అవును, విరాట్ కోహ్లీ కచ్ఛితంగా సెల్ఫిష్ క్రికెటరే! ఎందుకంటే... వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్...
విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంత మంది ఉన్నారో, స్వదేశంలో హేటర్స్ కూడా అంతేమంది ఉన్నారు. సచిన్ టెండూల్కర్, ధోనీ, రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కి విరాట్ కోహ్లీ నచ్చడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో 2 సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 95 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..
Virat Kohli-Shreyas Iyer
సౌతాఫ్రికాతో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆరో ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 121 బంతుల్లో 10 ఫోర్లతో 101 పరుగులు చేశాడు..
ఆరంభంలో వచ్చిన రోహిత్ శర్మ 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి.. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో సెంచరీ కోసం స్లోగా ఆడాడని ఆరోపించారు రోహిత్ శర్మ ఫ్యాన్స్...
కేవలం సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును సమం చేయాలనే ఉద్దేశంతోనే విరాట్ కోహ్లీ ఇలా స్లోగా ఆడాడని, కోహ్లీ స్లో బ్యాటింగ్ వల్ల భారత జట్టు 40+ పరుగులు నష్టపోయిందంటూ ‘సెల్ఫిష్’ ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు యాంటీ ఫ్యాన్స్..
ఈ ట్రోలింగ్‌పై భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ తన స్టైల్‌లో స్పందించాడు. ‘విరాట్ కోహ్లీ సెల్ఫిష్‌గా ఆడుతున్నాడని, వ్యక్తిగత మైలురాళ్ల కోసం పాకులాడుతున్నాడని కొన్ని ఫన్నీ ట్రోల్స్ చూస్తున్నా, వింటున్నా..
అవును, కోహ్లీ నిజంగా సెల్ఫిష్ క్రికెటరే. కొన్ని కోట్ల మంది కలలను నిజం చేయాలని ఆరాటపడుతున్నాడు చూడు అందుకే సెల్ఫిష్.. ఇప్పటికే ఎంతో సాధించినా, ఇంకా ఏదో చేయాలని మళ్లీ మళ్లీ తాపత్రయపడుతున్నాడు చూడు దానికే సెల్ఫిష్..
Virat Kohli
కొత్త కొత్త బెంచ్ మార్క్స్ సెట్ చేస్తూ తన ఆటతీరును మరింత మెరుగుపర్చుకుంటున్నాడు కదా అందుకే సెల్ఫిష్.. ఎలాగైనా టీమ్‌ని గెలిపించాలని అనుకుంటున్నాడు చూడు అందుకే సెల్ఫిష్.. ఇవన్నీ సెల్ఫిష్‌నెస్ అయితే, అవును విరాట్ కోహ్లీ నిజంగా సెల్ఫిష్ క్రికెటరే..’ అంటూ ట్వీట్ చేశాడు వెంకటేశ్ ప్రసాద్..