అది విరాట్ కోహ్లీ స్పెషాలిటీ... అంతమంది ప్లేయర్లలో విరాట్ కోహ్లీ ఒక్కడికే సాధ్యమైన ఫీట్...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. కొన్నాళ్లుగా తన ఫామ్ గురించి వచ్చిన విమర్శలకు తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. 6 మ్యాచుల్లో 4 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, 296 పరుగులతో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు...
Virat Kohli Six
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఫైనల్ చేరిన ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్లపై హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ... మిగిలిన ప్లేయర్లు ఎవ్వరూ ఈ ఫీట్ సాధించలేకపోయారు...
virat kohli
అంతేకాకుండా 2014 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో 319 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈసారి కూడా అతనే టాప్ రన్ స్కోరర్. రెండు టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు విరాట్ కోహ్లీ...
Image credit: Getty
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్‌ని ఎదుర్కొంటూ డెత్ ఓవర్లలో పరుగులు చేయడం చాలా కష్టం. న్యూజిలాండ్ జట్టు, సెమీ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై ఆఖరి 4 ఓవర్లలో 31 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్, పాక్‌పై ఫైనల్‌లో చివరి 18 బంతుల్లో 28 పరుగులు చేసింది...
Virat Kohli
జింబాబ్వే, పాక్‌తో మ్యాచ్‌లో ఆఖరి 4 ఓవర్లలో 26 పరుగులు చేస్తే, సౌతాఫ్రికా 25 పరుగులు, బంగ్లాదేశ్ 20 పరుగులు, నెదర్లాండ్స్ 17 పరుగులు మాత్రమే చేయగలిగాయి. అలాంటిది విరాట్ కోహ్లీ, పాక్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌ని ఎదుర్కొంటూ చివరి 4 ఓవర్లలో 14 బంతులు ఎదుర్కొని 39 పరుగులు చేశాడు. డెత్ ఓవర్లలో విరాట్ స్ట్రైయిక్ రేటు 279...
Virat Kohli
పాక్ ఫాస్ట్ బౌలర్ హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్ విరాట్ కోహ్లీ. సౌతాఫ్రికా కెప్టెన్ తెంబ భవుమా, హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో ఓ సిక్సర్ బాదగా.. విరాట్ కోహ్లీ రెండు సిక్సర్లు బాది మ్యాచ్‌ని మలుపు తిప్పాడు.
పాక్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడడానికి ఇబ్బంది పడడం చూసిన తర్వాత విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఎంత స్పెషలో అర్థమైంది చాలామంది క్రికెట్ ఫ్యాన్స్‌కి...