేరువ కావడంతో విరాట్ కోహ్లీ ఈ ఫీట్‌ని ఎప్పుడు అందుకుంటాడా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
అయితే విరాట్‌కి, వన్డే వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచుల్లో అస్సలు చెప్పుకోదగ్గ రికార్డు లేదు. 2011 వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో 24 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, పాకిస్తాన్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో 9 పరుగులు చేశాడు..
శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో గౌతమ్ గంభీర్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లీ, 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 2015లో బంగ్లాదేశ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో 3 పరుగులు చేసిన విరాట్ , ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో 1 పరుగుకే అవుట్ అయ్యాడు.
Virat Kohli
2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై 1 పరుగుకే అవుటైన విరాట్ కోహ్లీ, ఈసారి ఎలా ఆడతాడు? ఈసారి అయినా 50+ స్కోరు దాటుతాడా? అనేది ఆసక్తికరంగా మారింది..
Virat Kohli
అందరూ ఆశిస్తున్నట్టుగా విరాట్ కోహ్లీ, సెమీస్‌లో 50వ వన్డే సెంచరీ అందుకుంటే, సచిన్ టెండూల్కర్ 673 పరుగుల రికార్డు కూడా బ్రేక్ అయిపోతుంది..