- Home
- Sports
- Cricket
- కోహ్లీకి అంత సీన్ లేదు! విరాట్ కంటే డేవిడ్ వార్నర్ చాలా బెటర్... ఆకాశ్ చోప్రా షాకింగ్ కామెంట్స్..
కోహ్లీకి అంత సీన్ లేదు! విరాట్ కంటే డేవిడ్ వార్నర్ చాలా బెటర్... ఆకాశ్ చోప్రా షాకింగ్ కామెంట్స్..
క్రికెట్ ఫ్యాబ్ 4లో టాప్‌లో ఉండేవాడు విరాట్ కోహ్లీ. స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియంసన్‌ల కంటే ఎక్కువ సెంచరీలు, ఎక్కువ విజయాలు అందుకున్న టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. అయితే గత మూడేళ్లుగా టెస్టు బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ టెస్టు యావరేజ్ ఘోరంగా పడిపోతూ వస్తోంది..

Image credit: PTI
2020 ఏడాది ఆరంభానికి ముందు 27 టెస్టు సెంచరీలతో ప్రస్తుత తరంలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ ప్లేస్ టాప్ 4లో ఉంది..
Image credit: PTI
స్టీవ్ స్మిత్ 32 సెంచరీలతో ప్రస్తుత తరంలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన బ్యాటర్‌గా టాప్ ప్లేస్‌కి ఎగబాకితే, ఈ మూడేళ్లలో 13 సెంచరీలు చేసిన జో రూట్, 30 సెంచరీలతో టాప్ 2లో ఉన్నాడు. కేన్ విలియంసన్, విరాట్ కోహ్లీ ఇద్దరూ 28 సెంచరీలతో టాప్ 3, 4 స్థానాల్లో ఉన్నారు..
Image credit: PTI
కేన్ విలియంసన్ ఈ మూడేళ్లలో 5 సెంచరీలు సాధిస్తే, విరాట్ కోహ్లీ మాత్రం ఒకే ఒక్క టెస్టు సెంచరీ చేశాడు. ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్ఘాన్‌పై టీ20 సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత వన్డేల్లో 3 సెంచరీలు చేసి... ఆఖరిగా టెస్టుల్లో మూడున్నరేళ్ల సుదీర్ఘ విరామానికి స్వస్తి పలికాడు..
Image credit: PTI
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, రెండో ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...
Image credit: PTI
‘విరాట్ కోహ్లీ, జో రూట్, స్టీవ్ స్మత్, కేన్ విలియంసన్.. ప్రస్తుత తరంలో ఫ్యాబ్ 4 అంటారు. అయితే డేవిడ్ వార్నర్‌కి కూడా ఈ లిస్టులో చోటు ఉండాలి. అతను కూడా నిలకడగా రాణిస్తూ సెంచరీలు చేస్తున్నాడు..
2014 నుంచి 2019 మధ్య కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే విరాట్ కోహ్లీకి ఫ్యాబ్ 4లో చోటు ఉంటుంది. ఆ తర్వాత కాలాన్ని జత చేస్తూ, ఇప్పుడు ఫ్యాబ్ 4 లేరు, కేవలం ఫ్యాబ్ 3 మాత్రమే. విరాట్ కోహ్లీ గణాంకాలు పూర్తిగా పడిపోయాయి..
Image credit: PTI
ఈ మూడేళ్లలో అతను 25 టెస్టులు ఆడి 1277 పరుగులు మాత్రమే చేశాడు. ఇది అతనికి ఏ మాత్రం సెట్ అవ్వదు. మూడేళ్లలో అతని టెస్టు సగటు 29.69 మాత్రమే. ఒకే ఒక్క సెంచరీ సాధించాడు, అది కూడా అహ్మదాబాద్ గ్రౌండ్‌లో..
Image credit: PTI
ఇదే సమయంలో డేవిడ్ వార్నర్ 23 టెస్టులు ఆడి 1250 పరుగులు చేశాడు. వార్నర్ టెస్టు సగటు 32.89గా ఉంది. అంతేకాకుండా అతను రెండు టెస్టు సెంచరీలు కూడా చేశాడు. ఒకవేళ ఫ్యాబ్ 4లో ఉండాలంటే డేవిడ్ వార్నర్, ఫ్యాబ్ 4 అవుతాడు. అంతేకానీ విరాట్ కోహ్లీ మాత్రం కాడు..’ అంటూ వ్యాఖ్యలు చేశాడు ఆకాశ్ చోప్రా..