- Home
- Sports
- Cricket
- రోహిత్ సేనకు మొదటి ఛాలెంజ్! ఇంగ్లాండ్‌లో టీ20 సిరీస్ నెగ్గగలడా... విరాట్ కోహ్లీకి మాత్రమే...
రోహిత్ సేనకు మొదటి ఛాలెంజ్! ఇంగ్లాండ్‌లో టీ20 సిరీస్ నెగ్గగలడా... విరాట్ కోహ్లీకి మాత్రమే...
ఇంగ్లాండ్‌తో నిర్ణయాత్మక ఐదో టెస్టులో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న భారత జట్టు, టీ20 సిరీస్‌కి సిద్ధమవుతోంది. సౌంతిప్టన్ వేదికగా జరగనున్న మొదటి టీ20లో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా వంటి సీనియర్లు పాల్గొనడం లేదు. ఇంగ్లాండ్‌లో భారత జట్టు టీ20 రికార్డు ఎలా ఉంది?...

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియాకి స్వల్ప ఆధిక్యం ఉంది. ఇప్పటిదాకా ఇరుజట్ల మధ్య 19 టీ20 మ్యాచులు జరగగా 10 మ్యాచుల్లో భారత జట్టుని విజయం వరించింది. 9 మ్యాచుల్లో ఇంగ్లాండ్ గెలిచింది...
ఐసీసీ టోర్నీలు కాకుండా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల్లో 16 టీ20 మ్యాచులు జరగగా అందులో ఎనిమిదేసి మ్యాచులు గెలిచాయి. గత మార్చిలో భారత్‌లో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా 3-2 తేడాతో గెలిచింది...
ఇంగ్లాండ్‌లో భారత జట్టు మూడు సార్లు టీ20 సిరీస్ గెలిచింది. 2017లో 2-1 తేడాతో గెలిచిన టీమిండియా, 2018లో 2-1 తేడాతో, 2021లో 3-2 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. అంతకుముందు ఇంగ్లాండ్‌లో 2014లో జరిగిన టీ20 సిరీస్, ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో ఓడింది భారత జట్టు...
ఇప్పటిదాకా ఇంగ్లాండ్‌లో గెలిచిన టీ20 సిరీస్‌లన్నీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనే. దీంతో విరాట్ కోహ్లీ చేసిన ఫీట్, రోహిత్ శర్మ రిపీట్ చేయగలడా? అనేది ఆసక్తికరంగా మారింది...
ఇరుజట్ల మధ్య జరిగిన టీ20 సిరీస్‌లలో విరాట్ కోహ్లీ 577 పరుగులతో టాప్‌లో నిలవగా జోస్ బట్లర్ 373 పరుగులతో తర్వాతి స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 347 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు...
ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో ఇండియాతో జరిగే టీ20 సిరీస్ ద్వారా పూర్తి స్థాయి వైట్ బాల్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకోబోతున్నాడు జోస్ బట్లర్... యజ్వేంద్ర చాహాల్ 12 వికెట్లతో క్రిస్ జోర్డాన్ 10 వికెట్లతో టాప్‌లో నిలిచారు.