- Home
- Sports
- Cricket
- 2 వేల గజాల్లో లగ్జరీ విల్లా, మధ్య 400 గజాల స్విమ్మింగ్ పూల్... విరాట్ కోహ్లీ కొత్త ఇంటి సోకులు చూస్తే...
2 వేల గజాల్లో లగ్జరీ విల్లా, మధ్య 400 గజాల స్విమ్మింగ్ పూల్... విరాట్ కోహ్లీ కొత్త ఇంటి సోకులు చూస్తే...
టీమిండియాలో బ్రాండ్‌లకే బ్రాండ్‌లా తయారయ్యాడు విరాట్ కోహ్లీ. ఆడినా, ఆడకపోయినా, కెప్టెన్సీ చేసినా, కెప్టెన్సీ ఊడిపోయినా విరాట్ కోహ్లీ ఫాలోయింగ్, క్రేజ్ మాత్రం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. కేవలం ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల ద్వారానే కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న విరాట్ కోహ్లీ.. ముంబైలోని అలీబాగ్ ఏరియాలో కొత్త ఇల్లు కట్టుకున్నాడు..

ముంబైలోని అలీబాగ్‌లోని జిరడ్ గ్రామానికి దగ్గర్లోని అవాస్ ప్రాజెక్ట్‌లో 8 ఎకరాలను కొనుగోలు చేసిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ... 2 వేల గజాల్లో విలాసవంతమైన విల్లాని నిర్మించారు. ఈ స్థలం ఖరీదు అక్షరాల 19 కోట్ల 24 లక్షల 50 వేల రూపాయలు.
Image: Google
స్థలం కొనుగోలు కోసం ప్రభుత్వానికి రూ.1 కోటి 15 లక్షలు పన్ను రూపంలో చెల్లించారు. స్టాంపు డ్యూటీ నిమిత్తం మరో 36 లక్షలు చెల్లించింది విరుష్క జోడీ...
2 వేల గజాల స్థలంలో 6 కోట్లు పెట్టి విల్లా నిర్మాణం పూర్తి చేయించాడు విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్. ఇందులో 400 గజాల్లో స్విమ్మింగ్ పూల్ కూడా నిర్మించారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ ఖాన్ కూతురు సుజన్ ఖాన్ ఈ ప్రాజెక్ట్‌ని స్పెషల్‌గా డిజైన్ చేసింది...
ఈ విల్లాకి దగ్గర్లోని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్థలం కొనుగోలు చేశాడు. అలీబాగ్‌లోని సరళ్ మహాత్రోలి గ్రామంలో తన భార్య రితికా పేరిట నాలుగు ఎకరాల స్థలం కొనుగోలు చేశాడు రోహిత్ శర్మ. అలాగే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రికి కూడా ఇదే ఏరియాలో ఫామ్ హౌజ్ ఉంది...
ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పాల్గొంటున్న విరాట్ కోహ్లీ, ఢిల్లీలో జరిగిన రెండో టెస్టు సమయంలో తన కొత్త ఇంటి నిర్మాణ పనులను పర్యవేక్షించాడు. పనులు ముగింపు దశకు చేరుకోవడంతో త్వరలో గృహ ప్రవేశం చేసేందుకు ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నట్టు సమాచారం...
టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆడబోతున్నాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత వారం రోజుల గ్యాప్‌లో ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభం అవుతుంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్... ఇలా బిజీబిజీగా గడపనుంది టీమిండియా...
ఇప్పటికే విరాట్ కోహ్లీకి ఢిల్లీలోని గుర్‌గ్రామ్‌లో, అనుష్క శర్మకి ముంబైలో విలాసవంతమైన ఇల్లు ఉన్నాయి. వివాహం తర్వాత ఈ ఇద్దరూ ముంబైలోని జూహూ హై టైడ్ బిల్డింగ్‌లో నాలుగో అంతస్థులో అద్దెకు ఉన్నారు విరుష్క జోడి. 1650 గజాల ఇంటికి నెలకు రెండున్నర లక్షల రూపాయలు అద్దె కట్టారు ఈ సెలబ్రిటీ కపుల్..