MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Sports
  • Cricket
  • అతని కెప్టెన్సీలో ఆడడంలో ఓ కిక్ ఉండేది, దాన్ని నేను డబుల్ చేస్తా... టీమిండియా నయా సారథి రోహిత్ శర్మ...

అతని కెప్టెన్సీలో ఆడడంలో ఓ కిక్ ఉండేది, దాన్ని నేను డబుల్ చేస్తా... టీమిండియా నయా సారథి రోహిత్ శర్మ...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌తో టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ, వచ్చే నెలలో సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ ద్వారా వన్డే కెప్టెన్సీ పగ్గాలు కూడా అందుకోబోతున్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు రోహిత్ శర్మ...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Dec 13 2021, 12:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

‘విరాట్ కోహ్లీ, తన కెప్టెన్సీతో భారత జట్టును వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా తయారుచేశాడు. ఈ ఐదేళ్లు జట్టును ముందుండి నడిపించాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కారణంగానే భారత జట్టు ఇప్పుడు ఇంత పటిష్టంగా తయారైంది. విరాట్ ప్రతీ గేమ్‌ను గెలవాలని ఎంతో కసిగా, పట్టుదలగా ఉండేవాడు...

310

జట్టులోని ప్రతి ఒక్కరిలోనూ అదే పట్టుదల కనిపించేది. వారి రోల్స్ గురించి స్పష్టమైన క్లారిటీ, అవగాహన ఉండేవి. విరాట్ కెప్టెన్సీలో ఆడడంలో ఓ కిక్ ఉండేది... ముఖ్యంగా నేను, విరాట్ కెప్టెన్సీలోనే ఎక్కువ క్రికెట్ ఆడాను...

410

తన కెప్టెన్సీలో ఆడిన ప్రతీ మూమెంట్‌ను ఎంతో ఎంజాయ్ చేశాడు. నేను కూడా విరాట్ చేసిన దాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తా. భారత జట్టును మరింత పటిష్టం చేయాల్సిన అవసరం చాలా ఉంది...

510

జట్టుగా పటిష్టమవుతూనే, ప్లేయర్లను కూడా మరింత మెరుగుపరచాలి. నేను అనుకునేది అదే, భారత జట్టు ఎప్పుడూ లేనంత మెరుగ్గా రాణించాలి...

610

నాకు ఈ అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నా. ఇది అద్భుత అవకాశం మాత్రమే కాదు, చాలా పెద్ద బాధ్యత కూడా. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్‌గా ఎంపికకావడం చాలా సంతోషాన్నిచ్చింది...

710

భారత జట్టును విజయపథంలో నడిపించడానికి ఎదురుచూస్తున్నా. నాకు అవకాశం వచ్చినప్పుడల్లా నిరూపించుకుంటూనే ఉన్నా. నా వరకూ విన్నింగ్ ఫార్ములా ఒకటే...

810

ప్లేయర్ల మధ్య ఎలాంటి అంతరాలు ఉండకూడదు. వారి పాత్ర ఏంటో ప్రతీ ఒక్కరికీ స్పష్టమైన అవగాహన ఉండాలి. అప్పుడే వాళ్లేం చేయాలనే విషయంలో ఎలాంటి కంఫ్యూజన్ ఉండదు...

910

కెప్టెన్‌తో పాటు హెడ్ కోచ్‌ కూడా జట్టుకి చాలా కీలకం. మేమిద్దం ఈ విషయంపైనే దృష్టి పెడుతున్నాం. జట్టుకి ఎంపికైన ప్రతీ ఒక్క ప్లేయర్‌కి ఏం చేయాలనే విషయంలో స్పష్టత ఇస్తేనే చాలని అనుకుంటున్నాం...’ అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ...

1010

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా ఉన్న రోహిత్ శర్మ, ఇప్పటికే 32 మ్యాచుల్లో భారత జట్టుకి తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు...

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved