విరాట్ కోహ్లీ కాస్త విశ్రాంతి తీసుకో... నిన్ను ఇలా అస్సలు చూడలేం...
విరాట్ కోహ్లీ... 13 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. కానీ కెరీర్ పీక్స్‌లోకి వెళ్లిన టైంలో విరాట్ కోహ్లీ ఆటతీరు స్థాయికి తగ్గట్టుగా లేదు. తొలి టీ20లో విరాట్ అవుటైన తీరు, అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది...

13 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో విరాట్ కోహ్లీ ఎన్నడూ వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్ కాలేదు. కానీ ఇంగ్లాండ్‌తో ఆఖరి టెస్టులో డకౌట్ అయిన విరాట్, ఆ తర్వాత జరిగిన తొలి టీ20లోనూ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు...

టెస్టు సిరీస్‌లో రెండుసార్లు, టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లోనే డకౌట్ అయిన విరాట్ కోహ్లీ... ఈ ఏడాది నెల రోజుల గ్యాప్‌లోనే మూడుసార్లు సున్నాకే పెవిలియన్ చేరి, చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు...

ప్రస్తుతం ఫామ్‌లో లేక తెగ ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీకి విశ్రాంతి అవసరమని సూచిస్తున్నారు అతని అభిమానులు. ఆసీస్ టూర్‌లో మొదటి టెస్టులో ఘోర ఓటమి తర్వాత పెటర్నిటీ లీవ్ ద్వారా స్వదేశానికి వచ్చేశాడు విరాట్...

అయితే అనుష్క శర్మ ఓ బిడ్డకు జన్మనివ్వడం, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌తో బిజీ కావడం వల్ల విరాట్ కోహ్లీ మానసికంగా, శారీరకంగా అలసిపోయాడని, ఆ ఎఫెక్ట్ అతని బ్యాటింగ్‌లో కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు...

బ్యాటింగ్‌లో ఫెయిల్ అయితే నిరుత్సాహపడడం ఏ క్రికెటర్‌కి అయినా కామన్ విషయం. అయితే కోహ్లీ మాత్రం బ్యాటింగ్ వైఫల్యాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని అతని మాటలు వింటే స్పష్టంగా అర్థమవుతోంది...

‘సుదీర్ఘ క్రికెట్ ఆడినప్పుడు, ప్రతీ క్రికెటర్‌కి ఇలాంటి కఠిన పరిస్థితులు చాలా సహజం. మనం వాటిని అంగీకరించాల్సిందే...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

ప్రాక్టీస్ సెషన్స్‌లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యేక్షం అవుతున్నాయి. వాటిని చూసిన అభిమానులు, ఈసారి కోహ్లీ సెంచరీ కొడతాడని ఆశపడుతున్నారు...

అయితే ఆర్‌సీబీ కప్ కొడుతుందని, ప్రతీ ఏడాది ఈసాలా కప్ నమ్‌దే అన్నట్టుగా... ప్రతీ మ్యాచ్ ముందు విరాట్ ఫ్యాన్స్ సెంచరీ చేస్తాడని ఆశపడడం, కోహ్లీ నిరాశపరచడం సర్వసాధారణం అయిపోయింది...

విరాట్ కోహ్లీ ఆఖరి అంతర్జాతీయ సెంచరీ బాది 477 రోజులు దాటింది. అతని కెరీర్‌లోనే ఇది సుదీర్ఘమైన బ్రేక్... ఇప్పుడు విరాట్ కోహ్లీకి నిజంగానే రెస్ట్ అవసరం...

‘క్రికెట్ గాడ్’గా కీర్తించబడిన సచిన్ టెండూల్కర్, ‘దాదా’ సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ కూడా కెరీర్‌లో ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నవాళ్లే. కానీ వాటిని అధిగమించి, అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి లెజెండ్స్‌గా మారారు ఆ క్రికెటర్లు...

ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ‘మోడ్రన్ క్రికెట్ లెజెండ్’ అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ రన్ మెషిన్‌ను ఇలాంటి పరిస్థితుల్లో చూడడమే అభిమానులకు కష్టంగా ఉంది.

జట్టు విజయాలు అందుకున్నంతవరకూ అతనిపై వచ్చే విమర్శలు తక్కువే కావచ్చు, కానీ ఒక్క మ్యాచ్ ఓడిపోతే అన్ని చేతులు కోహ్లీ వైఫల్యాన్నే ఎత్తి చూపిస్తుంటాయి. అందుకే కాస్త బ్రేక్ తీసుకుని అయినా స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాట్ కోహ్లీ అభిమానులు...

ఒక్క సెంచరీ చేస్తే, మళ్లీ పరుగుల ప్రవాహాన్ని కొనసాగించడం విరాట్ కోహ్లీకి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. కానీ ఆ సెంచరీ ఎప్పుడు వస్తుందనే కోహ్లీ అభిమానుల ఎదురుచూపు... ఈ టీ20 సిరీస్‌లో వస్తే కోహ్లీ ఫ్యాన్స్‌తో పాటు టీమిండియా అభిమానులు కూడా సంతోషంలో మునిగిపోవడం ఖాయం.