- Home
- Sports
- Cricket
- విరాట్ కోహ్లీ షాకింగ్ నిర్ణయం... మునుపటి ఫామ్‌లోకి వచ్చేందుకు ఐపీఎల్ ముగిసిన తర్వాత...
విరాట్ కోహ్లీ షాకింగ్ నిర్ణయం... మునుపటి ఫామ్‌లోకి వచ్చేందుకు ఐపీఎల్ ముగిసిన తర్వాత...
భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ, ప్రస్తుత క్రికెట్ తరంలో లెజెండ్. క్రికెట్‌లో కొనసాగుతున్న నేటి తరంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్న విరాట్, ఓవరాల్‌గా అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలోనూ మూడో స్థానంలో ఉన్నాడు...

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ క్రియేట్ చేసిన 71 అంతర్జాతీయ సెంచరీల రికార్డును అందుకునేందుకు ఒకే ఒక్క శతకం దూరంలో ఉన్నాడు భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ...
రెండున్నరేళ్లుగా టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో సెంచరీ మార్కు అందుకోలేకపోతున్న విరాట్ కోహ్లీ, శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ బ్యాటింగ్‌లో తన స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోయాడు...
రెండు టెస్టుల్లో, మూడు ఇన్నింగ్స్‌ల్లో 27 సగటుతో 81 పరుగులు మాత్రమే చేసిన విరాట్ కోహ్లీ... ఈ పర్ఫామెన్స్ కారణంగా అరుదైన రికార్డును కూడా కోల్పోవాల్సి వచ్చింది...
మూడు ఫార్మాట్లలోనూ 50+ సగటు ఉన్న ఏకైక బ్యాటర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, ఇప్పుడు టెస్టుల్లో ఆ ఫీట్ కోల్పోయాడు. విరాట్ టెస్టు సగటు 49.96కి పడిపోయింది...
బ్యాటింగ్‌పైన ఫోకస్ పెట్టేందుకు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా, ఆ నిర్ణయం వల్ల బీసీసీఐతో విభేదాలు రావడం తప్ప సెంచరీ మాత్రం ఇప్పటిదాకా రాలేదు...
అందుకే తిరిగి మునుపటి ఫామ్‌ను అందుకునేందుకు బేసిక్స్ నుంచి మొదలెట్టాలని ఫిక్స్ అయ్యాడట విరాట్ కోహ్లీ. దీనికోసం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడట...
ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత రంజీ ట్రోఫీలో ఆడాలని విరాట్ కోహ్లీ భావిస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫాఫ్ డుప్లిసిస్ కెప్టెన్సీలో ఆర్‌సీబీలో కీ ప్లేయర్‌గా ఉండబోతున్నాడు విరాట్ కోహ్లీ. ఐపీఎల్‌లో కూడా తన బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించలేకపోతే, అనుకున్నట్టుగా రాణించకపోతే రంజీ ట్రోఫీ ఆడాలని అనుకుంటున్నాడట విరాట్...
ఒకవేళ ఐపీఎల్‌లో బ్యాటింగ్‌లో రాణిస్తే మాత్రం రంజీ ట్రోఫీలో పాల్గొనకుండా, సౌతాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఆడతాడని సోషల్ మీడియా వర్గాల అంచనా...
అయితే కెరీర్ ఆరంభంలో ఢిల్లీ తరుపున రంజీ మ్యాచులు ఆడాడు విరాట్ కోహ్లీ. ఈ సీజన్‌లో ఢిల్లీ, ఎలైట్ గ్రూప్ హెచ్‌లో ఆఖరి స్థానంలో నిలిచి నాకౌట్ స్టేజ్‌కి అర్హత కూడా సాధించలేకపోయింది...
ఒకవేళ ఎలాగైనా రంజీ ట్రోఫీ ఆడాలని విరాట్ కోహ్లీ అనుకుంటే ఏ జట్టు తరుపున ఆడతాడనేది కూడా ఇంట్రెస్టింగ్‌గా మారింది.
టెస్టుల్లో సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేక టీమిండియాకి దూరమై, రంజీ ట్రోఫీ ఆడిన అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా... ఈ టోర్నీలో కూడా ఘోరంగా విఫలమయ్యారు...
ఒకవేళ విరాట్ కోహ్లీ రంజీ ట్రోఫీ ఆడి, అక్కడ కూడా సెంచరీ మార్కు అందుకోలేకపోతే... అప్పుడు ఏం చేస్తాడని? ప్రశ్నిస్తున్నారు కొందరు క్రికెట్ అభిమానులు... అదే జరిగితే కావాలని జట్టుకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న విరాట్, టీమ్‌లో తన స్థానాన్ని తానే చిక్కుల్లో పడేసుకున్నట్టు అవుతుందని అభిప్రాయపడుతున్నారు క్రికెట్ విశ్లేషకులు...